Rolls Royce tea experiment : రోడ్డు పక్కన టీ- స్టాల్లో టీ తగడం సర్వసాధారణమైన విషయం. కానీ మీరు టీ తగడానికి వెళ్లినప్పుడు అక్కడ రోల్స్ రాయిస్ కనిపిస్తోంది? అందులో కూర్చోబెట్టి మీకు టీ సర్వ్ చేస్తే? ఆ లగ్జరీ కారులో మీరు టీ సిప్ చేస్తూ తిరిగితే? ఆ ఊహే అద్భుతంగా ఉంది కదూ! అయితే దీనినే బిజినెస్ మోడల్ కింద మార్చుకోవచ్చా? అన్న ఆలోచన ఓ కంటెంట్ క్రియేటర్‌కి వచ్చింది. వెంటనే తన ప్లాన్‌ని అమలు చేశాడు. రోల్స్ రాయిస్ని ఒక రోజంతా అద్దెకు తీసుకుని, కస్టమర్లను అందులో కూర్చోబెట్టి టీ అందించాడు. దీని ద్వారా అతను ఎంత సంపాదించాడు? లాభమొచ్చిందా? లేక నష్టపోయాడా? ఇక్కడ తెలుసుకోండి..
రోల్స్ రాయిస్‌లో టీ సర్వీస్..

సోషల్ మీడియాలో వినూత్న ప్రయోగాలు చేస్తూ పాపులర్ అయిన 'డీలక్స్ భయ్యాజీ' అనే కంటెంట్ క్రియేటర్ తాజాగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఏకంగా రూ. 1 లక్ష ఖర్చు చేసి ఒక రోల్స్ రాయిస్ కారును అద్దెకు తీసుకున్నాడు. సాధారణ స్ట్రీట్ కల్చర్‌ను లగ్జరీతో మిళితం చేస్తూ ‘టీ అండ్ డ్రైవ్’ అనుభవాన్ని కస్టమర్లకు అందించడం ప్రారంభించాడు. ఇందుకోసం రోడ్డు పక్కన ఒక రెడ్ కార్పెట్ వేసి, స్నాక్స్, టీ కప్పులతో టేబుల్ సర్ది ఒక చిన్న లగ్జరీ సెటప్ ఏర్పాటు చేశాడు.
రోల్స్ రాయిస్ కారులో తిరగడం అనేది సామాన్యులకు కల. ఆ కలను నెరవేరుస్తూ.. రూ. 1,000 చెల్లిస్తే చాలు, కారులో కాసేపు షికారు చేస్తూ నాణ్యమైన టీ తాగవచ్చని ఆయన ఆఫర్ ప్రకటించాడు.
ఒక కస్టమర్ ఈ ఆఫర్‌ను ఎంచుకుని, కారులో ప్రయాణిస్తూ కుంకుమపువ్వు కలిపిన టీని ఆస్వాదించారు. దీనిపై ఆయన ఎంతో సానుకూలంగా స్పందించారు.
ఇక రోడ్డుపై వెళ్లే జనం ఈ వింత ప్రయోగాన్ని చూసి ఆకర్షితులయ్యారు. నెమ్మదిగా కస్టమర్ల సంఖ్య పెరిగింది. అందరూ ఆ లగ్జరీ కారులో కూర్చుని చాయ్ తాగడాన్ని ఒక గొప్ప అనుభూతిగా భావించారు.
లాభమా.. నష్టమా?
రోజంతా కష్టపడిన తర్వాత వచ్చిన లెక్కలు చూస్తే.. మొత్తం రూ. 88,500 వసూలైంది. అంటే కారు అద్దెకు చెల్లించిన లక్ష రూపాయల పెట్టుబడి కూడా వెనక్కి రాలేదు. నికరంగా రూ. 11,500 నష్టం వచ్చింది! టీ తయారీ ఖర్చులు సపరేటు.
{{/usCountry}}రోజంతా కష్టపడిన తర్వాత వచ్చిన లెక్కలు చూస్తే.. మొత్తం రూ. 88,500 వసూలైంది. అంటే కారు అద్దెకు చెల్లించిన లక్ష రూపాయల పెట్టుబడి కూడా వెనక్కి రాలేదు. నికరంగా రూ. 11,500 నష్టం వచ్చింది! టీ తయారీ ఖర్చులు సపరేటు.
{{/usCountry}}పెట్టుబడి రాలేదు కదా అని భయ్యాజీ నిరాశ చెందలేదు. డబ్బు కంటే కూడా ప్రజలకు ఒక మర్చిపోలేని అనుభూతిని పంచడంలో తాను విజయం సాధించానని ఆయన పేర్కొన్నాడు.
నెటిజన్లు కూడా ఈ ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. "వ్యాపారంలో లాభనష్టాల కంటే క్రియేటివిటీ ముఖ్యం.. చిన్న చిన్న మార్పులు చేస్తే ఇది మంచి లాభదాయకమైన బిజినెస్ అవుతుంది," అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన డీలక్స్ భయ్యాజీ పోస్ట్‌ని ఇక్కడ చూసేయండి :
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. రోల్స్ రాయిస్ టీ ఎక్స్‌పీరియన్స్ ధర ఎంత?
ఒక చిన్న రైడ్, టీ కోసం డీలక్స్ భయ్యాజీ కస్టమర్ల నుంచి రూ. 1,000 వసూలు చేశారు.
2. ఈ వ్యాపారంలో ఆయనకు లాభం వచ్చిందా?
లేదు, ఆ రోజు చివరికి ఆయనకు రూ. 88,500 వచ్చాయి. కారు అద్దె లక్ష రూపాయలు కావడంతో, పెట్టుబడి కంటే రూ. 11,500 తక్కువే సంపాదించారు.
3. కస్టమర్ల స్పందన ఎలా ఉంది?
కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. లగ్జరీ కారులో టీ తాగడం అనే కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో చాలా మంది దీనిని ఆస్వాదించారు.
4. ఈ వీడియో ఎక్కడ వైరల్ అవుతోంది?
డీలక్స్ భయ్యాజీ అనే క్రియేటర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.