6200ఎంఏహెచ్ బ్యాటరీతో Vivo X200T.. అతి త్వరలోనే లాంచ్! ధర, ఫీచర్లు..
వివో నుంచి రాబోతున్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'వివో ఎక్స్200టీ' త్వరలో భారత్‌లో విడుదల కానుంది. 12జీబీ ర్యామ్, Zeiss కెమెరాలు, శక్తివంతమైన డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్ వంటి ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ ధర సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వివో ప్రియులకు గుడ్ న్యూస్! ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'వివో X200T' స్మార్ట్‌ఫోన్ భారత్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రత్యేక పేజీ లైవ్ కావడంతో, ఈ ఫోన్ విడుదల అతి సమీపంలోనే ఉందని స్పష్టమైంది. అయితే అధికారిక ప్రకటన కంటే ముందే ఈ స్మార్ట్‌ఫోన్ ధర, డిజైన్, అదిరిపోయే ఫీచర్లు నెట్టింట లీక్ అయ్యాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో ఎక్స్200టీ ధర ఎంత ఉండవచ్చు?
ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సమాచారం ప్రకారం.. వివో ఎక్స్200టీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది:
12GB + 256GB వేరియంట్: రూ. 59,999
12GB + 512GB వేరియంట్: రూ. 69,999
ఇది బ్లాక్, పర్పుల్ వంటి స్టైలిష్ రంగుల్లో లభించనుందని తెలుస్తోంది. అయితే ధర విషయంలో కంపెనీ నుంచి ఇంకా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
వివో ఎక్స్200టీ లుక్ అదిరిపోయింది!
లీక్ అయిన రెండర్స్ (ఫోటోల) ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ఒక పెద్ద వృత్తాకార కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో మూడు కెమెరాలు అమర్చారు. ముందు వైపు పంచ్-హోల్ డిస్‌ప్లేతో ఈ స్మార్ట్‌ఫోన్ చాలా ప్రీమియంగా కనిపిస్తోంది. కుడివైపు వాల్యూమ్, పవర్ బటన్లు ఉండగా.. ఎడమ వైపు క్లీన్‌గా ఉంటుంది.
వివో ఎక్స్200టీ కీలక ఫీచర్లు (అంచనా)..
డిస్‌ప్లే: 6.67-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్‌ప్లే.
ప్రాసెసర్: అత్యంత వేగవంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్.
కెమెరా: ఇందులో 50ఎంపీ మెయిన్ కెమెరా (సోనీ ఎల్వైటీ-702), 50ఎంపీ అల్ట్రావైడ్, 50ఎంపీ పెరిస్కోప్ కెమెరాతో కూడిన Zeiss లెన్స్ సెటప్ ఉండనుంది. సెల్ఫీల కోసం 32ఎంపీ కెమెరా ఉంటుంది.
- అమెజాన్ సేల్‌లో ఐఫోన్ 17 సిరీస్‌పై కళ్లుచెదిరే ఆఫర్లు.. భారీగా తగ్గిన ధరలు! పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
బ్యాటరీ: 6,200ఎంఏహెచ్ భారీ బ్యాటరీ. దీనికి తోడు 90డబ్ల్యూ వైర్డ్, 40డబ్ల్యూ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
సాఫ్ట్‌వేర్: ఈ వివో ఎక్స్200టీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6పై పనిచేస్తుంది. ఐదేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ఏడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లకు కంపెనీ హామీ ఇస్తుందని సమాచారం.
ఇతర ఫీచర్లు: వాటర్, డస్ట్ నుంచి ప్రొటెక్షన్ కోసం ఐపీ68/ ఐపీ69 రేటింగ్, 3డీ అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి.
కాగా, లాంచ్ డేట్, ధర సహా ఇతర విషయాలపై వివో సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
మొత్తానికి అదిరిపోయే కెమెరా, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్‌ను కోరుకునే టెక్ ప్రియులకు వివో ఎక్స్200టీ ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇండియాలో వివోకి ఉన్న బ్రాండ్ వాల్యూని ఈ ఫోన్ మరింత పెంచుతుందని అభిప్రాయపడుతున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


