Temples : 30 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి కావట్లేదా? ఈ ఆలయాలకు వెళ్తే మంచిదట!
Temples For Marriage : 30 దాటినా చాలా మందికి పెళ్లి కావడం లేదు. పెళ్లి కావాలనే చాలా ఆలయాలకు వెళ్తుంటారు. అనేక పూజలు చేస్తుంటారు. అయితే కర్ణాటకలో కూడా కొన్ని ఆలయాలు ఉన్నాయి. ఇక్కడకు వెళ్తే పెళ్లి జరుగుతుందని బాగా నమ్ముతారు.
కొందరికి 25 ఏళ్ల వయసు నుంచి పెళ్లి సంబంధాలు చూసినా.. అస్సలు సెట్ కావు. 30 ఏళ్లు వచ్చేసరికి ఇక పూజలు చేయడం మెుదలుపెడతారు. దాదాపు తిరగని గుడి లేదన్నట్టుగా వెళ్తుంటారు. చాలా మంది వివాహ విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంతమందికి ఇన్ని సంవత్సరాలు గడిచినా అమ్మాయి గానీ అబ్బాయి గానీ దొరకడం లేదు. ఒకవేళ అదృష్టం బాగుండి.. సంబంధాలు వచ్చినా.. జాతకాలకు సరిగా లేవని ఆగిపోతుంటాయి. అయితే కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని ఆలయాలకు వెళ్తే పెళ్లి అవుతుందని నమ్మకం. ఆ ఆలయాలు ఏంటో చూద్దాం..

మంగళాదేవి ఆలయం
ఇది 9వ శతాబ్దానికి చెందిన పురాతన శక్తి ఆలయం. ఈ దేవత పేరు మీదుగానే మంగళూరు నగరానికి ఆ పేరు వచ్చింది. మంగళూరు దేవత అయిన మంగళా దేవి దర్శనం జీవితంలో శుభాన్ని చేకూరుస్తుంది. అమ్మాయిలు మంచి భర్త కలగాలని, ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ఇక్కడ పూజలు చేస్తారు.
పార్వతీ పరమేశ్వర ఆలయం
మంగళూరులోని ఉల్లాల్‌లో ఉన్న శ్రీ దుర్గా పరమేశ్వరి దేవాలయంవైవాహిక దోషాలను తొలగించడానికి చాలా ప్రసిద్ధి చెందింది. పార్వతీ, పరమేశ్వరులు వివాహానికి పరమ ప్రతీకలు కాబట్టి, ఇక్కడ నిర్వహించే స్వయంవర పార్వతీ హోమం చాలా శక్తివంతమైనదని భక్తులు చెబుతున్నారు.
ఇస్కాన్ టెంపుల్
బెంగళూరులో సుందరమైన ఇస్కాన్ రాధాకృష్ణ ఆలయం ఉంది. కేవలం దర్శనానికే కాకుండా, భక్తుల కష్టాలను తీర్చడంలో కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రాధాకృష్ణులకు ప్రత్యేక ప్రార్థనలు చేయడం వల్ల ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయని, వివాహంలోని దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.
కిక్కేరి శ్రీ బ్రహ్మేశ్వరాలయం
మాండ్యా జిల్లాలోని కిక్కేరిలో ఉన్న ఈ పురాతన ఆలయం శిల్పా సంపదకే కాకుండా, దాని పవిత్రతకు కూడా ప్రసిద్ధి చెందింది. 12వ శతాబ్దపు హోయసల నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ ఇది. ఇక్కడి దేవునికి ఒక ప్రత్యేక అభిషేకం చేయడం వల్ల వివాహంలోని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. సంతోషకరమైన వైవాహిక జీవితం కలుగుతుందని అంటుంటారు.
మహాబలేశ్వర దేవాలయం
ఆత్మలింగ నిలయమైన గోకర్ణ అన్ని దోషాల నుండి ఉపశమనం కలిగించే గొప్ప ప్రదేశమని అంటారు. జాతకంలో కుజ దోషం లేదా మాంగల్య దోషం కారణంగా వివాహం ఆలస్యమైతే, ఇక్కడ ప్రత్యేక పూజ, శాంతి హోమం చేయడం ద్వారా వివాహ త్వరగా అవుతుందని నమ్మకం.
నిమిషాంబ దేవాలయం, శ్రీరంగపట్నం
మాండ్య జిల్లాలోని శ్రీరంగపట్నం సమీపంలోని నిమిషాంబ అమ్మవారు తన భక్తుల కోరికలను తీరుస్తారని నమ్ముతారు. పెళ్లి సంబంధాలు పదేపదే విఫలమవుతుంటే.. అక్కడ అమ్మవారికి చీర, గాజులు సమర్పించి, మొక్కు చెల్లించుకుంటే సుకుంటే అదృష్టం కలుగుతుందని చెబుతారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


