ఆషాఢ మాసం 2026: ఈ 5 రాశుల వారికి ధనయోగం, ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో భారీ లాభాలు
జూలై 14 నుంచి ప్రారంభమయ్యే ఆషాఢ మాసంలో మేష, తుల, ధనస్సు, సింహ, మిథున రాశుల వారికి గ్రహాల అనుగ్రహంతో ధనం, విజయం, ఉద్యోగం, వ్యాపారంలో శుభ ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి.
నిజ జ్యేష్ఠ మాసం మరి కొన్ని రోజుల్లో పూర్తికాబోతోంది. ఈ నెల పూర్తయిన తర్వాత ఆషాఢ మాసం మొదలవుతుంది. హిందూ మతంలో ఆషాఢ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసంలో గ్రహాల మార్పులు కూడా జరగబోతున్నాయి. జూలై 14న ఆషాఢ మాసం ప్రారంభం కానుండగా, ఐదు రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఏ రాశి వారి అదృష్టం పెరగబోతోంది? ఏ రాశుల వారు ఆషాఢ మాసంలో విపరీతంగా లాభాలను పొందుతారు? మరి అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.

ఆషాఢ మాసంలో ఈ రాశుల వారికి అదిరిపోతుంది.. విపరీతమైన అదృష్టం
1.మేష రాశి
మేష రాశి వారికి ఆషాఢ మాసం శుభప్రదంగా ఉంది. ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి రాబోతోంది. ఆదాయం కూడా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి. ఈ రాశి వారు వృత్తిలో పురోగతిని పొందుతారు. ఉద్యోగులు మంచి అవకాశాలను పొందుతారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అధికారులు కూడా మీ పనిని గుర్తించి కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. భవిష్యత్తులో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం చాలా బాగుంటుంది.
2.తులా రాశి
తులా రాశి వారికి ఆషాఢ మాసం బాగా కలిసి రాబోతుంది. కోరుకున్న విజయాలు లభిస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం కూడా పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారస్తులు వ్యాపారంలో భారీగా లాభాలను చూస్తారు. ఉద్యోగులు ప్రమోషన్లను పొందుతారు. చేసే ప్రతి పనిలో కూడా ఈ రాశి వారికి విజయం దక్కుతుంది.
3.ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఆషాఢ మాసం బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు. చేసే ప్రతి పనిలో కూడా కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆర్థికంగా ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ నెలలో వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవాలి. శుభవార్తలను కూడా ఈ రాశి వారు వింటారు.
4.సింహ రాశి
సింహ రాశి వారికి ఆషాఢ మాసం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది. చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని అందుకుంటారు.
5.మిథున రాశి
మిథున రాశి వారికి కూడా ఈ ఆషాఢ మాసం బాగుంటుంది. గతంలో కోల్పోయిన డబ్బును మళ్లీ పొందుతారు. వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఇది సరైన సమయం. ఎంత పెట్టుబడి పెట్టినా భారీగా లాభాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి బాగుంటుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


