...
...
Next Story

Large cap stocks : 2ఏళ్లుగా లార్జ్ క్యాప్ స్టాక్స్ ఢమాల్- వాటి ఫ్యూచర్ ఏంటి? బై ఆర్​ సెల్?

భారత ఈక్విటీ మార్కెట్లు గత కొంతకాలంగా తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. నిఫ్టీ 50 గరిష్ఠ స్థాయిల నుంచి దాదాపు 14.5% పడిపోవడంతో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఇన్వెస్టర్లు తీవ్ర నష్టాలను చూస్తున్నారు. ఈ పతనానికి ప్రధాన కారణాలు, నిపుణుల విశ్లేషణ, ఇన్వెస్టర్లు ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కథనం..

Published on: Oct 4, 2026, 14:02:49 IST
Advertisement

గడిచిన రెండేళ్లుగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన కొత్త ఇన్వెస్టర్లకు నిరాశే మిగిలింది. కొవిడ్ అనంతర కాలంలో మార్కెట్లు ఇచ్చిన బంపర్ రిటర్న్ చూసి లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలోకి భారీగా నిధులు వచ్చి చేరాయి. అయితే ఆ వేగం క్రమంగా మందగించి, ప్రస్తుతం మార్కెట్లు తీవ్ర కరెక్షన్‌కు గురవుతున్నాయి.

PREMIUMలార్జ్ క్యాప్ స్టాక్స్​లో ఇన్వెస్ట్​మెంట్​ మంచిదేనా?
లార్జ్ క్యాప్ స్టాక్స్​లో ఇన్వెస్ట్​మెంట్​ మంచిదేనా?

అక్టోబర్ 1, 2026 నాటి గణాంకాల ప్రకారం.. దేశీయ బెంచ్ మార్క్ సూచీ 'నిఫ్టీ 50' గత రెండేళ్ల కాలంలో దాదాపు 13% క్షీణించింది. సెప్టెంబర్ 2024లో నమోదు చేసిన ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయి నుంచి చూస్తే ఏకంగా 14.5% మేర పడిపోయింది. కేవలం గత ఒక్క నెలలోనే సూచీ 6.9% నష్టపోయింది.

ఇక మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే,

గడిచిన రెండేళ్లుగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన కొత్త ఇన్వెస్టర్లకు నిరాశే మిగిలింది. కొవిడ్ అనంతర కాలంలో మార్కెట్లు ఇచ్చిన బంపర్ రిటర్న్ చూసి లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలోకి భారీగా నిధులు వచ్చి చేరాయి. అయితే ఆ వేగం క్రమంగా మందగించి, ప్రస్తుతం మార్కెట్లు తీవ్ర కరెక్షన్‌కు గురవుతున్నాయి.

PREMIUMలార్జ్ క్యాప్ స్టాక్స్​లో ఇన్వెస్ట్​మెంట్​ మంచిదేనా?
లార్జ్ క్యాప్ స్టాక్స్​లో ఇన్వెస్ట్​మెంట్​ మంచిదేనా?

అక్టోబర్ 1, 2026 నాటి గణాంకాల ప్రకారం.. దేశీయ బెంచ్ మార్క్ సూచీ 'నిఫ్టీ 50' గత రెండేళ్ల కాలంలో దాదాపు 13% క్షీణించింది. సెప్టెంబర్ 2024లో నమోదు చేసిన ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయి నుంచి చూస్తే ఏకంగా 14.5% మేర పడిపోయింది. కేవలం గత ఒక్క నెలలోనే సూచీ 6.9% నష్టపోయింది.

ఇక మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే, గత నెల రోజుల్లో లార్జ్ క్యాప్ ఫండ్లు సగటున 5.7%, మిడ్ క్యాప్ ఫండ్లు 6%, స్మాల్ క్యాప్ ఫండ్లు 3% మేర క్షీణించాయి. ఏడాది, రెండేళ్ల ప్రాతిపదికన చూస్తే లార్జ్ క్యాప్ ఫండ్లు సగటున 4% నుంచి 7% వరకు నష్టాలను మూటగట్టుకున్నాయి.

మార్కెట్ పతనానికి 4 ప్రధాన కారణాలు..

భారత ఈక్విటీ మార్కెట్లలో ప్రస్తుత పతనానికి ప్రధానంగా నాలుగు అంశాలు కారణమని ఫండ్ మేనేజర్లు విశ్లేషిస్తున్నారు:

క్రూడాయిల్ ధరల మంట: 2026 ప్రారంభం నుంచి బ్రెంట్ క్రూడాయిల్ ధరలు ఏకంగా 68% మేర పెరిగి ప్రస్తుతం బ్యారెల్​కు 102 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. భారత్ తన చమురు అవసరాలలో ఎక్కువ భాగం దిగుమతి చేసుకుంటుంది. క్రూడ్ ధర పెరగడం వల్ల దేశ వాణిజ్య లోటు పెరిగి, రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది.

గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ పెంపు: అంతర్జాతీయంగా బాండ్ ఈల్డ్స్ పెరుగుతుండటం వల్ల వడ్డీ రేట్ల చక్రం మళ్లీ మారవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఎఫ్​పీఐల విక్రయాల జోరు: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి భారీగా నిధులను ఉపసంహరించుకుంటున్నారు. కేవలం సెప్టెంబర్ నెలలోనే ఎఫ్‌పీఐలు రూ. 35,861 కోట్లు (3.75 బిలియన్ డాలర్లు) విలువైన షేర్లను విక్రయించారు. గడిచిన రెండేళ్ల కాలంలో వీరు దాదాపు 60 బిలియన్ డాలర్లు విలువైన ఇండియన్ ఈక్విటీలను విక్రయించడం గమనార్హం.

రుతుపవనాలపై ఆందోళన: ఈ ఏడాది రుతుపవనాల్లో లోటు నమోదు కావడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరియు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందనే భయాలు నెలకొన్నాయి.

ఆకర్షణీయమైన వ్యాల్యుయేషన్ల వద్ద లార్జ్ క్యాప్స్..

ప్రస్తుత పతనం తర్వాత లార్జ్ క్యాప్ షేర్లు ఆకర్షణీయమైన వ్యాల్యుయేషన్లలో లభిస్తున్నాయని ఫండ్ మేనేజర్లు చెబుతున్నారు. నిఫ్టీ 50 ప్రస్తుతం తన వన్-ఇయర్ ఫార్వర్డ్ పీ/ఈ 17 రెట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది దాని 10 ఏళ్ల సగటు పి/ఇ (18.9 రెట్లు) కంటే 11% తక్కువ.

"గత రెండేళ్లలో మార్కెట్లు 15% కరెక్ట్ అయ్యాయి, అదే సమయంలో కంపెనీల ఆర్జన పెరగడం వల్ల చాలా స్టాక్స్ పీ/ఈ మల్టిపుల్స్ దాదాపు 30% తగ్గిక్రిందికి వచ్చాయి," అని మిరాయ్ అసెట్ ఇన్వెస్ట్‌‌మెంట్ మేనేజర్స్ సీఐఓ నీలేష్ సురానా తెలిపారు.

మిడ్, స్మాల్ క్యాప్‌‌లు వాటి సుదీర్ఘకాల సగటు వ్యాల్యుయేషన్ల కంటే దాదాపు 20% ప్రీమియంలో ఉన్నాయని, అయితే లార్జ్ క్యాప్స్ మాత్రం చాలా చౌకగా అందుబాటులో ఉన్నాయని కొటక్ మహీంద్రా ఏఎంసీ సీఐఓ హర్ష ఉపాధ్యాయ పేర్కొన్నారు. జూన్ త్రైమాసికంలో లార్జ్ క్యాప్ కంపెనీలు 17.6% వార్షిక ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి.

ఏ సెక్టార్లలో అవకాశాలు ఉన్నాయి?

ఐటీ : పెద్ద ఐటీ కంపెనీల షేర్లు ప్రస్తుతం 12-13 రెట్ల పీ/ఈ వద్ద, 7-8% ఎర్నింగ్స్ ఈల్డ్‌తో లభిస్తున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవకాశాలు, డాలర్​తో రూపాయి మారకం విలువ వీటికి కలిసిరానున్నాయని నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ సీఐఓ శైలేష్ భాన్ అభిప్రాయపడ్డారు.

బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్: రుణాలు పుంజుకోవడం, డిపాజిట్ల రికవరీ నేపత్యంలో పెద్ద ప్రైవేట్ బ్యాంకులు 3-4 ఏళ్ల వ్యవధికి అనుకూలంగా కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

ఇతర రంగాలు: బీమా, కన్జ్యూమర్, పవర్ యుటిలిటీస్, ఫార్మా రంగాలు కూడా మంచి వ్యాల్యుయేషన్లలో అందుబాటులో ఉన్నాయని బంధన్ ఏఎంసీ, కొటాక్ ఏఎంసీ విశ్లేషకులు తెలిపారు.

ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి?

ప్రస్తుత వాతావరణంలో భయపడి షేర్లను లేదా మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీలను నిలిపివేయడం సరైన నిర్ణయం కాదని ఫండ్ మేనేజర్లు స్పష్టం చేస్తున్నారు.

"ఇది 'చెడు వార్తలు - మంచి ధరలు' కలయికగా కనిపించే సమయం. మీరు సుదీర్ఘకాల ప్రయోజనాల కోసం ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టినట్లయితే, మార్కెట్లో కొనసాగడమే శ్రేయస్కరం. స్వల్పకాలిక అవసరాల కోసం పెట్టిన డబ్బు ఉంటేనే సమస్య. కేటాయింపులను ఒకేసారి కాకుండా ఎస్‌ఐపీ లేదా విడతల వారీగా పెంచుకోవడం (ఎస్​టీపీ) మంచిది," అని అసెట్ మేనేజర్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సూర్యా భాటియా సూచించారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

All Access.
One Subscription.

Get 360° coverage—from daily headlines
to 100 year archives.

E-Paper
Full
Archives
Full Access to
HT App & Website
Games
 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks