7200ఎంఏహెచ్​ బడా బ్యాటరీతో Vivo Y500i లాంచ్​- ధర ఎంతంటే..

వివో సంస్థ చైనాలో తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ 'వివో వై500ఐ'ని విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రధానంగా 7,200ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Jan 12, 2026, 15:31:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో తన వై-సిరీస్‌లో మరో సరికొత్త ఫోన్‌ను మార్కెట్​లోకి తెచ్చింది. ఎటువంటి ఆర్భాటం లేకుండా 'వివో వై500ఐ'స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్​లో లాంచ్​ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతం కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది మూడు ఆకర్షణీయమైన రంగులు, ఐదు రకాల స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది.

వివో వై500ఐ లాంచ్​.. (Representative image)
వివో వై500ఐ లాంచ్​.. (Representative image)

వివో వై500ఐ- ధర, లభ్యత..

చైనాలో ఈ వివో వై500ఐ స్మార్ట్​ఫోన్​ బేస్ వేరియంట్ (8GB+128GB) ధరను 1,499 యువాన్లుగా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 19,000. ఇతర వేరియంట్ల ధరలు ఇలా ఉన్నాయి:

  • 8GB+256GB: సుమారు రూ. 23,000
  • 8GB+512GB: సుమారు రూ. 26,000
  • 12GB+256GB: సుమారు రూ. 26,000
  • 12GB+512GB (టాప్ ఎండ్): సుమారు రూ. 28,000

ఈ స్మార్ట్​ఫోన్ గెలాక్సీ సిల్వర్, ఫోనిక్స్ గోల్డ్, అబ్సిడియన్ బ్లాక్ రంగుల్లో మెరిసిపోతోంది.

వివో వై500ఐ- అద్భుతమైన ఫీచర్లు..

బ్యాటరీ దీని హైలైట్: స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఈ ఫోన్ వైపు చూడటానికి ప్రధాన కారణం ఇందులో ఉన్న 7,200ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ అని చెప్పుకోవాలి. దీనికి తోడు ఈ వివో వై500ఐలో 44డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఇక ఫోన్ బరువు విషయానికి వస్తే 219 గ్రాములు ఉంటుంది. 8.39ఎంఎం మందంతో స్లిమ్‌గానే కనిపిస్తుంది.

డిస్​ప్లే, పర్ఫార్మెన్స్: వివో వై500ఐ స్మార్ట్​ఫఫోన్​లో 6.75 ఇంచ్​ ఎల్‌సీడీ డిస్​ప్లేని అందించారు. ఇది 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్​తో పనిచేస్తుంది. దీనివల్ల ఫోన్ వాడేటప్పుడు చాలా స్మూత్​గా అనిపిస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై ఇది నడుస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6పై ఈ ఫోన్ పనిచేస్తుండటం విశేషం.

కెమెరా విశేషాలు: వివో వై500ఐ స్మార్ట్​ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అమర్చారు. ఇది 10x డిజిటల్ జూమ్, ఆటో ఫోకస్ ఫీచర్లతో వస్తుంది. సెల్ఫీల కోసం ముందు వైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ద్వారా 1080పీ రిజల్యూషన్​తో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

ఇతర ప్రత్యేకతలు: వాటర్​ అండ్​ డస్ట్​ రెసిస్టెన్స్​ కోసం ఈ ఫోన్‌కు ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఇచ్చారు. అంటే ఈ ఫోన్ నీటిలో పడినా పాడయ్యే అవకాశం చాలా తక్కువ. భద్రత కోసం ఫోన్ పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించారు. 5జీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఈ వివో వై500ఐ ఇండియా లాంచ్​పై సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే దీనిపై ఒక అప్డేట్​ వెలువడే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More