ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే పంజాబ్ కింగ్స్ (PBKS) టీమ్ కు ఓ కొత్త స్టార్ దొరికాడు. 22 ఏళ్ల ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కూపర్ కనోలీ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టాడు. కేవలం 44 బంతుల్లోనే 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి, జట్టుకు 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ఈ యువ క్రికెటర్ ఐపీఎల్ అరంగేట్రంలోనే 163.64 స్ట్రైక్ రేట్‌తో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో చెలరేగిపోయాడు.
ఎవరీ కూపర్ కనోలీ?

కూపర్ కనోలీ లెఫ్టార్మ్ బ్యాటర్. అలాగే స్పిన్ ఆల్ రౌండర్. ఆస్ట్రేలియా తరపున ఇప్పటికే ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాడు. అక్కడ బిగ్ బాష్ లీగ్, డొమెస్టిక్ క్రికెట్లోనూ అదరగొట్టాడు. అతణ్ని రూ.3 కోట్లకు పంజాబ్ కింగ్స్ వేలంలో దక్కించుకుంది. బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో వెళ్లిన కనోలీ గుజరాత్ బౌలింగ్ ను ఆటాడుకున్నాడు.
బ్యాటర్ గానే
వెన్ను నొప్పి నుంచి ఇటీవల కోలుకున్న కూపర్ కనోలీ ఈ ఐపీఎల్ 2026లో ప్రస్తుతం కేవలం బ్యాటర్ గా మాత్రమే ఆడనున్నాడు. స్పిన్ బౌలింగ్ వేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అతనికి పర్మిషన్ రాలేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేవరకు అతను బౌలింగ్ వేయలేకపోవచ్చు. ఏప్రిల్ నెలాఖరు వరకు ఇతను కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గా మాత్రమే ఆడనున్నాడు.
పంజాబ్ నమ్మకం
బీబీఎల్, అంతర్జాతీయ మ్యాచుల్లో వరుసగా విఫలమైనా, పంజాబ్ ఫ్రాంచైజీ కనోలీపై అపారమైన నమ్మకాన్ని ఉంచింది. గత 15 ఇన్నింగ్స్‌లలో కేవలం మూడు సార్లు మాత్రమే డబుల్ ఫిగర్ స్కోరు చేసినప్పటికీ అతణ్ని టీమ్ లోకి తీసుకుని ఆడించింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్ లోనే కనోలీ అదరగొట్టాడు. గుజరాత్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకోవడం ఇక్కడ విశేషం.
సక్సెస్ సీక్రెట్
మ్యాచ్ అనంతరం కనోలీ మాట్లాడుతూ, తన మైండ్‌సెట్ మార్చుకోవడమే ఈ విజయం వెనుక ఉన్న రహస్యమని వెల్లడించాడు. "ఐపీఎల్ కంటే ముందు కొన్ని వారాలు ఇంట్లో కుటుంబంతో సమయం గడపడం వల్ల నేను మానసికంగా రీసెట్ అయ్యాను" అని చెప్పాడు. ఐపీఎల్ కు వచ్చేటప్పుడు పెద్దగా ఆలోచించకుండా, ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో ఆడే అనుభవం కోసం ఎదురుచూశానని తెలిపాడు. ఈ విజయంతో ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తమ ప్రయాణాన్ని చాలా బలంగా ప్రారంభించింది.
లాస్ట్ ఓవర్ విక్టరీ
{{/usCountry}}మ్యాచ్ అనంతరం కనోలీ మాట్లాడుతూ, తన మైండ్‌సెట్ మార్చుకోవడమే ఈ విజయం వెనుక ఉన్న రహస్యమని వెల్లడించాడు. "ఐపీఎల్ కంటే ముందు కొన్ని వారాలు ఇంట్లో కుటుంబంతో సమయం గడపడం వల్ల నేను మానసికంగా రీసెట్ అయ్యాను" అని చెప్పాడు. ఐపీఎల్ కు వచ్చేటప్పుడు పెద్దగా ఆలోచించకుండా, ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో ఆడే అనుభవం కోసం ఎదురుచూశానని తెలిపాడు. ఈ విజయంతో ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తమ ప్రయాణాన్ని చాలా బలంగా ప్రారంభించింది.
లాస్ట్ ఓవర్ విక్టరీ
{{/usCountry}}గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ లాస్ట్ ఓవర్లో విక్టరీ అందుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఆ టీమ్ లో కెప్టెన్ శుభ్ మన్ గిల్ (39), బట్లర్ (38) మెరిశారు. ఛేజింగ్ లో పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయింది. కూపర్ కనోలీ (44 బంతుల్లో 72 నాటౌట్) టీమ్ ను గెలిపించాడు.