ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో మరో సంచలనానికి సిద్ధమైంది! ఇటీవల విడుదలైన షావోమి 17 సిరీస్‌లోకి ‘షావోమి 17 అల్ట్రా’ మోడల్‌ను తీసుకొస్తున్నట్టు కంపెనీ ఇటీవలే అధికారికంగా ధృవీకరించింది. వచ్చే వారమే ఈ స్మార్ట్‌ఫోన్‌ని చైనా మార్కెట్లో లాంచ్ చేయనున్నారు! ఈ సిరీస్‌లో ఇప్పటికే షావోమి 17, 17 ప్రో, 17 ప్రో మాక్స్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో షావోమీ 17 అల్ట్రాపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
షావోమి 17 అల్ట్రా- లాంచ్, ధర (అంచనాలు)..

షావోమి సంస్థ తన వీబో అకౌంట్లో షేర్ చేసిన పోస్ట్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చే వారం చైనాలో విడుదల కానుంది! ఖచ్చితమైన తేదీని వెల్లడించనప్పటికీ, పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 22 నుంచి 27 మధ్య ఈ లాంచ్ ఈవెంట్ ఉండొచ్చు. ముఖ్యంగా డిసెంబర్ 26న లాంచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, అంతకు ఒకరోజు ముందే ప్రీ-ఆర్డర్లు మొదలవుతాయని సమాచారం.
ధర విషయానికొస్తే, పాత మోడల్ షావోమి 15 అల్ట్రా మాదిరిగానే కొత్త గ్యాడ్జెట్ ప్రైజింగ్ ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.
12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్: సుమారు రూ. 83,343 (6,499 యువాన్).
16జీబీ ర్యామ్ + 1టీబీ వేరియంట్: సుమారు రూ. 1,00,015 (7,799 యువాన్).
షావోమి 17 అల్ట్రా- కెమెరా (లీకైన వివరాలు)..
కెమెరా విషయంలో ప్రసిద్ధి చెందిన 'లైకా' సంస్థతో షావోమి తన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. కేవలం సాఫ్ట్‌వేర్ ట్యూనింగ్‌కే పరిమితం కాకుండా, కెమెరా హార్డ్‌వేర్ తయారీలోనూ రెండు కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ కొత్త 'స్ట్రాటజిక్ కో-క్రియేషన్' పద్ధతిలో రూపొందుతున్న మొదటి ఫోన్ షావోమి 17 అల్ట్రా కావడం విశేషం.
ఈ ఫోన్ డిజైన్ గురించి షావోమి అధికారికంగా ఏమీ చెప్పలేదు. కానీ, ఇటీవల ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న ఫోటోల ప్రకారం.. వెనుక భాగంలో సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌కు బదులుగా స్క్వేర్/ రెక్టాంగ్యులర్ ఆకారంలో ఉండే మాడ్యూల్‌ను ఇస్తున్నారు.
- 10,080ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో హానర్ కొత్త స్మార్ట్‌ఫోన్! పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
షావోమి 17 అల్ట్రా- ప్రధాన ఫీచర్లు..
{{/usCountry}}ఈ ఫోన్ డిజైన్ గురించి షావోమి అధికారికంగా ఏమీ చెప్పలేదు. కానీ, ఇటీవల ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న ఫోటోల ప్రకారం.. వెనుక భాగంలో సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌కు బదులుగా స్క్వేర్/ రెక్టాంగ్యులర్ ఆకారంలో ఉండే మాడ్యూల్‌ను ఇస్తున్నారు.
- 10,080ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో హానర్ కొత్త స్మార్ట్‌ఫోన్! పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
షావోమి 17 అల్ట్రా- ప్రధాన ఫీచర్లు..
{{/usCountry}}ప్రాసెసర్: క్వాల్కమ్ నుంచి రానున్న అత్యంత పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఈ షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఉండనుంది.
కెమెరా సెటప్: ఇందులో క్వాడ్ (నాలుగు) కెమెరాలు ఉండొచ్చు.
50ఎంపీ మెయిన్ కెమెరా.
200ఎంపీ టెలిఫోటో కెమెరా (దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా ఫోటో తీసేందుకు).
50ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా.
పెరిస్కోప్ లెన్స్: జూమింగ్ కోసం ప్రత్యేకమైన పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను ఇందులో అమర్చినట్లు తెలుస్తోంది.
షావోమి 17 అల్ట్రా లాంచ్ నాటికి ఈ గ్యాడ్జెట్‌కి సంబంధించిన ఫీచర్స్, ధర వంటి వివరాలపై క్లారిటీ లభిస్తుంది.
కాగా చైనాలో విడుదలైన కొన్ని నెలల తర్వాతే ఈ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అత్యాధునిక ఫోటోగ్రఫీని కోరుకునే స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఈ ఫోన్ ఒక అద్భుతమైన ఎంపిక కానుంది.