CJP protest live : ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి’- సీజేపీ నిరసనలతో హోరెత్తిన జంతర్ మంతర్..

CJP protest : భారీ భద్రత మధ్య దిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు జరుగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్​ చేస్తూ నిర్వహించిన ఈ ఆందోళనకు వేలాది మంది తరలివెళుతున్నారు.

Published on Jun 06, 2026 11:23 am IST 5 Photos
1/5

కాక్రోచ్​ జనతాా పార్టీ పిలుపునిచ్చిన నిరసనల్లో పాల్గొనేందుకు దిల్లీలోని జంతర్​ మంతర్​ వద్దకు వేలాదిగా ప్రజలు తరలివెళుతున్నారు. ఈ నేపథ్యంలో నిరసనకారులకు సీజేపీ ఫౌండర్​ అభిజీత్ దీప్కే కీలక విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు శాంతియుతంగా డిమాండ్​ చేయాలన్నారు.

(REUTERS)

2/5

జంతర్​ మంతర్​ వద్ద ఓ వ్యక్తి ఇలా, బొద్దింక మాస్క్​ వేసుకుని కనిపించారు. ఈ ఆందోళనకు విపక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. టీఎంసీ రాజ్యసభ ఎంపీ సాగరిక ఘోష్, ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్​చుక్ వంటి వారు నిరసనలకు మద్దతిచ్చారు.

(REUTERS)

3/5

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఈ నిరసనలకు దిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. కాగా జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో భారీ మొత్తంలో పోలీసు బలగాలను మోహరించారు. ఒక హై లెవల్ సెక్యూరిటీ మీటింగ్​ని సైతం నిర్వహించారు.

(PTI)

4/5

నిరసనకారులు ఇలా ప్లకార్డులు పట్టుకుని తమ నిరసనలను వ్యక్తం చేశారు.

(PTI)

5/5

“ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి”, “ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి” అన్న నినాదాలతో జంతర్ మంతర్ ప్రాంగణం హోరెత్తుతోంది. “మేము ఎన్నుకుంటేనే ధర్మేంద్ర ప్రధాన్ విద్యామంత్రి అయ్యారు. మా పన్నులతో ఆయనకు జీతాలు అందుతున్నాయి. కానీ ఆయన విద్యామంత్రిగా చేస్తున్న కాలంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి జారిపోయింది,” అని సీజేపీ సోషల్​ మీడియాలో ఒక పోస్టు చేసింది.

(REUTERS)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

OTHER GALLERIES

ఎంత రుద్దినా మాడిన గిన్నెలు మెరవట్లేదా? ఇలా ఒక్కసారి చేసి చూడండి

5

మాడిపోయిన పాత్రను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, వెనిగర్ మిశ్రమం ఉత్తమమైన మార్గంగా పరిగణిస్తారు. ఈ రెండింటి రసాయన చర్య వల్ల ఏర్పడే నురుగు, పాత్రకు అంటుకున్న మురికిని సులభంగా వదులు చేస్తుంది. ముందుగా ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు పోసి వేడి చేయడానికి పొయ్యి మీద పెట్టండి. అందులో 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, కొద్దిగా వెనిగర్ కలపండి. బాగా కలిపి 5-10 నిమిషాల పాటు మరిగించండి. గిన్నెలోని నీళ్ళు చల్లారిన తర్వాత, స్క్రబ్బర్ ఉపయోగించి మెల్లగా రుద్దండి.

Published on Jul 27, 2026 05:43 pm IST

ఫ్రైడ్ ఫుడ్స్ చూస్తే నోరు ఎందుకు ఆగదు? సైన్స్ ఇదే! కానీ అనేక ఆరోగ్య సమస్యలు కూడా

6

మనం ఇష్టపడే ఆహారాన్ని తిన్నప్పుడు మెదడులోని ‘డోపమైన్’ వ్యవస్థ చురుగ్గా మారుతుంది. డోపమైన్ అనేది కేవలం సంతోషాన్నిచ్చే రసాయనం మాత్రమే కాదు; అది ఆ అనుభవాన్ని మెదడు గుర్తుంచుకునేలా చేస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో మళ్లీ ఆ ఆహారాన్ని తినాలనే బలమైన కోరిక పుడుతుంది. అందుకే కడుపు నిండి ఉన్నప్పటికీ, సమోసాలు లేదా ఫ్రైస్ వాసన చూడగానే తినాలనిపిస్తుంది. అయితే, ఫ్రైడ్ ఫుడ్ తినాలనిపించడం అంటే శరీరంలో ఏదో ఒక పోషకం తగ్గిందని అర్థం కాదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం మనం అలవర్చుకున్న అలవాట్లు, భావోద్వేగాలు, ఆహార వాసనలు లేదా పాత అనుభవాల వల్ల కలిగే ప్రతిస్పందన మాత్రమే అని చెబుతున్నారు.

Published on Jul 27, 2026 12:19 pm IST

బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీకి వర్ష సూచన, మత్స్యకారులకు హెచ్చరికలు!

6

ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Published on Jul 27, 2026 06:02 am IST

రెచ్చిపోయిన సూర్యవంశీ- జస్ట్ లో సెంచరీ మిస్-జింజాబ్వేతో టీ20లో భారత్ భారీ స్కోరు

5

టీమిండియా యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగాడు. జింబాబ్వేతో మూడో టీ20లో ధనాధన్ బ్యాటింగ్ తో సత్తాచాటాడు.

Published on Jul 26, 2026 06:12 pm IST

గోడలపై ఉన్న పెన్ను, పెన్సిల్ మరకలు తొలగించడానికి సులభమైన చిట్కాలు!

5

గోడపై మరకలు ఉంటే అత్యంత సులభమైన, సురక్షితమైన పద్ధతి డిష్‌వాషింగ్ లిక్విడ్‌ను ఉపయోగించడం. ఇలా చేయడానికి ఒక బకెట్‌లో గోరువెచ్చని నీటిని తీసుకుని, అందులో కొన్ని చుక్కల డిష్‌వాషింగ్ లిక్విడ్‌ను కలపండి. ఒక మైక్రోఫైబర్ వస్త్రాన్ని ఈ ద్రవంలో కొద్దిగా ముంచి, నీటిని పిండేసి, మరక ఉన్న ప్రదేశాన్ని మెల్లగా తుడవండి. మరకలు పోయిన తర్వాత గోడను దానంతట అదే ఆరనివ్వండి.

Published on Jul 26, 2026 05:19 pm IST

22.8 కిలోమీటర్ల మైలేజ్​ ఇచ్చే హైబ్రిడ్​ ఎస్​యూవీని లాంచ్​ చేసిన హోండా- ఫీచర్లు..

5

ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలో అత్యాధునిక సాంకేతిక ఫీచర్లను హోండా నింపేసింది.

వైర్‌లెస్ యపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.2-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12-స్పీకర్ బాస్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, లగేజ్ కోసం విశాలమైన స్పేస్, 60:40 స్ప్లిట్-ఫోల్డింగ్ వెనుక సీట్లు, (సీట్లు మడిచితే ఏకంగా 1,313 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది). హ్యాండ్స్-ఫ్రీ పవర్డ్ టైల్‌గేట్, రీజెనరేటివ్ బ్రేకింగ్ ప్యాడిల్ షిఫ్టర్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఐడిల్ స్టాప్ సిస్టమ్, ఆటో రివర్స్-టిల్ట్ సైడ్ మిర్రర్లు వంటి మరెన్నో ఆధునిక హంగులు ఉన్నాయి.

Published on Jul 26, 2026 11:20 am IST