...
...
Next Story

ప్రతికూల శక్తుల నుండి రక్షణ కోసం 4 మంత్రాలు.. ఏ టైమ్‌లో జపించాలి?

మంత్రాలకు మన అంతరంగాన్ని పునఃసృష్టించే శక్తి ఉంది. అందుకే వాటిని జపించినప్పుడు మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. దైవిక శక్తులు మనతో ఉన్నాయని మనం భావిస్తాం. కొన్ని మంత్రాలకు మనల్ని ప్రతికూల శక్తుల నుండి రక్షించే శక్తి కూడా ఉంది.

Published on: Sep 7, 2026, 19:29:30 IST
Advertisement

ప్రతికూల శక్తి మన జీవితాలలో సమస్యలు, కష్టాలు, దుఃఖాలు, వైఫల్యాలను సృష్టిస్తుంది. ప్రతికూల శక్తి మన ఇంటిని లేదా మన జీవితాలను ఆక్రమించుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మనం ప్రతికూల శక్తికి గురైనప్పుడు, వివిధ రకాల ప్రభావాలను అనుభవిస్తాం. అది శారీరకంగా లేదా మానసికంగా ఉండవచ్చు. ప్రతికూల ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. ఇటువంటి ప్రతికూల శక్తుల నుండి మనల్ని రక్షించే శక్తి ఈ ప్రభావవంతమైన మంత్రాలు ఉన్నాయి.

దుర్గా మంత్రం

జపించాల్సిన 4 మంత్రాలు
జపించాల్సిన 4 మంత్రాలు

'ఓం దుం దుర్గాయ నమః' అనే దుర్గా మంత్రాన్ని జపించడం వ్యక్తుల మధ్య సంబంధాలను, వారి బంధాలను మెరుగుపరుస్తుంది. ఇది మన మనస్సును ప్రభావితం చేసే ప్రతికూలతల నుండి మనల్ని రక్షిస్తుందని నమ్ముతారు. భావోద్వేగ అస్థిరత, ఇతరుల నుండి ప్రతికూలత, ఆత్మవిశ్వాసం లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తి ఈ మంత్రాన్ని జపించాలి.

ఈ దుర్గా మంత్రాన్ని ప్రతి ఉదయం లేదా సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం కనీసం 108 సార్లు జపించాలి. నవరాత్రుల సమయంలో ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.

గాయత్రీ మంత్రం

"ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం

భర్గో దేవస్య ధీమహి

ధియో యో నః ప్రచోదయాత్"

అనేది హిందూమతంలో అత్యంత ప్రభావవంతమైన మంత్రాలలో ఒకటి. ప్రజలు మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి తరచుగా గాయత్రీ మంత్రాన్ని జపిస్తారు. ఇది ఒక వ్యక్తి చుట్టూ రక్షిత శక్తిని సృష్టిస్తుందని నమ్ముతారు. ఈ మంత్రం ద్వారా ఏర్పడిన రక్షిత కవచాన్ని ప్రతికూల శక్తులు ఛేదించలేవు. ఈ మంత్రం అంతర్జ్ఞానాన్ని పెంచి, భావోద్వేగ సమతుల్యతను అందిస్తుందని చెబుతారు.

''ఓం హం హనుమతే నమః'' అనే హనుమాన్ మంత్రం అన్ని రకాల ప్రతికూలతలు, రాక్షసులు, దుష్ట శక్తుల నుండి రక్షణ కోసం ఉపయోగిస్తారు. ఈ శక్తివంతమైన మంత్రం విజయం, బలం, ఓర్పు, సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతారు.

ఈ మంత్రాన్ని జపించడానికి తెల్లవారుజాము, సాయంత్రం ఉత్తమ సమయాలని చెబుతారు.

గణపతి మంత్రం

''ఓం గం గణపతయే నమః'' అనేది గణేశుడి మంత్రం. గణేశుడి ఆశీస్సులు పొందడానికి దీనిని పఠిస్తారు. ఈ మంత్రాన్ని పఠించే వ్యక్తి తన జీవితంలోని అన్ని రకాల కష్టాలను, అడ్డంకులను ఎలాంటి సందేహం లేకుండా అధిగమిస్తారని నమ్ముతారు. ఏదైనా మంత్ర సాధన, కొత్త పని లేదా ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఈ గణేశ మంత్రాన్ని పఠించడం వలన స్పష్టమైన, సురక్షితమైన మార్గం ఏర్పడుతుంది.

మీరు ఇంటి నుండి బయలుదేరే ముందు, ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు, ప్రతిరోజూ ఈ గణేశ మంత్రాన్ని పఠించవచ్చు. ఈ గణేశ మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe