Cockroach : ఈ కర్మ ఫలితంగా మీరు మీ తదుపరి జన్మలో బొద్దింకగా పుడతారు!
Cockroach : హిందూ సంప్రదాయం ప్రకారం.. మనిషికి మరో జన్మ ఉంటుంది. ఈ జన్మలో చేసిన తప్పుల ఆధారంగా మరో జన్మలో పుట్టుక ఉంటుందని నమ్ముతారు.
హిందూ మతంలో గరుడ పురాణం జీవితం, కర్మ, మరణం, వాటి పరిణామాలను వివరించే ఒక ముఖ్యమైన గ్రంథంగా పరిగణిస్తారు. ప్రస్తుత జీవితంలో చేసిన మంచి చెడు కర్మల ఆధారంగా మరుజన్మ గురించి గరుడ పురాణం చెబుతోంది. గరుడ పురాణం ప్రకారం.. ఒక వ్యక్తి తన జీవితకాలంలో చేసే ప్రతి మంచి, చెడు కర్మలకు, శిక్ష లేదా బహుమతి రూపంలో పరిణామాలను ఎదుర్కొంటాడు. అంతేకాకుండా ఒక వ్యక్తి కర్మలు వారి తరువాతి జన్మను ప్రభావితం చేస్తాయి.

ఒక వ్యక్తి తప్పుడు కర్మలు చేసినప్పుడు.. మరణానంతరం ఒక జంతువుగా, చాలా దుస్థితిలో పునర్జన్మిస్తారు. గరుడ పురాణం ప్రకారం కీటకాలు, బొద్దింకలుగా పునర్జన్మిస్తారు. గరుడ పురాణం ప్రకారం తన జీవితకాలంలో ఏ రూపంలోనైనా నూనెను దొంగిలించే వ్యక్తి మరణానంతరం నరకానికి వెళ్తాడు. వారి తదుపరి జీవితంలో అటువంటి వ్యక్తి కీటకాల ప్రపంచంలో, ప్రత్యేకంగా బొద్దింకగా పునర్జన్మిస్తాడని గరుడ పురాణం పేర్కొంది.
గరుడ పురాణం ప్రకారం.. బంగారం దొంగిలించిన వ్యక్తి బొద్దింక లేదా కీటకం రూపంలో పునర్జన్మిస్తాడు. ఇతరుల గురించి నిందలు వేసేవారు లేదా చాడీలు చెప్పేవారు కూడా అదే శిక్షను పొందుతారు. కాబట్టి ఎలాంటి పాపపు పనులలోనూ పాల్గొనవద్దు, ఇతరులను నిందించడం మానుకోండి.
గరుడ పురాణంలోని నాలుగో, ఐదో, ఆరో అధ్యాయాలు.. ఏయే నిర్దిష్టమైన తప్పులు లేదా పాపాల వల్ల వ్యక్తులు వారి మరుజన్మలో కీటకాలు, పురుగుల లోకంలోకి విసిరివేయబడతారో వివరిస్తాయి.
మనుషులను సన్మార్గంలో నడిచేలా ప్రేరేపించాలనే నిర్దిష్ట ఉద్దేశంతో గరుడ పురాణంలోనూ, ఇతర మత గ్రంథాలలోనూ మంచి చెడుల ప్రస్తావనలు ఉన్నాయ్. అలాగే పాపం, పుణ్యం, శిక్ష, బాధల గురించిన సమాచారం పొందుపరిచారు. గరుడ పురాణం జీవితంలో సత్కర్మలు చేయడం, స్వచ్ఛమైన మనస్సును కలిగి ఉండటం, ఇతరుల పట్ల కరుణ భావాలను కలిగి ఉండటం వంటి పాఠాలను కూడా బోధిస్తుంది. కొందరు వీటిని నమ్ముతారు. మరికొందరు వీటిని నమ్మరు. కానీ మనిషిని సన్మార్గంలో నడిపేందుకు గ్రంథాలు అనేక విషయాలను చెబుతాయి.
గమనిక : ఇది కేవలం నమ్మకాల మీద ఆధారపడిన కథనం. మాకు దొరికిన సమాచారం ఆధారంగా కథనం ఇచ్చాం. ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


