భారత ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగంలో తన పట్టును పటిష్టం చేసుకునేందుకు వియత్నాం కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా తన అప్‌కమింగ్ మోడల్ వీఎఫ్ ఎంపీవీ 7కు సంబంధించిన మొదటి అధికారిక టీజర్ ఇమేజ్‌ను విడుదల చేసింది. అంతేకాదు ఈ ఈవీని అతి త్వరలోనే భారత్‌లో లాంచ్ చేయబోతున్నట్లు సంకేతాలిచ్చింది. ఇప్పటికే వీఎఫ్6, వీఎఫ్7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను పరిచయం చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు విశాలమైన 7-సీటర్ ఎంపీవీ విభాగంలోకి అడుగుపెడుతోంది.
వీఎఫ్ ఎంపీవీ 7- ప్రైవేట్ వినియోగదారుల కోసం ప్రత్యేకం..

ఈ కొత్త మోడల్ విన్‌ఫాస్ట్ 'లిమో గ్రీన్' వెర్షన్‌తో సమానమైన బాడీ సైజు, సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, వీఎఫ్ ఎంపీవీ 7ను ప్రత్యేకంగా ప్రైవేట్ వినియోగదారుల కోసం రూపొందించారు. కేవలం కమర్షియల్ అవసరాల కోసం వచ్చే లిమో గ్రీన్‌తో పోలిస్తే, ఈ ఫ్యామిలీ ఈవీలో లగ్జరీ ఫీచర్లు అధికంగా ఉన్నాయి:
ఎక్స్టీరియర్: విన్‌ఫాస్ట్ సిగ్నేచర్ డిజైన్ శైలిలో స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఇంటర్‌కనెక్టెడ్ టెయిల్ లైట్లు, ఆకర్షణీయమైన 19-ఇంచ్ అలాయ్ వీల్స్.
ఇంటీరియర్: ప్రీమియం లెదరెట్ సీట్లు, కీ-లెస్ ఎంట్రీ, కారు ముందు, వెనుక భాగాల్లో ఇంటిగ్రేటెడ్ లైటింగ్.
టెక్నాలజీ: 10.1-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఛార్జింగ్ కోసం యూఎస్బీ-ఏ, యూఎస్బీ- సీ పోర్టులు.
కంఫర్ట్: హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, మెరుగైన డ్రైవింగ్ అనుభవం కోసం అడ్జస్టబుల్ స్టీరింగ్ సౌకర్యం.
వీఎఫ్ ఎంపీవీ 7- సాంకేతిక వివరాలు..
అధికారిక లాంచ్ సమయంలో పూర్తి వివరాలు వెల్లడికానున్నప్పటికీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ వీఎఫ్ ఎంపీవీ 7 ఎలక్ట్రిక్ కారు 60.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. ఇది ఫ్రంట్-యాక్సిల్ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా సుమారు 150 బీహెచ్పీ పవర్, 280 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
వేగం: కేవలం 10 సెకన్ల కంటే తక్కువ సమయంలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. సిటీ ట్రాఫిక్, హైవే ప్రయాణాలకు ఇది సరైన ఎంపికగా నిలవనుంది.
{{/usCountry}}వేగం: కేవలం 10 సెకన్ల కంటే తక్కువ సమయంలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. సిటీ ట్రాఫిక్, హైవే ప్రయాణాలకు ఇది సరైన ఎంపికగా నిలవనుంది.
{{/usCountry}}డ్రైవింగ్ మోడ్స్: ఇందులో వివిధ రకాల డ్రైవ్ మోడ్స్, రీజెనరేటివ్ బ్రేకింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
వీఎఫ్ ఎంపీవీ 7- పోటీ, ధర..
భారత మార్కెట్లో ఇది ప్రధానంగా కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ, బీవైడీ ఈమ్యాక్స్ 7 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 19.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండే అవకాశం ఉందని అంచనా. ఇదే ధరలో ఉన్న మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్కి కూడా ఇది గట్టి పోటీనిస్తుంది.
రాబోయే కొద్ది వారాల్లోనే ఈ కారు వేరియంట్లు, ఖచ్చితమైన ధర, రంగులు, రేంజ్, వివరాలు వెల్లడికానున్నాయి. విన్‌ఫాస్ట్ నుంచి వస్తున్న ఈ 7-సీటర్ ఈవీ భారతీయ కుటుంబాలకు ఒక ప్రీమియం, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా మారబోతోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. విన్‌ఫాస్ట్ కార్లకు బ్యాటరీ వారంటీ ఎంత ఉంటుంది?
విన్‌ఫాస్ట్ తన ఎలక్ట్రిక్ వాహనాలపై పరిశ్రమలోనే అత్యుత్తమమైన వారంటీని అందిస్తోంది. సాధారణంగా ఈ సంస్థ తన కార్లపై 10 ఏళ్లు లేదా 2,00,000 కిలోమీటర్ల వరకు 'బంపర్-టు-బంపర్' వారంటీని ఇస్తుంది. ఇందులో బ్యాటరీ కూడా కవర్ అవుతుంది. కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో బ్యాటరీపై అన్‌లిమిటెడ్ మైలేజ్ వారంటీని కూడా అందిస్తోంది. భారత్‌లో కూడా ఇటువంటి భారీ వారంటీ పీరియడ్‌ను ప్రకటించడం వల్ల వినియోగదారులకు బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ఖర్చుల గురించి ధీమా ఉంటుంది.
2. భారత్‌లో విన్‌ఫాస్ట్ సర్వీస్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి?
విన్‌ఫాస్ట్ ఇప్పటికే భారత్‌లో తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నం, ముంబై, పూణే, చెన్నై, నోయిడా వంటి ప్రధాన నగరాలతో పాటు దాదాపు 35కి పైగా షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. 2026 చివరి నాటికి ఈ సంఖ్యను 75కి పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా, కస్టమర్ల వద్దకే వచ్చి రిపేర్లు చేసే ‘మొబైల్ సర్వీస్’ సదుపాయాన్ని కూడా విన్‌ఫాస్ట్ ప్రమోట్ చేస్తోంది.