...
...
Next Story

2026 Saggitarus Horoscope: కొత్త ఏడాది ధనస్సు రాశి వారి దశ తిరిగిపోతుంది.. కొత్త ప్రాజెక్టులు, కాంట్రాక్టులతో పాటు ఎన్నో

2026 ధనస్సు రాశి వారికి మంచి సంవత్సరం. ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. ఈ రోజు 2026లో ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది? కెరియర్‌లో, ఆరోగ్యంలో ఎలాంటి మార్పులను చూస్తారు? కొత్త ఆంగ్ల సంవత్సరం ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Nov 18, 2025, 13:30:10 IST
Advertisement

మరికొన్ని రోజుల్లో 2025 పూర్తి కాబోతోంది, 2026 రాబోతోంది. 2026లో ఏ రాశులు వారు ఎలాంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు 2026లో ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది? కెరియర్‌లో, ఆరోగ్యంలో ఎలాంటి మార్పులను చూస్తారు? కొత్త ఆంగ్ల సంవత్సరం ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

2026 ధనస్సు రాశి వారి వార్షిక ఫలితాలు

2026 ధనస్సు రాశి వారి వార్షిక ఫలితాలు (pinterest)
2026 ధనస్సు రాశి వారి వార్షిక ఫలితాలు (pinterest)

2026 ధనస్సు రాశి వారికి మంచి సంవత్సరం. ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. కెరియర్‌లో మంచి మార్పులను చూస్తారు. ఆర్థికపరంగా బాగుంటుంది. కొత్త ప్రాజెక్టులతో సక్సెస్‌ను అందుకుంటారు. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆనందంగా ఉంటుంది.

2026 ధనస్సు రాశి వారి కెరియర్ ఫలితాలు

2026లో ధనస్సు రాశి వారికి కెరియర్ బాగుంటుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగులు ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్లను చూస్తారు. వ్యాపారులకు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. ఆర్థికపరంగా కలిసి వస్తుంది. కొత్త ప్రాజెక్టులు లేదా కాంట్రాక్టులు లభించవచ్చు. 2026 చివరి ఆరు నెలల్లో కూడా విజయాలను అందుకుంటారు. పని ప్రదేశంలో మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు.

కుటుంబ జీవితం ఎలా ఉంటుంది?

2026లో ధనస్సు రాశి వారి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రశాంతత, సంతోషం ఉంటాయి. తల్లిదండ్రులు సపోర్ట్ ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుని విజయాలను అందుకుంటారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లల పురోగతిని చూస్తారు. పిల్లలు విద్యా, కెరియర్‌లో మంచి మార్పులు వస్తాయి. కాంపిటేటివ్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న మీ పిల్లలు సక్సెస్‌ను అందుకుంటారు. పిల్లలకు పెళ్లిళ్లకు సంబంధించిన కూడా శుభవార్తలను వింటారు. ఏడాది మధ్యలో పిల్లల ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

ఆర్థిక ఫలితాలు

ఈ కొత్త ఏడాది ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. నీరసం, గ్యాస్, ఉదర సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. రెగ్యులర్‌గా యోగా, మెడిటేషన్ వంటి వాటిపై దృష్టి పెట్టండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి.

ప్రేమ ఫలితాలు

2026లో ఈ రాశి వారికి ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. పెళ్లి కాని వారు తగిన చక్కటి జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంది. పెళ్లైన వారు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు. భాగస్వామితో ట్రిప్‌లు కూడా వేసే అవకాశం ఉంది.

కెరియర్ ఎలా ఉంటుంది?

2026లో ఈ రాశి వారికి కెరియర్ బాగుంటుంది. సైన్స్, ఫిలాసఫీ, అడ్మినిస్ట్రేషన్, టీచింగ్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది.

ప్రయాణాలు

2026లో ఈ రాశి వారు ప్రయోజనకరమైన ప్రయాణాలు చేస్తారు. బిజినెస్ ట్రిప్‌లు కూడా వేస్తారు. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది.

పరిహారాలు

ఈ ఏడాది విష్ణుమూర్తిని పూజించడం వలన బాగా కలిసి వస్తుంది. పసుపు రంగు దుస్తులను గురువారం రోజున ధరిస్తే మంచిది. అలాగే పసుపు రంగు వాటిని గురువారం నాడు దానం చేయండి. ఇలా శుభ ఫలితాలను పొందుతారు, సంతోషంగా ఉండొచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks