...
...
Next Story

Xiaomi 18 Pro : 200ఎంపీ కెమెరాలు, రేర్ స్క్రీన్​తో షావోమీ స్మార్ట్​ఫోన్స్ లాంచ్- ధరలు..

ప్రముఖ టెక్ దిగ్గజం షావోమి తమ సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు 'షావోమి 18 ప్రో', 'షావోమి 18 ప్రో మాక్స్' మోడళ్లను చైనాలో ఆవిష్కరించింది. బ్యాక్ సైడ్ సెకండరీ డిస్‌ప్లే, 2nm ప్రాసెసర్, 200MP ప్రైమరీ కెమెరాలు, అత్యంత శక్తివంతమైన బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Sep 24, 2026, 07:30:32 IST
Advertisement

ప్రముఖ చైనీస్ టెక్ దిగ్గజం షావోమీ గ్లోబల్ మార్కెట్లో తమ తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ లైనప్​లోని ‘షావోమీ 18 ప్రో’, 'షావోమీ 18 ప్రో మాక్స్' మోడళ్లను చైనా మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఫోన్ వెనుక భాగంలో ప్రత్యేక సెకండరీ స్క్రీన్, క్వాల్కమ్ రూపొందించిన అత్యంత వేగవంతమైన 2 నానోమీటర్ ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాలతో ఈ ఫోన్లు సాంకేతిక ప్రపంచంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాయి.

షావోమీ 18 ప్రో సిరీస్ అప్డేట్స్..
షావోమీ 18 ప్రో సిరీస్ అప్డేట్స్..

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షావోమికి విశేష ఆదరణ ఉంది. చైనాలో విడుదలైన ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు రాబోయే కొన్ని నెలల్లోనే భారత మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రీమియం విభాగంలో యాపిల్ ఐఫోన్ 18 ప్రో, శాంసంగ్ ఫ్లాగ్‌షిప్‌లకు పోటీగా షావోమీ ఈ పరికరాలను రూపొందించింది.

షావోమీ 18 ప్రో సిరీస్- అత్యుత్తమ డిస్‌ప్లే.. సరికొత్త ప్రైవసీ ఫీచర్!

షావోమీ 18 ప్రో మోడల్‌లో 6.4-ఇంచుల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే అమర్చగా, ప్రో మాక్స్ మోడల్‌లో 6.9-ఇంచుల భారీ AMOLED స్క్రీన్‌ను అందించారు. ఈ రెండు స్క్రీన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తాయి. బహిరంగ ప్రదేశాల్లో లేదా ప్రయాణాల్లో పక్కనున్న వారికి స్క్రీన్ వివరాలు కనిపించకుండా నియంత్రించే హార్డ్‌వేర్ ఆధారిత ‘ప్రైవసీ డిస్‌ప్లే’ ఫీచర్‌ను తొలిసారిగా ఈ ఫోన్లలో పొందుపరిచారు.

స్మార్ట్​ఫోన్స్​ వెనుక భాగంలో ప్రత్యేకంగా 2.7-ఇంచులు (ప్రో మోడల్), 2.9-ఇంచులు (ప్రో మాక్స్ మోడల్) పరిమాణంలో సెకండరీ AMOLED స్క్రీన్‌లను అమర్చారు. ప్రధాన కెమెరాల సహాయంతో సెల్ఫీలు తీసుకునేందుకు, విడ్జెట్లు, నోటిఫికేషన్లను త్వరగా చూసేందుకు ఈ బ్యాక్ స్క్రీన్ తోడ్పడుతుంది.

షావోమీ 18 ప్రో సిరీస్- శక్తివంతమైన ప్రాసెసర్.. పర్ఫార్మెన్స్

ఫోటోగ్రఫీ కోసం ఈ రెండు ఫోన్లలో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో కూడిన 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 3.2x ఆప్టికల్ జూమ్ ఇచ్చే 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 102 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన 50 మెగాపిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్లతో 8కే క్వాలిటీలో వీడియో రికార్డింగ్ చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

బ్యాటరీ విషయంలోనూ షావోమీ విప్లవాత్మక మార్పులు చేసింది. ప్రో మాక్స్ మోడల్‌లో ఏకంగా 8,500ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇవ్వగా, ప్రో మోడల్‌లో 7,000ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఈ రెండు పరికరాలు 100డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్, 27డబ్ల్యూ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తాయి.

షావోమీ 18 ప్రో సిరీస్- వేరియంట్లు, ధరల వివరాలు

ఈ స్మార్ట్‌ఫోన్లు బ్లాక్, ఐస్ పీచ్ పింక్, స్టారీ బ్లూ, వైట్ రంగుల్లో లభిస్తాయి.

షావోమీ 18 ప్రో ధరలు:

12GB + 256GB: 5,999 యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 86,000)

12GB + 512GB: 6,999 యువాన్లు (దాదాపు రూ. 1,00,000)

16GB + 512GB: 7,999 యువాన్లు (దాదాపు రూ. 1,14,000)

16GB + 1TB: 8,999 యువాన్లు (దాదాపు రూ. 1,29,000)

ట్రాన్స్‌పారెంట్ ఎడిషన్ (16GB + 1TB): 9,999 యువాన్లు (దాదాపు రూ. 1,43,000)

షావోమీ 18 ప్రో మాక్స్ ధరలు:

12GB + 256GB: 6,999 యువాన్లు (దాదాపు రూ. 1,00,000)

12GB + 512GB: 7,999 యువాన్లు (దాదాపు రూ. 1,14,000)

16GB + 512GB: 8,999 యువాన్లు (దాదాపు రూ. 1,29,000)

16GB + 1TB: 9,999 యువాన్లు (దాదాపు రూ. 1,43,000)

ట్రాన్స్‌పారెంట్ ఎడిషన్ (16GB + 1TB): 10,999 యువాన్లు (దాదాపు రూ. 1,57,000)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks