చాణక్యుడు భారతదేశానికి చెందిన ఒక ప్రసిద్ధ తత్వవేత్త, గురువు. చాణక్య నీతి మానవ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని వివరిస్తుంది. చాణక్య నీతి శాస్త్రంలో చాణక్యుడు ఒక వ్యక్తి జీవితం, స్నేహం, కర్తవ్యం, స్వభావం, భార్య, పిల్లలు, డబ్బు, వ్యాపారం మొదలైన వాటి గురించి ప్రతి విషయాన్ని ప్రస్తావించాడు. ఆచార్య చాణక్యుని జ్ఞానం కేవలం రాజనీతి, అర్థశాస్త్రాలకే పరిమితం కాలేదు. ఆయన కుటుంబ జీవితం, సంబంధాల గురించి కూడా కొన్ని లోతైన విషయాలను అందించారు.

చాణక్య నీతి ప్రకారం, భార్యకు ఉండవలసిన గుణాలు ఏంటి ? ఈ గుణాలు కేవలం పాత సంప్రదాయాలను పాటించడానికే పరిమితం కావు. అవి, తమ భర్తను, కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటారో తెలియజేస్తాయి. చాణక్య నీతిలో పేర్కొన్న మంచి భార్య గుణాలు ఏంటో చూద్దాం..
కుటుంబ శ్రేయస్సు గురించి ఆలోచన
మంచి భార్య తన భర్త గురించి మాత్రమే ఆలోచించదు. ఆమె మొత్తం కుటుంబ శ్రేయస్సు గురించి కూడా శ్రద్ధ వహిస్తుంది. అందరినీ ఐక్యంగా ఉంచగల సామర్థ్యమే మంచి భార్య లక్షణమని చాణక్యుడు విశ్వసించాడు. ఆమె ఎప్పుడు కుటుంబ శ్రేయస్సు గురించి ఆలోచిస్తుంది. అందరూ బాగుండాలని కోరుకుంటుంది.
మాటల్లో మధురం
మాటలకు కుటుంబాన్ని నిలబెట్టే లేదా విచ్ఛిన్నం చేసే శక్తి ఉంది. మధురంగా, దయగా మాట్లాడే భార్య ఆ ఇంట్లో ఎల్లప్పుడూ శాంతి, ప్రేమ ఉండేలా చూసుకుంటుందని చాణక్యుడు చెప్పాడు. కఠినమైన మాటలు సంబంధాలలో చీలికను కలిగిస్తాయి. అందువల్ల సంతోషకరమైన వైవాహిక జీవితానికి దయతో మాట్లాడటం చాలా అవసరం.
కష్ట సమయంలో ఓర్పు
ప్రతి కుటుంబం జీవితంలో ఏదో ఒక సమయంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని చాణక్యుడు అంటాడు. కష్ట సమయాల్లో ఓర్పు వహించే భార్యే మంచి భార్య అని చాణక్యుడు అంటాడు. ఈ గుణం ఉన్న స్త్రీ ఏ నిర్ణయం తీసుకునే ముందు అయినా లోతుగా ఆలోచిస్తుంది. తన కుటుంబాన్ని ప్రమాదాల నుండి కాపాడుతుంది. కష్ట సమయంలో భార్య ఇంట్లో గొడవలు చేయకూడదు. పుట్టింటికి వెళ్లిపోతాను అని బెదిరించకూడదు.
పొదుపుగా ఖర్చు
వివేకవంతురాలైన భార్య తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. ఆమె అనవసరమైన ఖర్చులను మానుకుని, భవిష్యత్తు కోసం పొదుపు చేస్తుంది. అటువంటి భార్య కుటుంబానికి గొప్ప ఆస్తిగా ఉంటుందని, కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించడంలో సహాయపడుతుందని చాణక్యుడు అంటాడు. ఆమె అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లదు..
విశ్వాసం
{{/usCountry}}వివేకవంతురాలైన భార్య తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. ఆమె అనవసరమైన ఖర్చులను మానుకుని, భవిష్యత్తు కోసం పొదుపు చేస్తుంది. అటువంటి భార్య కుటుంబానికి గొప్ప ఆస్తిగా ఉంటుందని, కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించడంలో సహాయపడుతుందని చాణక్యుడు అంటాడు. ఆమె అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లదు..
విశ్వాసం
{{/usCountry}}ఏ సంబంధానికైనా నమ్మకమే పునాది. భర్త పట్ల, వారి బంధం పట్ల అచంచలమైన విశ్వాసంతో ఉండే భార్య కుటుంబాన్ని మరింత బలపరుస్తుంది. కష్టకాలంలో అండగా నిలబడటమే నిజమైన, ఉత్తమమైన భాగస్వామికి నిదర్శనం. భార్యే కుటుంబానికి రక్షణ శక్తి అని చాణక్యుని బోధనలు నొక్కి చెబుతున్నాయి. ఈ సత్యం ఎప్పటికీ మారదు. ఆమె లేకుంటే కుటుంబమే లేదు.