...
...
Next Story

Electric Scooter for woman : రూ. 69,990కే ఎలక్ట్రిక్​ స్కూటర్​- మహిళల కోసం ‘రాణి’ ఎడిషన్​..

ప్రముఖ ఈవీ తయారీ సంస్థ జెలో ఎలక్ట్రిక్​.. తన నైట్​+ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కొత్త, లిమిటెడ్​ ఎడిషన్​ని తీసుకొచ్చింది. మహిళలను ఆకర్షించే విధంగా కలర్​ఫుల్​ రంగు, తక్కువ ధరతో “రాణి” ఎడిషన్​ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 7, 2026, 12:20:44 IST
Advertisement

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఈవీ తయారీ సంస్థ జెలో ఎలక్ట్రిక్.. తన పాపులర్ మోడల్ నైట్+ లో సరికొత్త లిమిటెడ్​ ఎడిషన్​ ‘నైట్+ రాణి’ని మార్కెట్​లోకి విడుదల చేసింది. మహిళా సాధికారతను చాటుతూ, ద్విచక్ర వాహన రంగంలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో జెలో ఎలక్ట్రిక్ ఈ ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకువచ్చింది.

జెలో ఎలక్ట్రిక్​ నైట్​+ రాణి ఎడిషన్
జెలో ఎలక్ట్రిక్​ నైట్​+ రాణి ఎడిషన్

కేవలం 999 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండే ఈ స్కూటర్, ప్రత్యేకమైన డిజైన్, ఆకర్షణీయమైన రంగులతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

జెలో ఎలక్ట్రిక్​ నైట్​+ రాణి ఎడిషన్​- ప్రత్యేకతలు, డిజైన్..

నైట్+ రాణి ఎడిషన్ ప్రధానంగా దాని రంగుతోనే ప్రత్యేక గుర్తింపు పొందుతుంది.

బేబీ పింక్ థీమ్: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 'బేబీ పింక్' రంగులో ఉండి, వైట్ ప్యానెల్స్‌తో కాంట్రాస్టింగ్ లుక్‌ను ఇస్తుంది.

డిజైన్: సాధారణ నైట్+ మోడల్‌తో పోలిస్తే, ఇందులో చిన్నపాటి మార్పులతో మరింత స్టైలిష్‌గా తీర్చిదిద్దారు. ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఈ డిజైన్ ఉందని సంస్థ పేర్కొంది.

జెలో ఎలక్ట్రిక్​ నైట్​+ రాణి ఎడిషన్- పర్ఫార్మెన్స్, బ్యాటరీ..

మెకానికల్ పరంగా చూస్తే, ఈ స్పెషల్ ఎడిషన్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఇది ఇప్పటికే ఉన్న నైట్+ ప్లాట్‌ఫామ్‌పైనే పనిచేస్తుంది.

బ్యాటరీ: ఇందులో 1.8 కేడబ్ల్యూహెచ్​ సామర్థ్యం గల పోర్టబుల్ ఎల్​ఎఫ్​పీ బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనిని స్కూటర్ నుంచి వేరు చేసి విడిగా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.

రేంజ్: ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.

తక్కువ ధరలోనే ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్ ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది:

హిల్ హోల్డ్ కంట్రోల్: ఎత్తు పల్లాల రోడ్లపై లేదా ఫ్లైఓవర్లపై స్కూటర్ వెనక్కి జారకుండా ఇది సహాయపడుతుంది.

క్రూయిజ్ కంట్రోల్: లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు ఒకే స్థిరమైన వేగంతో వెళ్లే సౌకర్యం.

ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్స్: స్కూటర్ పార్క్ చేసిన తర్వాత కూడా కాసేపు లైట్లు వెలుగుతూ ఉంటాయి.

యూఎస్​బీ ఛార్జింగ్: ప్రయాణంలో ఫోన్ ఛార్జ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

జెలో ఎలక్ట్రిక్​ నైట్​+ రాణి ఎడిషన్- ధర, లభ్యత..

జెలో నైట్+ రాణి ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 69,990 గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న జెలో ఎలక్ట్రిక్ డీలర్ల వద్ద దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కేవలం 999 స్కూటర్లు మాత్రమే ఉత్పత్తి చేయనుండటంతో, వీటికి డిమాండ్ భారీగా ఉండే అవకాశం ఉంది.

“దేశంలో 'రాణి' అనే పదానికి ఉన్న విలువకు గుర్తుగా మా ఎలక్ట్రిక్​ స్కూటర్​కి ఈ రంగును నిర్ణయించాము. కాన్ఫిడెన్స్​, డెసిషన్​-మేకింగ్​, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఈ కొత్త ఎడిషన్​ని రూపొందించాము,” అని జెలో ఎలక్ట్రిక్​ కో-ఫౌండర్​ ముకుంద్​ బహెటి తెలిపారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks