అక్షయ తృతీయ వేళ కృత్తికా నక్షత్రంలో చంద్రుడి సంచారం.. ఈ 4 రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదుగా!

ఖగోళంలో గ్రహాల కదలికలు ఎప్పుడూ ఆసక్తికరమే. ముఖ్యంగా మనస్సుపై ప్రభావం చూపే చంద్రుడు, అక్షయ తృతీయ వంటి పవిత్ర పర్వదినాన సూర్యుడి నక్షత్రంలోకి ప్రవేశిస్తుండటం విశేషం. ఈ నక్షత్ర సంచారం వల్ల అక్షయ తృతీయ రోజున కొన్ని రాశుల వారికి ‘అక్షయ’మైన సంపద, సంతోషం కలగబోతున్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Published on: Apr 15, 2026 4:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక విధాలుగా మార్పులను తీసుకువస్తుంది. చంద్రుడు వేగంగా తన రాశులను మారుస్తూ ఉంటాడు. అక్షయ తృతీయ నాడు చూస్తే, చంద్రుడు సూర్యుడి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. చంద్ర సంచారంలో మార్పు వల్ల, చంద్రుడు సూర్యుడు నక్షత్రమైన కృత్తికా నక్షత్రంలోకి ఏప్రిల్ 19 ఆదివారం ఉదయం 7:09కి ప్రవేశిస్తాడు. ఆ రోజు అక్షయ తృతీయ.

అక్షయ తృతీయ వేళ కృత్తికా నక్షత్రంలో చంద్రుడి సంచారం (pinterest)
అక్షయ తృతీయ వేళ కృత్తికా నక్షత్రంలో చంద్రుడి సంచారం (pinterest)

ఇలా సూర్య నక్షత్రంలో చంద్రుడు సంచారం చేయడంతో అక్షయ తృతీయ అని అంటారు. కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలగబోతున్నాయి. చంద్రుడు కృత్తికా నక్షత్రంలోకి అక్షయ తృతీయ నాడు ప్రవేశించి ఏప్రిల్ 20 ఉదయం 4:34 వరకు ఉంటాడు. చంద్రుడి సంచారంలో మార్పు రావడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది.

అక్షయ తృతీయ నాడు చంద్రుని సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు:

1.సింహ రాశి:

సింహ రాశి వారికి ఈ సంచారంలో మార్పు శుభ ఫలితాలను అందిస్తుంది. కృత్తికా నక్షత్రానికి చంద్రుడు ప్రవేశించడంతో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. బంధం, రిలేషన్‌షిప్‌లో ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం.

2.ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి చంద్ర సంచారంలో మార్పు అనేక విధాలుగా మార్పులను తీసుకొస్తుంది. ఈ రాశి వారు సక్సెస్ చూస్తారు. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. అనుకున్న డీల్స్ మీ చేతికి వస్తాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. పెండింగ్‌లో ఉన్న టాస్కులు పూర్తవుతాయి.

3.కుంభ రాశి:

కుంభ రాశి వారికి ఆనందం పెరుగుతుంది. ఈ సమయంలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పూర్వికుల నుంచి ఆస్తి లాభాలను పొందుతారు. ఆర్థిక నష్టం లేకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.

4.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి చంద్ర సంచారంలో మార్పు మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థిక పరంగా ప్రయోజనాలను పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత అప్పులు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More