...
...
Next Story

2026లో ఈ రాశుల వారికి కోరుకున్న ఉద్యోగం, మంచి అవకాశాలు వస్తాయి!

కోరుకున్న ఉద్యోగం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అదృష్టం కూడా కలిసి రావాలి. అప్పుడే కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం వస్తుందా లేదా అనేది ఉద్యోగ స్థానాన్ని, అంటే దశమ స్థానం, దశమాధిపతిని చూసి చెప్పొచ్చు. ఈ ప్రకారం ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయా లేదా అనే విషయం తెలుస్తుంది.

Published on: Jan 4, 2026, 08:20:21 IST
Advertisement

కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలని అందరూ కోరుకుంటారు. అయితే కొత్త సంవత్సరం కొన్ని రాశుల వారికి ఉద్యోగయోగం రాబోతోంది. మరి అదృష్ట రాశులు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం. కోరుకున్న ఉద్యోగం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అదృష్టం కూడా కలిసి రావాలి. అప్పుడే కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. అయితే ఉద్యోగం వస్తుందా లేదా అనేది ఉద్యోగ స్థానాన్ని, అంటే దశమ స్థానం, దశమాధిపతిని చూసి చెప్పొచ్చు.

2026లో ఈ రాశుల వారికి కోరుకున్న ఉద్యోగం, మంచి అవకాశాలు (pinterest)
2026లో ఈ రాశుల వారికి కోరుకున్న ఉద్యోగం, మంచి అవకాశాలు (pinterest)

ఈ ప్రకారం ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయా లేదా అనే విషయం తెలుస్తుంది. 2026లో చూసినట్లయితే ఈ రాశుల కెరీర్‌లో బాగా రాణిస్తారు. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మరి ఆ అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.

2026లో ఈ రాశుల వారికి కోరుకున్న ఉద్యోగం

1.మిథున రాశి

మిథున రాశి వారికి 2026 బాగా కలిసి రాబోతోంది. దశమ స్థానంలో శని, దశమాధిపతి గురువు మిథున రాశిలో ఉండడంతో నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కోరుకున్న కంపెనీలో, ఆశించిన ఉద్యోగం లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ ఉద్యోగాలకు ట్రై చేస్తున్న వారికి కూడా ఈ సమయం కలిసి రాబోతోంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో కూడా మీరు ఘన విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2.వృషభ రాశి

ఇక ఈ రాశి విషయానికి వస్తే.. దశమ స్థానంలో రాహువు, దశమ స్థానాధిపతి శని బలమైన సంచారం చేయడంతో బాగా కలిసి రాబోతోంది. సొంత ఊర్లో ఉద్యోగం లభించడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే స్థిరత్వం ఉంటుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కూడా ఈ ఏడాదంతా మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి కూడా ఇది అద్భుతమైన సమయం.

3.తులా రాశి

దశమాధిపతి కుజుడు జనవరిలో ఉచ్చ స్థానంలో ఉండడంతో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. దశమ స్థానాధిపతి కుజుడు అనుకూలంగా ఉండడంతో నిరుద్యోగుల కల నెరవేరుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. ఉద్యోగం మారాలనుకునే వారికి కూడా ఇవి గోల్డెన్ డేస్.

5.మకర రాశి

దశమ స్థానాధిపతి శుక్రుడు జనవరిలో మకర రాశిలో సంచరిస్తాడు. దీంతో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. శుక్రుడు అనుకూలంగా మారడంతో పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఈ రాశి వారు విజయాలను అందుకుంటారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మంచి ఆఫర్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks