...
...
Next Story

Kia Sorento hybrid : భారత్‌లోకి కియా 'సోరెంటో' హైబ్రిడ్ ఎస్​యూవీ- బుకింగ్స్ షురూ..

కియా ఇండియా తన సరికొత్త సోరెంటో హైబ్రిడ్ ఎస్‌యూవీ బుకింగ్స్‌ను రూ.25,000 టోకెన్ అమోంట్​తో అధికారికంగా ప్రారంభించింది. టీజర్ విడుదల చేయడంతో పాటు భారత మార్కెట్లోకి ఈ కారును త్వరలోనే లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Published on: Aug 4, 2026, 16:20:28 IST
Advertisement

భారతీయ ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలోకి ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన సరికొత్త వాహనాన్ని తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో తన మోస్ట్ అవైటెడ్ మోడల్ ‘కియా సోరెంటో’ ఎస్‌యూవీకి సంబంధించిన అధికారిక టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. అంతేకాదు, ప్రీ-బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. రూ.25,000 టోకెన్ అమోంట్​తో ఆన్‌లైన్ ద్వారా లేదా కియా డీలర్‌షిప్‌లలో ఈ కారును రిజర్వ్ చేసుకోవచ్చు.

కియా సోరెంటో హైబ్రిడ్..
కియా సోరెంటో హైబ్రిడ్..

భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో కియా నుంచి రాబోతున్న మొట్టమొదటి 'స్ట్రాంగ్ హైబ్రిడ్' ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం. ఈ మోడల్ రాకతో బ్రాండ్ ప్రీమియం ఎస్‌యూవీల పోర్ట్‌ఫోలియో మరింత బలోపేతం కానుంది.

కియా సోరెంటో హైబ్రిడ్- అగ్రెసివ్ లుక్.. ఆకట్టుకునే డిజైన్!

కంపెనీ విడుదల చేసిన టీజర్ ఆధారంగా కియా సోరెంటో డిజైన్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ కారు బోల్డ్ లుక్‌తో పాటు చాలా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో రెండు అంచెల ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 'T' ఆకారపు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, నిలువుగా అమర్చిన ఎల్‌ఈడీ హెడ్‌లాంప్‌లు, ఫాగ్ లాంప్‌లను ఈ ఎస్​యూవీకి ఇచ్చారు. నల్లటి మెష్ గ్రిల్ కారుకు మరింత అగ్రెసివ్, మస్క్యులర్ లుక్‌ను అందిస్తోంది.

ఎత్తైన ప్రొఫైల్, పొడవైన రూఫ్ రైల్స్, భారీ అలాయ్ వీల్స్ ఈ ఎస్‌యూవీకి రోడ్డుపై విశిష్టమైన ప్రాధాన్యతను తెచ్చిపెడతాయి.

కియా సోరెంటో హైబ్రిడ్- డైమెన్షన్స్..

గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సోరెంటో మోడల్ కొలతలనే భారత్‌లోనూ కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీ పొడవు 4,815 ఎంఎం, వెడల్పు 1,900 ఎంఎం, ఎత్తు 1,700 ఎంఎంగా ఉన్నాయి.

కియా సోరెంటో హైబ్రిడ్- ఇంటీరియర్, ప్రీమియం ఫీచర్లు..

భద్రత విషయంలో కియా రాజీ పడకుండా అధునాతన సేఫ్టీ ఫీచర్లను ఈ సోరెంటో హైబ్రిడ్​ ఎస్​యూవీలో అందించబోతోంది.

  • 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా
  • లెవెల్-2 అడాస్ సేఫ్టీ సూట్
  • ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్

అంతర్జాతీయ మార్కెట్లో 5, 6, 7 సీటర్ల ఆప్షన్లలో లభిస్తున్నప్పటికీ.. భారత్‌లో మాత్రం ఈ కియా సొరెంటో 6, 7 సీటర్ల వేరియంట్లలో దీనిని పరిచయం చేసే అవకాశం ఉంది.

కియా సోరెంటో హైబ్రిడ్- ఇంజిన్, పర్ఫార్మెన్స్..

కియా సోరెంటో అత్యంత సమర్థవంతమైన స్ట్రాంగ్-హైబ్రిడ్ సాంకేతికతతో రానుంది. సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా పూర్తిగా వెల్లడించకపోయినప్పటికీ.. అంతర్జాతీయ మోడల్‌లో ఉన్న 1.6-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 1.94 కేడబ్ల్యూహెచ్ లిథియమ్-అయాన్ బ్యాటరీ ప్యాక్ కాంబినేషన్‌నే ఇక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 238 బీహెచ్​పీ పవర్, 380 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.

కియా సోరెంటో హైబ్రిడ్- ఎంత ధర ఉండవచ్చు?

కియా సోరెంటో ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 40 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కోడియాక్, జేప్ మెరిడియన్ వంటి పాపులర్ ప్రీమియం ఎస్‌యూవీలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe