భారీ ఇయర్ ఎండ్ ఆఫర్స్ ఇస్తున్న ఆటోమొబైల్ సంస్థల జాబితాలో మారుతీ సుజుకీ కూడా చేరింది. అరెనా నుంచి నెక్సా వరకు అనేక మోడల్స్‌పై ఈ డిసెంబర్ 2025లో దాదాపు రూ. 2.2 లక్షల వరకు బెనిఫిట్స్‌ని అందిస్తోంది.
మారుతీ సుజుకీ ఇయర్ ఎండ్ ఆఫర్స్..
ఆఫర్ వివరాలు: ఈ బెనిఫిట్స్‌లో డైరక్ట్ క్యాష్ డిస్కౌంట్ , ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు, కార్పొరేట్ లేదా సంస్థాగత పథకాలు, గ్రామీణ ప్రాంతాల కోసం ప్రత్యేక ఆఫర్లు వంటివి ఉన్నాయి.
అయితే, ఈ బెనిఫిట్స్ అనేవి మోడల్, వేరియంట్, డీలర్‌షిప్, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి.
ఈ బెనిఫిట్స్ అనేవి ప్రస్తుత సంవత్సరం నాటి వాహనాల స్టాక్‌ను క్లియర్ చేయాలని ఆటోమేకర్, దాని డీలర్‌షిప్‌లు లక్ష్యంగా పెట్టుకోవడంతో వచ్చింది. ప్రస్తుతం మారుతీ సుజుకీ పోర్ట్‌ఫోలియో అంతటా మంచి డిమాండ్‌ను చూస్తున్న సమయంలోనే ఈ ఇయర్ ఎండ్ ఆఫర్‌లు రావడం గమనార్హం. ఈ ఆఫర్స్ డిసెంబర్ 31 వరకు పొందవచ్చు.
ఏ వాహనంపై ఎంత లాభం?
మారుతీ సుజుకీ తమ మొత్తం ప్యాసింజర్ వెహికల్ లైనప్‌లో ఇయర్ ఎండ్ బెనిఫిట్స్‌ని అందిస్తోంది.
నెక్సా ద్వారా లభించే ప్రధాన ఆఫర్లు:
మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా: అత్యధికంగా రూ. 2.19 లక్షల విలువైన ప్రయోజనాలతో లభిస్తోంది.
ఎన్విక్టో ఎంపీవీ: ఈ వాహనంపై కూడా రూ. 2.15 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
జిమ్నీ ఎస్యూవీ: ఈ ఎస్‌యూవీపై రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలు ఉన్నాయి.
{{/usCountry}}జిమ్నీ ఎస్యూవీ: ఈ ఎస్‌యూవీపై రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలు ఉన్నాయి.
{{/usCountry}}ఇగ్నిస్: ఈ మోడల్‌ను రూ. 82,000 విలువైన ప్రయోజనాలతో కొనుగోలు చేయవచ్చు.
| మారుతీ సుజుకీ అరేనా ఇయర్ ఎండ్ ఆఫర్స్ | మారుతీ సుజుకీ నెక్సా ఇయర్ ఎండ్ ఆఫర్స్ | ||
|---|---|---|---|
| మోడల్స్ | ఆఫర్స్ (వరకు) | మోడల్స్ | ఆఫర్స్ (వరకు) |
| ఆల్టో కే10 | రూ. 52,500 | ఇగ్నిస్ | రూ. 82,100 |
| ఎస్-ప్రెస్సో | రూ. 52,500 | బలెనో | రూ. 57,100 |
| వాగన్ఆర్ | రూ. 58,100 | ఫ్రాంక్స్ | రూ. 65,000 |
| సెలేరియో | రూ. 52,500 | గ్రాండ్ విటారా | రూ. 2.19 లక్షలు |
| స్విఫ్ట్ | రూ. 55,000 | జిమ్నీ | రూ. 1 లక్ష |
| డిజైర్ | రూ. 12,500 | ఎక్స్ఎల్6 | రూ. 50,000 |
| ఎర్టిగా | రూ. 10,000 | ఎన్విక్టో | రూ. 2.15 లక్షలు |
| ఈకో | రూ. 52,500 | ||
| బ్రెజా | రూ. 40,000 | ||
అరేనా ద్వారా లభించే ప్రధాన ఆఫర్లు:
వ్యాగన్ఆర్: అరేనా శ్రేణి వాహనాల్లో, వ్యాగన్ఆర్‌పై గరిష్టంగా రూ. 58,100 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
ఎర్టిగా: అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపీవీ అయిన ఎర్టిగాపై అతి తక్కువగా రూ. 10,000 విలువైన ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి.
ఇతర చిన్న కార్లు: ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, ఈకో వంటి చిన్న కార్లపై రూ. 52,500 వరకు ప్రయోజనాలు ఉన్నాయి.
బెస్ట్ సెల్లర్స్: మారుతీ సుజుకీకి ఉన్న బెస్ట్ సెల్లర్లలో ఒకటైన స్విఫ్ట్‌పై రూ. 55,000 విలువైన ప్రయోజనాలు, బ్రెజాపై రూ. 40,000 విలువైన బెనిఫిట్స్ లభిస్తున్నాయి.
డిజైర్: కొత్త తరం మోడల్ విడుదలైనప్పటి నుంచి ఆదరణ మరింత పెరిగిన ఈ సెడాన్, డిసెంబర్ 2025లో రూ. 12,500 వరకు ప్రయోజనాలతో అందుబాటులో ఉంది.