Rohit Kohli: 2024 టీ20 ప్రపంచకప్ విక్టరీ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు, ఆ తర్వాత టెస్టులకు వీడ్కోలు పలికిన టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కన్ను ఇప్పుడు 2027 వన్డే ప్రపంచకప్‌పైనే పడింది. వెస్టిండీస్‌తో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు ముందు జియోహాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో మాట్లాడిన రో-కో సంచలన వ్యాఖ్యలు చేశారు.
అదే నా ఆఖరి వరల్డ్ కప్

వచ్చే ఏడాది దక్షణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీయే భారత్ తరఫున తాను ఆడే చివరి వరల్డ్ కప్ అని రన్‌మెషిన్ విరాట్ కోహ్లి అధికారికంగా స్పష్టం చేశారు.
"వన్డే వరల్డ్ కప్ ఇంటెన్సిటి చాలా ఎక్కువగా ఉంటుంది. టీ20 ఇంటెన్సిటీతో 10 మ్యాచ్‌లు ఆడటం సాధారణ విషయం కాదు. పైగా విదేశీ పిచ్‌లపై ఈ సవాలు మరీ ఎక్కువ. ఇది భారత్ తరఫున నాకు చివరి ప్రపంచకప్ (2027). అందుకే నా శక్తినంతా ధారపోసి కప్‌ను గెలవడమే నా ఏకైక లక్ష్యం. దానికోసం ఎంతైనా కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాను" అని కోహ్లీ తెలిపారు.
ఆ కల ఇంకా నెరవేరలేదు
మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు వన్డే ప్రపంచకప్ గెలవాలనే కోరిక ఇంకా అలానే ఉంది. 2023లో అహ్మదాబాద్‌లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమి రోహిత్‌ను తీవ్రంగా గాయపరిచింది. అందుకే ప్రపంచకప్ టార్గెట్ ను మర్చిపోలేదు.
38 ఏళ్ల వయసులోనూ బరువు తగ్గి, ఆటకు ఏమాత్రం విరామం ఇవ్వకుండా పరుగుల వరద పారిస్తున్న రోహిత్.. "కెరీర్ ముగిసిపోయిందనే ఆలోచన నా మైండ్‌లోకి రాదు. వన్డే ప్రపంచకప్ ఛాలెంజ్ చాలా ప్రత్యేకమైంది. వేర్వేరు ప్రత్యర్థులు, రకరకాల వేదికలు ఉంటాయి. దానికోసం భిన్నమైన వ్యూహాలతో సిద్ధం కావాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికాలో జరగబోయే ఈ టోర్నీలో నా 'అన్‌ఫినిష్డ్ బిజినెస్'ను పూర్తి చేయడమే నా టార్గెట్" అని స్పష్టం చేశారు.
మోస్ట్ ఇంపార్టెంట్!
2011 తర్వాత భారత్ మళ్లీ 50 ఓవర్ల ప్రపంచకప్ గెలవకపోవడం ఒక శాపంగా మారింది. రోహిత్-కోహ్లీ ద్వయం జట్టును ముందుకు నడిపినా ఐసీసీ ట్రోఫీ చేజారుతూ వచ్చింది. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచి టీ20లు, ఆ తర్వాత టెస్టుల నుంచి వైదొలిగిన తర్వాత, వీరు ఇద్దరూ కేవలం వన్డే ఫార్మాట్‌పై మాత్రమే పూర్తి దృష్టి పెట్టడం భారత క్రికెట్‌కు ప్లస్ పాయింట్.
{{/usCountry}}2011 తర్వాత భారత్ మళ్లీ 50 ఓవర్ల ప్రపంచకప్ గెలవకపోవడం ఒక శాపంగా మారింది. రోహిత్-కోహ్లీ ద్వయం జట్టును ముందుకు నడిపినా ఐసీసీ ట్రోఫీ చేజారుతూ వచ్చింది. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచి టీ20లు, ఆ తర్వాత టెస్టుల నుంచి వైదొలిగిన తర్వాత, వీరు ఇద్దరూ కేవలం వన్డే ఫార్మాట్‌పై మాత్రమే పూర్తి దృష్టి పెట్టడం భారత క్రికెట్‌కు ప్లస్ పాయింట్.
{{/usCountry}}కేవలం ఒక్క ఫార్మాట్‌పైనే ఫోకస్ చేయడం వల్ల ఫిట్‌నెస్, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ సెట్ అవుతుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో జరగబోయే వరల్డ్ కప్‌లో ఈ దిగ్గజ ద్వయం భారత్‌కు మరో ఐసీసీ ట్రోఫీ అందించాలనే పట్టుదలతో ఉంది.