...
...
Next Story

ఫిట్​నెస్​లో చిన్న మార్పులతో పెద్ద ఫలితాలు- మీ ఆరోగ్యం కోసం చేయాల్సిన 4 పనులు..

ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రొటీన్ తీసుకోవడం, నడక పెంచడం, వ్యాయామం చేయడం, త్వరగా నిద్రపోవడం లాంటి నాలుగు సులభమైన పనులు చేయాలని ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ రాజ్ గణపత్ సూచిస్తున్నారు.

Published on: Aug 24, 2026, 12:20:46 IST
Advertisement
<p>ఫిట్‌నెస్ అనగానే ఆహారపు అలవాట్లు, వ్యాయామం, జీవనశైలిలో ఒకేసారి భారీ మార్పులు చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ అలా చేయడం వల్ల త్వరగానే అలసిపోయి మధ్యలో వదిలేసే ప్రమాదం ఉంది. ఆరోగ్యం మెరుగుపడాలంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. చిన్న, సులభమైన అలవాట్లతో మొదలుపెట్టి వాటిని క్రమం తప్పకుండా పాటిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీ తదుపరి భోజనంలో ప్రొటీన్‌ను పెంచడం, కాస్త ఎక్కువగా నడవడం లేదా సరైన సమయానికి నిద్రపోవడం లాంటి చిన్న మార్పులే దీర్ఘకాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలికి పునాది వేస్తాయి. ఫిట్‌నెస్ విషయంలో రాత్రికి రాత్రే అన్నీ మార్చేయాలనుకోవడం కంటే, నెమ్మదిగా, స్థిరంగా అడుగులు వేయడం చాలా ఎఫెక్టివ్ అని చెన్నైకి చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ రాజ్ గణపత్ వివరిస్తున్నారు. రాబోయే 24 గంటల్లో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు చేయగలిగే నాలుగు సులభమైన పనులను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకున్నారు.</p>

ఫిట్‌నెస్ అనగానే ఆహారపు అలవాట్లు, వ్యాయామం, జీవనశైలిలో ఒకేసారి భారీ మార్పులు చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ అలా చేయడం వల్ల త్వరగానే అలసిపోయి మధ్యలో వదిలేసే ప్రమాదం ఉంది. ఆరోగ్యం మెరుగుపడాలంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. చిన్న, సులభమైన అలవాట్లతో మొదలుపెట్టి వాటిని క్రమం తప్పకుండా పాటిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీ తదుపరి భోజనంలో ప్రొటీన్‌ను పెంచడం, కాస్త ఎక్కువగా నడవడం లేదా సరైన సమయానికి నిద్రపోవడం లాంటి చిన్న మార్పులే దీర్ఘకాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలికి పునాది వేస్తాయి. ఫిట్‌నెస్ విషయంలో రాత్రికి రాత్రే అన్నీ మార్చేయాలనుకోవడం కంటే, నెమ్మదిగా, స్థిరంగా అడుగులు వేయడం చాలా ఎఫెక్టివ్ అని చెన్నైకి చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ రాజ్ గణపత్ వివరిస్తున్నారు. రాబోయే 24 గంటల్లో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు చేయగలిగే నాలుగు సులభమైన పనులను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకున్నారు.

ప్రోటీన్- మీ రోజువారీ ఆహారాన్ని మరింత పౌష్టికరం చేయడానికి, ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకోవడానికి భోజనంలో ప్రొటీన్ పెంచడం సులభమైన మార్గం. మీ తదుపరి భోజనం—అది బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ లేదా స్నాక్ ఏదైనా సరే.. కనీసం 20గ్రాముల ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలని రాజ్ సలహా ఇస్తున్నారు. "మొదటి పని, మీ తదుపరి భోజనంలో కనీసం 20 గ్రాముల ప్రొటీన్ ఉండేలా చూసుకోండి. ఆదర్శవంతంగా చెప్పాలంటే అది 30 నుంచి 40 గ్రాములు ఉండాలి. అది జంతు సంబంధిత ప్రొటీన్ అయినా, మొక్కల ఆధారిత ప్రొటీన్ అయినా లేదా సప్లిమెంట్ అయినా పర్వాలేదు. మీ ప్లేట్‌లో కచ్చితంగా ప్రొటీన్ ఉండేలా చూసుకోండి," అని రాజ్ వివరించారు.

వ్యాయామం- వర్కవుట్ల పట్ల ఆసక్తి పెంచుకోవడానికి, ఒక క్రమపద్ధతిలో సాగడానికి సులభమైన వ్యాయామంతో మొదలుపెట్టడం ఉత్తమం. ఒకసారి అది అలవాటుగా మారితే, ఇతర వ్యాయామాలను క్రమంగా జోడించడం సులభం అవుతుంది. ఈ విషయమై రాజ్ మాట్లాడుతూ.. "రెండొవది, రాబోయే 24 గంటల్లో ఏదో ఒక వర్కవుట్ చేయాలని నిర్ణయించుకోండి. అది ఎంత తీవ్రమైనది, ఎంత సమయం పడుతుంది, ఏ పరికరాలు వాడుతున్నారు అనేది ముఖ్యం కాదు. మీకు ఇప్పటికే ఒక ప్లాన్ లేదా ట్రైనర్ ఉంటే ఫర్వాలేదు. లేకపోతే, ఒక వర్కవుట్ ఎంచుకుని, దానిని కచ్చితంగా చేయాలని ఫిక్స్ అవ్వండి," అని పేర్కొన్నారు.

ఎక్కువగా నడవండి- నడక అనేది చాలా సులభమైన. అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం. ఫిట్‌నెస్ దిశగా చిన్నదైనా అర్థవంతమైన అడుగు వేయాలనుకుంటే, రాబోయే 24 గంటల్లో మీరు సాధారణంగా నడిచే దానికంటే కాస్త ఎక్కువగా నడవాలని రాజ్ సూచిస్తున్నారు. దీనికి నిర్దిష్టమైన టార్గెట్ ఏమీ లేదు, మీరు రోజువారీగా వేసే అడుగులకు కాస్త అదనంగా జోడించడమే లక్ష్యం. "మూడవది, రాబోయే 24 గంటల్లో మీరు రోజూ నడిచేదాని కంటే కాస్త ఎక్కువగా నడవండి. మీరు రోజూ 5,000 అడుగులు వేస్తుంటే, దానిని 6,000 చేయండి. 9,000 వేస్తుంటే 10,000 చేయండి. కేవలం కాస్త ఎక్కువగా నడవడానికి ప్రయత్నించండి," అని ఆయన వివరించారు.

నిద్ర అవసరం- ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడంలో నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది మరో ముఖ్యమైన అడుగు. రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చూసుకుంటూ గంటల తరబడి గడపడం మానేసి, త్వరగా పడుకోవడానికి ప్రయత్నించండి. మంచి నిద్ర మీ మొత్తం ఆరోగ్యం, శారీరక రికవరీ, ఫిట్‌నెస్‌కు ఎంతగానో దోహదపడుతుంది. రాజ్ తన చివరి సూచనగా, "నాలుగవది.. ఈ రాత్రికి త్వరగా నిద్రపోండి. అప్పుడే మీరు రేపటి పనులన్నీ సక్రమంగా చేయగలుగుతారు. ఇప్పటికే ఆలస్యమైతే, ఫోన్ పక్కన పెట్టి వెంటనే నిద్రకు ఉపక్రమించండి," అని సలహా ఇచ్చారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe