భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన జీవితంలో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు! మైదానంలో తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన చాహల్, ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. చాహల్ భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) చేరినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం వెల్లడించింది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గంలో చాహల్‌ను ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

భారత క్రికెటర్లు రాజకీయాల వైపు అడుగులు వేయడం కొత్తేమీ కాదు. గతంలో మహమ్మద్ అజారుద్దీన్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, గౌతమ్ గంభీర్, యూసుఫ్ పఠాన్ వంటి ఆటగాళ్లు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు.
మోదీ, అమిత్ షాలకు చాహల్ కృతజ్ఞతలు..
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ఆఫీస్ బేరర్లు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఇతర నియామకాలకు సంబంధించిన జాబితాను పార్టీ శనివారం విడుదల చేసింది. ఇందులో దిల్లీ తరఫున ప్రత్యేక ఆహ్వానితుడిగా చాహల్ పేరును ప్రకటించారు. ఈ నియామకంపై చాహల్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ పార్టీ అగ్రనేతలకు ధన్యవాదాలు తెలిపారు.
"బీజేపీ కుటుంబంలో నాకు స్థానం, గౌరవం కల్పించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ, గౌరవ హోంమంత్రి అమిత్ షా జీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ జీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్య జీలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు," అని చాహల్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
చాహల్ క్రికెట్ ప్రస్థానాన్ని పరిశీలిస్తే, భారత్ తరఫున ఇప్పటివరకు 72 వన్డేలు ఆడి 121 వికెట్లు పడగొట్టారు. 80 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 96 వికెట్లు తీశారు. ఐపీఎల్ టోర్నీలో వివిధ ఫ్రాంచైజీల తరఫున 188 మ్యాచ్‌లు ఆడిన చాహల్, ఏకంగా 233 వికెట్లతో లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచారు.
క్రీడా రంగం నుంచి వచ్చిన చాహల్ చేరికతో దేశవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలకు మరింత ఆదరణ లభిస్తుందని బీజేపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గంలో కీలక నియామకాలు
{{/usCountry}}క్రీడా రంగం నుంచి వచ్చిన చాహల్ చేరికతో దేశవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలకు మరింత ఆదరణ లభిస్తుందని బీజేపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గంలో కీలక నియామకాలు
{{/usCountry}}బీజేపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేలా ఏడుగురు జాతీయ ఉపాధ్యక్షులు, ముగ్గురు జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఏడుగురు జాతీయ కార్యదర్శులను నియమించారు. దిల్లీ నుంచి చాహల్‌తో పాటు ఒడిశాకు చెందిన అద్వైత చరణ్ గణనాయక్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యాయవాది సీమా సమృద్ధి కుష్వాహాలను ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపిక చేశారు.
జాతీయ ఉపాధ్యక్షులు: జోగెన్ మోహన్ (అసోం), మమతా మొహంతా (ఒడిశా), సంగమ్ లాల్ గుప్తా (ఉత్తరప్రదేశ్), బబన్‌రావు రావ్‌జీ చౌదరి (మహారాష్ట్ర), సత్ ప్రకాశ్ రాణా (దిల్లీ), అర్జున్ సహాని (బిహార్), సంగీతా బల్వంత్ బింద్ (ఉత్తరప్రదేశ్).
జాతీయ ప్రధాన కార్యదర్శులు: గజేంద్ర యాదవ్ (దిల్లీ), ప్రమోద్ మధ్వరాజ్ (కర్ణాటక), లలిత్ చంద్రకర్ (ఛత్తీస్‌గఢ్).
జాతీయ కార్యదర్శులు: కడగంచి రమేశ్ (తెలంగాణ), దశరథ్‌జీ ఠాకూర్ (గుజరాత్), టి. వరదరాజన్ (తమిళనాడు), సంజీవ్ కుమార్ అలియాస్ బబ్లూ భగత్ (ఝార్ఖండ్), సరితా జాంగిడ్ (హర్యానా), వైభవ్ పన్వార్ (మధ్యప్రదేశ్), భీమ్ కుమార్ సాహు (బిహార్).
కోశాధికారి, ఇతర బాధ్యతల కేటాయింపు..
సంస్థాగత నియామకాల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాధేశ్యామ్ యాదవ్‌ను జాతీయ కోశాధికారిగా నియమించారు. దిల్లీకి చెందిన సంజయ్ కుమార్ గుర్జర్‌కు జాతీయ కార్యాలయ కార్యదర్శిగా, డాక్టర్ అరుణ్ యాదవ్‌కు సహ-కార్యాలయ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. బిహార్‌కు చెందిన అజయ్ గుప్తాను మోర్చా మీడియా కోఆర్డినేటర్‌గా నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది.
ABOUT THE AUTHOR
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.