టిబెట్ సరిహద్దులోని నేపాల్ రసువా జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరద విధ్వంసాన్ని సృష్టించింది. భోటేకోశీ నదికి ఒక్కసారిగా పోటెత్తిన ఈ వరదల కారణంగా అనేక గ్రామాలు నీటమునిగాయి, వంతెనలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన అనేక మంది భారతీయ యాత్రికులు రసువాగధి చెక్‌పోస్ట్ వద్ద బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయి గల్లంతయ్యారు.
వరదలకు కారణం ఏమిటి?
కాట్మాండు యూనివర్సిటీ ప్రొఫెసర్, వాతావరణ పరిశోధకుడు రిజన్ భక్త్ శ్రేష్ఠ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘోర విపత్తు వెనుక మంచు కొండచరియలు విరిగిపడటం, భూకంపం ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. టిబెట్ ప్రాంతంలోని లెండే నదిలో మంచు విరిగిపడి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. ఇది బోటేకోశీకి ఉపనది. ఆ తర్వాత ఆ మంచు ఆకస్మికంగా పగిలిపోవడంతో భారీ ఎత్తున నీరు ఒక్కసారిగా కిందనున్న భోటేకోశీ నదిలోకి దూసుకొచ్చింది.
యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఉదయం 8:37 గంటలకు టిబెట్ వైపు గోసాయ్‌కుండకు ఉత్తరాన 47 కిలోమీటర్ల దూరంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల వల్లే మంచు చరియలు విరిగిపడి ఉండవచ్చని చైనా, నేపాల్ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఉగ్ర ప్రవాహం రసువా, ధాడింగ్, నువాకోట్ జిల్లాలను ముంచెత్తింది.
ఎమర్జెన్సీ నెంబర్
నేపాల్ టూరిజం బోర్డు, ది కాట్మాండు పోస్ట్ నివేదికల ప్రకారం.. 384 మంది యాత్రికులతో చాలావరకు సంబంధాలు తెగిపోయాయి. వీరిలో భారతీయ పర్యాటకులే ఎక్కువగా ఉన్నారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు, సహాయం కోసం నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. +977 985 131 6807, +977 970 910 7500 నెంబర్లను సంప్రదించవచ్చు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేపాల్ అధికారులతో మాట్లాడి, భారత ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయి మానవీయ, రెస్క్యూ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నేపాల్ సైన్యం, విపత్తు సహాయక బృందాలు గాలింపు చర్యలను తీవ్రతరం చేశాయి.
తెలుగు టూరిస్టులు
{{/usCountry}}ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేపాల్ అధికారులతో మాట్లాడి, భారత ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయి మానవీయ, రెస్క్యూ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నేపాల్ సైన్యం, విపత్తు సహాయక బృందాలు గాలింపు చర్యలను తీవ్రతరం చేశాయి.
తెలుగు టూరిస్టులు
{{/usCountry}}మరోవైపు నేపాల్‌ను ముంచెత్తిన ఆకస్మిక జలప్రళయం తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళనను రేకెత్తిస్తోంది. విహారయాత్ర కోసం హైదరాబాద్ నుంచి నేపాల్ వెళ్లిన 156 మంది తెలుగు పర్యాటకుల బృందంలో ఏకంగా 140 మంది జాడ తెలియకుండా పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రకృతి విపత్తు ధాటికి నేపాల్ వ్యాప్తంగా ఇప్పటివరకు 95 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా తెలుగు రాష్ట్రాలకు చెందిన 156 మంది పర్యాటకులు నేపాల్ పర్యటనకు వెళ్లారు. మంగళవారం రాత్రి వీరంతా అక్కడి ఒక హోటల్‌లో బస చేశారు. బుధవారం ఉదయం స్థానిక సందర్శనీయ ప్రాంతాలను చూడటానికి 140 మంది పర్యాటకులు బస్సుల్లో బయటకు వెళ్లారు. అయితే స్వల్ప అనారోగ్యం, ప్రయాణ అలసట కారణంగా 16 మంది యాత్రికులు హోటల్ గదుల్లోనే ఉండిపోయారు.