...
...
Next Story

ఆషాఢ మాసం 2026: శూన్యమాసం విశిష్టత, ముఖ్య పర్వదినాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

ఆషాఢ మాసం 2026 విశిష్టత ఏమిటి? ఈ నెలలో శుభకార్యాలు ఎందుకు చేయరు? జగన్నాథ రథయాత్ర, తొలి ఏకాదశి, చాతుర్మాసం, బోనాలు, గురు పూర్ణిమ వంటి ముఖ్య పర్వదినాల ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పూర్తి వివరాలతో తెలుసుకోండి.

Published on: Jul 13, 2026, 16:00:25 IST
Advertisement

తెలుగు నెలల్లో నాల్గవది ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో శుభకార్యాలు వంటివి జరపరు. అలాగే కొత్తగా పెళ్లయిన కోడలు కూడా అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళ్లిపోతుంది. ఇలా కొన్ని సంప్రదాయాలను పాటిస్తూ ఉంటాము.

ఆషాఢ మాసం 2026: శూన్యమాసం విశిష్టత, ముఖ్య పర్వదినాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
ఆషాఢ మాసం 2026: శూన్యమాసం విశిష్టత, ముఖ్య పర్వదినాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో సంచరించడం వలన ఈ నెలకు ఆషాఢ మాసం అని పేరు వచ్చింది. మిగిలిన నెలలతో పోల్చుకుంటే ఆషాఢాన్ని శూన్యమాసంగా భావిస్తారు. ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు జరపరు. అయితే పూజా కార్యక్రమాలకు, దేవతారాధనకు ఇది సరైన సమయం అని చెబుతారు. ఈ నెలలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి, దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఆషాఢమాసంలో ఎలాంటి పర్వదినాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆషాఢ శుద్ధ విదియ

జగన్నాటక సూత్రధారి అయిన విష్ణువు, జగన్నాథుడిగా కొలువుదీరి సుభద్ర, బలభద్రులతో కలిసి భక్తులందరికీ దర్శనమిచ్చే పూరి జగన్నాథుడి ఆలయంలో అంగరంగ వైభవంగా రథయాత్ర నిర్వహిస్తారు. అలాగే ఆషాఢ శుద్ధ విదియ నాడు తోబుట్టువులతో కలిసి జగన్నాథుడు ప్రధాన ఆలయాన్ని విడిచిపెట్టి గుండిచా క్షేత్రానికి చేరుకుంటాడు. అనంతరం మళ్లీ తిరిగి వస్తాడు. ఈ వేడుకను చూడడానికి రెండు కళ్లూ సరిపోవు. రథయాత్రలో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు.

ఆషాఢ శుద్ధ ఏకాదశి

ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఆ రోజు శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి వెళ్తాడు. మళ్లీ నాలుగు నెలల తర్వాత, అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు మేల్కొంటాడు. దానిని శయన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారు

బోనాలు

తెలంగాణలో బోనాలు సమర్పించే సంప్రదాయం ఉంది. "బోనం" అంటే భోజనం అని అర్థం. ఈ బోనాల సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని విశ్వసిస్తారు. అలా వచ్చే శక్తి స్వరూపిణికి బోనంతో సారెను సమర్పిస్తారు. ఒకప్పుడు ప్లేగు వ్యాధిని అమ్మవారు తరిమికొట్టారని, అందుకే కృతజ్ఞతగా బోనాలు సమర్పించే సంప్రదాయం వచ్చిందని భక్తుల విశ్వాసం.

ఆషాఢ శుద్ధ పూర్ణిమ

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks