పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనంఇది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలే కోలుకోలేని షాక్ ఇచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని, ఆయన కార్పొరేట్ శైలి విధానాలను వ్యతిరేకిస్తూ ఏకంగా 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. తామే అసలైన టీఎంసీ అని ప్రకటించుకుంటూ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకున్నారు. రెబెల్ వర్గం నాయకుడు, బహిష్కృత ఎమ్మెల్యే రితాబ్రత బెనర్జీ బుధవారం స్పీకర్‌ను కలిసి తానే ప్రతిపక్ష నాయకుడినని (LoP) ప్రకటించడంతో పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడింది.
మహారాష్ట్ర తరహా సంక్షోభం - పార్టీ గుర్తుకు ముప్పు

మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో దాదాపు ముప్పావు వంతు మంది రెబెల్స్ వైపు చేరడంతో, మూడు దశాబ్దాల తృణమూల్ కాంగ్రెస్ చరిత్రలో ఇదే మొదటి చీలికగా నిలిచింది. ఈ పరిణామంతో పార్టీ పేరు, అధికారిక 'జోడు పువ్వుల' గుర్తు ప్రమాదంలో పడ్డాయి. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ (NCP) పార్టీల్లో తలెత్తిన సంక్షోభాన్ని ఈ పరిణామాలు గుర్తుచేస్తున్నాయి.
పార్టీలోని 34 మంది ముస్లిం ఎమ్మెల్యేలలో దాదాపు సగం మంది రితాబ్రత బెనర్జీకి మద్దతు పలికారు. మమతా బెనర్జీని తమ ప్రధాన సలహాదారుగా ఉండాలని కోరతామని, అయితే ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోబోమని రెబెల్స్ స్పష్టం చేశారు.
"మేము టీఎంసీ గుర్తుపై గెలిచిన 58 మంది ఎమ్మెల్యేలం. అసెంబ్లీలో ఇప్పుడు మేమే అసలైన టీఎంసీ. మా అభ్యర్థనను స్పీకర్ ఆమోదించారు" అని రితాబ్రత బెనర్జీ మీడియాకు తెలిపారు.
సోమవారం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సందీపన్ సాహాను డిప్యూటీ ప్రతిపక్ష నాయకుడిగా నియమించారు. దీనిపై అసెంబ్లీ స్పీకర్ రతీంద్రనాథ్ బోస్ స్పందిస్తూ, ప్రతిపక్ష నాయకుడి నియామకానికి సంబంధించిన అధికారిక లేఖను తమ సెక్రటేరియట్ జారీ చేసిందని ధృవీకరించారు.
'ఫోర్జరీ సంతకాల' వివాదం నేపథ్యం
ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాల్లో విజయం సాధించగా, టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం (Anti-defection law) పరిధిలోకి రాకుండా ఉండాలంటే తిరుగుబాటు వర్గానికి కనీసం మూడింట రెండొంతుల మంది అంటే 54 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, వీరి వద్ద 58 మంది ఉన్నారు.
{{/usCountry}}ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాల్లో విజయం సాధించగా, టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం (Anti-defection law) పరిధిలోకి రాకుండా ఉండాలంటే తిరుగుబాటు వర్గానికి కనీసం మూడింట రెండొంతుల మంది అంటే 54 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, వీరి వద్ద 58 మంది ఉన్నారు.
{{/usCountry}}మే 19న టీఎంసీ అధిష్ఠానం సీనియర్ నేత శోభన్‌దేవ్ చట్టోపాధ్యాయను ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించింది. అయితే, ఆ నియామక లేఖలోని సంతకాలన్నీ ఫోర్జరీవని మే 25న రితాబ్రత, సందీపన్ సాహాలు ఆరోపించడంతో ఈ వ్యవహారం సీఐడీ (CID) దర్యాప్తు వరకు వెళ్లింది. తాజాగా స్పీకర్ కార్యాలయంలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం రెబెల్స్ తమ లేఖను సమర్పించారు.
కార్పొరేట్ రాజకీయాలపై తిరుగుబాటు
"మమతా బెనర్జీ గొప్ప నాయకురాలు. ఆమెను మాకు మార్గదర్శిగా ఉండమని కోరుతున్నాం. కానీ అభిషేక్ బెనర్జీకి ఈ లెజిస్లేటివ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. మా నిర్ణయాలు ఏ కార్పొరేట్ ఆఫీసులోనో, ఐప్యాక్ (I-PAC) లాంటి సలహా సంస్థల ఒత్తిడితోనో తీసుకున్నవి కావు. ఇది వ్యక్తిగత అహంకారానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం" అని రితాబ్రత బెనర్జీ వ్యాఖ్యానించారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాలు గెలిచిన తర్వాత టీఎంసీ ఐప్యాక్ సేవలను ఉపయోగించుకుంది. ఇందులో అభిషేక్ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ముందే ఐప్యాక్ కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేసి ఒక డైరెక్టర్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కమిటీల రద్దు - స్పందించిన అధిష్ఠానం
ఈ సంక్షోభంపై మమతా బెనర్జీ గానీ, అభిషేక్ గానీ నేరుగా స్పందించనప్పటికీ, పశ్చిమ బెంగాల్‌లోని అన్ని స్థాయిల పార్టీ కమిటీలను, అనుబంధ విభాగాలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు టీఎంసీ ప్రకటించింది. ప్రతి స్థాయిలో ఆత్మపరిశీలన, పనితీరు సమీక్షల అనంతరం కొత్త కమిటీలను వేస్తామని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
"పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు కాలేడు. టీఎంసీ ఎప్పుడూ బలంగానే ఉంటుంది" అని మమత అనుచరుడు, టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ కొట్టిపారేశారు.
మరోవైపు కొత్తగా చీఫ్ విప్‌గా బాధ్యతలు చేపట్టిన అఖ్రుజ్జమాన్ మాట్లాడుతూ, నాయకత్వ వైఫల్యం వల్ల పార్టీ నవ్వులపాలు కాకుండా కాపాడేందుకే తాము ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
మరో ఆసక్తికర పరిణామంలో, ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన ఒక పరిపాలనా సమావేశానికి రితాబ్రత సహా 24 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశానికి మమతకు విధేయులైన కునాల్ ఘోష్, ఫిర్హాద్ హకీం కూడా రావడం గమనార్హం. టీఎంసీలో రేగిన ఈ చిచ్చు బెంగాల్ రాజకీయాలను ఏ తీరాలకు చేరుస్తుందో చూడాలి.