Electric scooter : యమహా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. డిజైన్ పేటెంట్ లీక్! అదిరే ఫీచర్లతో

Yamaha Electric scooter : యామహా జపాన్ మార్కెట్లో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం డిజైన్ పేటెంట్ దాఖలు చేసింది. స్పోర్టీ డిజైన్, మిడ్-మౌంటెడ్ మోటార్, స్వాపబుల్ బ్యాటరీ, కీ-లెస్ ఆపరేషన్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తున్న ఈ ఈవీ వివరాలు మీకోసం.

Published on: Jul 23, 2026, 11:22:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ యమహా.. ఎలక్ట్రిక్ వాహనాలపై ఫోకస్​ పెంచింది. ఇందులో భాగంగానే కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన డిజైన్ పేటెంట్‌ను యామహా జపాన్‌లో తాజాగా దాఖలు చేసింది. ఆన్​లైన్‌లో లీకైన ఈ పేటెంట్ చిత్రాలు, స్కూటర్‌కు సంబంధించిన కీలక అంశాలను స్పష్టం చేస్తున్నాయి.

యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర డిజైన్.. (AMCN)
యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర డిజైన్.. (AMCN)

భారత టూ-వీలర్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) ఆదరణ రోజురోజుకూ ముమ్మరమవుతోంది. బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ వంటి పాత దిగ్గజ సంస్థలు తమ ఈవీ పోర్ట్‌ఫోలియోను వేగంగా విస్తరిస్తున్నాయి. కాగా ప్రస్తుతం యామహా భారత మార్కెట్లో ‘ఏరాక్స్-ఈ’, ‘ఈసీ-06’ అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. దేశంలో ఈవీలకు ఉన్న భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా భారత లైన్‌అప్‌లోకి చేర్చే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. అయితే, మన దేశంలో దీని లాంచ్ ఎప్పుడు ఉంటుందనే దానిపై యామహా ఇప్పటివరకు అధికారికంగా పెదవి విప్పలేదు.

డిజైన్ పేటెంట్ లీక్.. అందులోని విశేషాలివే!

లీకైన చిత్రాలను పరిశీలిస్తే, ఈ కొత్త యామహా ఈ-స్కూటర్ చాలా ఆధునికంగా, స్పోర్టీ లుక్‌తో కనిపిస్తోంది.

బాడీ డిజైన్: షార్ప్ ఎడ్జెస్ ఉన్న లేయర్డ్ ఫ్రంట్ ఆప్రాన్, వెనుక వైపు కాస్త గాల్లో తేలుతున్నట్లుండే 'ఫ్లోటింగ్' స్టైల్ టెయిల్ సెక్షన్ ఈ స్కూటర్ ప్రత్యేకం.

ఇదీ చూడండి :- Electric scooter : ఏథర్​ రిజ్టాకు గట్టి పోటీగా.. కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్! లాంచ్ ఎప్పుడంటే..

టెక్నాలజీ అండ్ కీ-లెస్ స్టార్ట్: ఇందులో టీఎఫ్‌టీ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా, డిజైన్‌లో సాంప్రదాయ కీ-హోల్ కనిపించడం లేదు. అంటే ఇది రిమోట్ లేదా స్మార్ట్ కీతో పనిచేసే 'కీ-లెస్' స్టార్టింగ్ మెకానిజంతో రానుందని స్పష్టమవుతోంది.

మోటార్, బ్యాటరీ అండ్ హార్డ్‌వేర్ వివరాలు..

యామహా ఈ కొత్త స్కూటర్ మెకానికల్ సెటప్‌ను కూడా భిన్నంగా తీర్చిదిద్దింది:

మిడ్-మౌంటెడ్ మోటార్: ఈ ఈవీలో మోటార్‌ను మధ్య భాగంలో అమర్చారు. ఇది బెల్ట్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రానికి శక్తిని చేరవేస్తుంది. స్వాపబుల్ బ్యాటరీ సూచనలు: సీటు కింద బ్యాటరీ ప్యాక్‌ను కేటాయించారు. దీనిని సులభంగా బయటకు తీసి ఛార్జ్ చేసుకునే 'స్వాపబుల్ బ్యాటరీ' సౌకర్యం ఉండవచ్చని సమాచారం.

సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్: ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు. రెండు చివర్లలో 12-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో పాటు, సేఫ్టీ కోసం డిస్క్ బ్రేకులు ఇచ్చారు.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈసీ-06, ఏరాక్స్-ఈ మోడళ్లతో పోలిస్తే, ఈ కొత్త స్కూటర్ డిజైన్ చాలా ప్రాక్టికల్‌గా, రోజువారీ వినియోగానికి అనుకూలంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇది భారత్‌లో విడుదలయితే, సామాన్య వాహనదారులకు అందుబాటు ధరలో లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More