వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం 'విన్‌ఫాస్ట్' భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే వాహనదారుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం భారత్‌లో విన్‌ఫాస్ట్ వీఎఫ్ 6, విన్‌ఫాస్ట్ వీఎఫ్ 7 అనే రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను కంపెనీ విక్రయిస్తోంది. వీటిలో వీఎఫ్ 6 మోడల్ అత్యంత సరసమైన ధరలో లభిస్తుండటమే కాకుండా.. ఇటలీకి చెందిన 'టొరినో డిజైన్' రూపొందించిన స్టైలిష్ లుక్, అత్యాధునిక ఫీచర్లతో టాటా కర్వ్ ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ వంటి కార్లకు గట్టి పోటీనిస్తోంది. ఈ నేపథ్యంలో మీరు ఈ ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. దీని ధర, నెలవారీ ఈఎంఐ ఎంత ఉంటుంది? వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..
విన్‌ఫాస్ట్ వీఎఫ్ 6- వేరియంట్లు, ధరలు..

భారత్‌లో విన్‌ఫాస్ట్ వీఎఫ్ 6 మొత్తం మూడు వెరియంట్లలో అందుబాటులో ఉంది. అవి..
- ఎర్త్
- విండ్
- విండ్ ఇన్ఫినిటీ
ఈ వేరియంట్ల ధరలు రూ. 17.29 లక్షల నుంచి ప్రారంభమై, టాప్-ఎండ్ మోడల్ రూ. 19.19 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. హై-టెక్ ఫీచర్లు కోరుకునే ఐదుగురు సభ్యుల కుటుంబానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా నిలుస్తోంది.
విన్‌ఫాస్ట్ వీఎఫ్ 6- నెలవారీ ఈఎంఐ ఎంత ఉంటుంది?
ఒకవేళ మీరు ఈ ఏప్రిల్‌లో విన్‌ఫాస్ట్ వీఎఫ్ 6 కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, మీకు పడే నెలవారీ ఈఎంఐ లెక్కలు ఇక్కడ ఉన్నాయి.
| విన్‌ఫాస్ట్ వీఎఫ్ 6- నెలవారీ ఈఎంఐ.. | ||||||
|---|---|---|---|---|---|---|
| Model & variant | Price (ex-showroom) | Loan (100% ex-showroom price) | Interest rate | Repayment tenure | Monthly EMI | Total interest |
| VinFast VF 6 Wind Infinity | ₹19,19,000 | ₹19,19,000 | 9.5% | 24 months | ₹88,110 | ₹1,95,638 |
| 36 months | ₹61,471 | ₹2,93,964 | ||||
| 48 months | ₹48,211 | ₹3,95,142 | ||||
| 60 months | ₹40,303 | ₹4,99,154 | ||||
మేము టాప్-ఎండ్ మోడల్ 'విండ్ ఇన్ఫినిటీ' (ధర రూ. 19.19 లక్షలు) ను ప్రాతిపదికగా తీసుకున్నాము. 100% ఎక్స్-షోరూమ్ ధరను లోన్ మొత్తంగా భావించి, 9.5% వడ్డీ రేటుతో వివిధ కాలపరిమితులకు అయ్యే ఈఎంఐ వివరాలు కింద చూడవచ్చు:
2 ఏళ్ల కాలపరిమితి (24 నెలలు): మీరు 24 నెలల పాటు లోన్ చెల్లించాలనుకుంటే, నెలకు రూ. 88,110 ఈఎంఐ పడుతుంది.
{{/usCountry}}2 ఏళ్ల కాలపరిమితి (24 నెలలు): మీరు 24 నెలల పాటు లోన్ చెల్లించాలనుకుంటే, నెలకు రూ. 88,110 ఈఎంఐ పడుతుంది.
{{/usCountry}}3 ఏళ్ల కాలపరిమితి (36 నెలలు): ఒకవేళ మూడేళ్ల టెన్యూర్ ఎంచుకుంటే, నెలవారీ వాయిదా రూ. 61,471 గా ఉంటుంది.
4 ఏళ్ల కాలపరిమితి (48 నెలలు): నాలుగేళ్ల కాలపరిమితికి నెలకు రూ. 48,211 చెల్లించాల్సి ఉంటుంది.
5 ఏళ్ల కాలపరిమితి (60 నెలలు): లోన్ భారాన్ని తగ్గించుకోవాలని చూసే వారికి, ఐదేళ్ల టెన్యూర్‌పై నెలవారీ ఈఎంఐ రూ. 40,303 మాత్రమే పడుతుంది.
గమనిక: మీ క్రెడిట్ స్కోర్, బ్యాంక్ నిబంధనలను బట్టి వడ్డీ రేట్లు, లోన్ మొత్తంలో మార్పులు ఉండవచ్చు.
విన్‌ఫాస్ట్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు..
భారత ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగంలో తన పట్టును పటిష్టం చేసుకునేందుకు వియత్నాం కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా తన అప్‌కమింగ్ మోడల్ వీఎఫ్ ఎంపీవీ 7కు సంబంధించిన మొదటి అధికారిక టీజర్ ఇమేజ్‌ను విడుదల చేసింది. అంతేకాదు ఈ ఈవీని అతి త్వరలోనే భారత్‌లో లాంచ్ చేయబోతున్నట్లు సంకేతాలిచ్చింది. ఇప్పటికే వీఎఫ్6, వీఎఫ్7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను పరిచయం చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు విశాలమైన 7-సీటర్ ఎంపీవీ విభాగంలోకి అడుగుపెడుతోంది.
అధికారిక లాంచ్ సమయంలో పూర్తి వివరాలు వెల్లడికానున్నప్పటికీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ వీఎఫ్ ఎంపీవీ 7 ఎలక్ట్రిక్ కారు 60.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. ఇది ఫ్రంట్-యాక్సిల్ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా సుమారు 150 బీహెచ్పీ పవర్, 280 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.