...
...
Next Story

Weight loss : ఇంకేమీ అక్కర్లేదు- ఇవి చేస్తే చాలు.. 3 నెలల్లో 20 కేజీలు పక్కా తగ్గుతారు!

క్రాష్ డైటింగ్‌లు, కఠినమైన ఉపవాసాలు లేకుండా కేవలం మూడు నెలల్లోనే 20 కిలోల వరకు బరువు తగ్గేలా ఒక పోషకాహార నిపుణుడు తన ఇన్​స్టాగ్రామ్‌లో షేర్ చేసిన 7 అంచెల ప్రాక్టికల్ వెయిట్ లాస్ ఫార్ములా మీకోసం..

Published on: Jul 10, 2026, 11:20:40 IST
Advertisement
<p>నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, గంటల తరబడి కూర్చుని పనిచేసే ఉద్యోగాల వల్ల ఊబకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బరువు తగ్గాలని చాలా మంది జిమ్‌లలో చేరడం, యూట్యూబ్ చూసి క్రాష్ డైటింగ్‌లు చేయడం చేస్తుంటారు. కానీ, సరైన పద్ధతి పాటించకపోతే బరువు తగ్గడం పక్కన పెడితే లేనిపోని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి షార్ట్‌కట్‌లు లేకుండా, కేవలం 90 రోజుల పాటు క్రమశిక్షణతో పాటిస్తే 20 కిలోల వరకు సులభంగా బరువు తగ్గే ఒక అద్భుతమైన విధానాన్ని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఇషాన్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.</p>

నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, గంటల తరబడి కూర్చుని పనిచేసే ఉద్యోగాల వల్ల ఊబకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బరువు తగ్గాలని చాలా మంది జిమ్‌లలో చేరడం, యూట్యూబ్ చూసి క్రాష్ డైటింగ్‌లు చేయడం చేస్తుంటారు. కానీ, సరైన పద్ధతి పాటించకపోతే బరువు తగ్గడం పక్కన పెడితే లేనిపోని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి షార్ట్‌కట్‌లు లేకుండా, కేవలం 90 రోజుల పాటు క్రమశిక్షణతో పాటిస్తే 20 కిలోల వరకు సులభంగా బరువు తగ్గే ఒక అద్భుతమైన విధానాన్ని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఇషాన్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

క్యాలరీ డెఫిసిట్ పాటించండి- బరువు తగ్గాలని అనుకోగానే చాలా మంది చేసే మొదటి తప్పు తిండి మానేయడం. కడుపు మార్చుకోవడం వల్ల శరీరం బలహీనపడుతుంది తప్ప కొవ్వు కరగదు. దీనికి బదులుగా మీ శరీరం రోజుకు ఖర్చు చేసే క్యాలరీల కంటే కొద్దిగా తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. దీన్నే ‘క్యాలరీ డెఫిసిట్’ అంటారు. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో కొద్దిగా క్యాలరీలను తగ్గించుకుంటూ పోతే ఆరోగ్యకరమైన మార్పు వస్తుంది.

హై-ప్రోటీన్ డైట్ తీసుకోండి- బరువు తగ్గే ప్రక్రియలో కండరాలు బలహీనపడకుండా ఉండాలంటే ప్రోటీన్ చాలా అవసరం. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది, త్వరగా ఆకలి వేయనివ్వదు. కోడిగుడ్లు, చికెన్, పనీర్, మొలకెత్తిన గింజలు, పప్పు ధాన్యాల వంటి హై-ప్రోటీన్ ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరంలో ఫ్యాట్ మాత్రమే కరిగి కండరాలు గట్టిపడతాయి.

రోజుకు 8 వేల నుండి 12 వేల అడుగులు- వ్యాయామాలన్నింటిలోకి నడక అత్యంత ప్రభావవంతమైనది! ఎలాంటి అలసట లేకుండా సులభంగా క్యాలరీలను కరిగించడానికి ఇది తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ నియమితంగా 8,000 నుంచి 12,000 అడుగులు నడవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

స్ట్రెంత్ ట్రైనింగ్- వారానికి నాలుగు నుంచి ఐదు సార్లు వెయిట్ లిఫ్టింగ్ లేదా స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో మెటబాలిజం (జీవక్రియల వేగం) పెరుగుతుంది. మెటబాలిజం రేటు పెరిగినప్పుడు మనం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా శరీరం క్యాలరీలను కరిగిస్తూనే ఉంటుంది.

లిక్విడ్ క్యాలరీలకు దూరం- మనం తినే ఆహారంతో పాటు తాగే పానీయాల ద్వారా శరీరంలోకి వెళ్లే క్యాలరీలను చాలా మంది గమనించరు. కూల్‌డ్రింక్స్, ప్యాకెట్ జ్యూస్‌లు, చక్కెర ఎక్కువగా ఉండే కాఫీ, టీ వంటి లిక్విడ్ క్యాలరీలను డైట్ నుంచి పూర్తిగా తొలగించాలి. ఇవి శరీరంలో కొవ్వు నిల్వలను విపరీతంగా పెంచేస్తాయి.

ఫిక్స్​డ్​ రోటీన్- బరువు తగ్గే ప్రయాణంలో టైమ్ మేనేజ్‌మెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం, రాత్రి వేళల్లో ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. నిద్ర లేమి, జీవక్రియల సమయం మారడం వల్ల బరువు తగ్గడం కష్టమవుతుంది.

వారానికి ఒకసారి మాత్రమే బరువు చూసుకోండి- ప్రతిరోజూ ఉదయం వెయింగ్ మెషిన్ ఎక్కి బరువు చూసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. శరీరంలో నీటి శాతం మారడం వల్ల బరువులో రోజువారీ మార్పులు సహజం. అందుకే ప్రతిరోజూ కాకుండా, వారానికి ఒకసారి మాత్రమే బరువును ట్రాక్ చేస్తూ.. నెలవారీగా వస్తున్న మార్పులను గమనించడం ఉత్తమమైన పద్ధతి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe