రాత్రి నిద్రపోయే ముందు దిండు కింద వీటిని పెట్టండి.. పీడకలలు రావు, అదృష్టం వరిస్తుంది!

ఈ పరిహారాలను పాటించడం వలన అదృష్టం వరుస్తుంది. ఆనందంగా ఉండొచ్చు, సమస్యలన్నీ తొలగిపోతాయి. పైగా ఈ పరిహారాలు చాలా ఈజీ. కష్టం కూడా కాదు. నిద్రపోయేటప్పుడు దిండు కింద వీటిని ఉంచితే సరిపోతుంది. ఇక మీ బాధలన్నీ తొలగిపోతాయి. హ్యాపీగా ఉండడానికి వీలవుతుంది.

Published on: Jan 10, 2026, 12:00:55 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల పరిహారాలను కూడా పాటిస్తారు. ఈ పరిహారాలను పాటించడం వలన అదృష్టం కూడా వరుస్తుంది. ఆనందంగా ఉండొచ్చు, సమస్యలన్నీ తొలగిపోతాయి. పైగా ఈ పరిహారాలు చాలా ఈజీ. కష్టం కూడా కాదు. నిద్రపోయేటప్పుడు దిండు కింద వీటిని ఉంచితే సరిపోతుంది. ఇక మీ బాధలన్నీ తొలగిపోతాయి. హ్యాపీగా ఉండడానికి వీలవుతుంది.

రాత్రి నిద్రపోయే ముందు దిండు కింద వీటిని పెట్టండి (pinterest)
రాత్రి నిద్రపోయే ముందు దిండు కింద వీటిని పెట్టండి (pinterest)

రోజూ రాత్రి నిద్రపోయే ముందు దిండు కింద వీటిని పెట్టండి... ఇక ఆల్ హ్యాపీస్!

1.పటిక

పటిక ప్రతికూల శక్తిని, దుష్టశక్తిని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. దిండు కింద ఒక వారం పాటు పటికను పెట్టండి. సానుకూల శక్తి పెరగడంతో పాటు పీడకలలు రావు. సంతోషంగా ఉండొచ్చు. పీడకలల భయం కూడా తొలగి పోతుంది.

2.లవంగాలు

నిద్రపోయే ముందు దిండు కింద ఐదు, ఏడు లేదా తొమ్మిది లవంగాలను పెట్టండి. దీని వలన హాయిగా నిద్ర పడుతుంది. ప్రతికూల శక్తి తొలగి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. మంచి ఆలోచనలు వస్తాయి. ఈ లవంగాలను ఉదయాన్నే నీటిలో పడేయండి.

3.దాల్చిన చెక్క

దాల్చిన చెక్క సానుకూల శక్తిని, అదృష్టాన్ని తీసుకు వస్తుంది. దాల్చిన చెక్కను పెట్టడం వలన నిద్ర కూడా బాగా పడుతుంది. ప్రతికూల శక్తి, భయం కూడా ఉండదు.

4.నెమలీక

నెమలీకను దిండు కింద పెట్టి నిద్రపోతే ప్రేమ, సంతోషం పెరుగుతాయి. ప్రతికూల ఆలోచనలు రావు. అదృష్టం కూడా పెరుగుతుంది.

5.వెల్లుల్లి

వెల్లుల్లి సానుకూల ఆలోచనలు తీసుకు వచ్చి ప్రతికూల ఆలోచనలను తగ్గిస్తుంది. అదృష్టం కూడా పెరుగుతుంది. నిద్రపోయే ముందు దిండు కింద వెల్లుల్లిని కూడా పెట్టడం మంచిది.

6.రూపాయి కాసు

ఒక రూపాయి కాసును నిద్రపోయే ముందు దిండు కింద పెట్టండి. అదృష్టం కలుగుతుంది. ఆర్థిక స్థిరత్వాన్ని పొందవచ్చు.

7.యాలకులు

యాలకులు మంచి నిద్రను పొందడానికి సహాయం చేస్తాయి. నెగటివ్ ఆలోచనలను తొలగించి సానుకూల ఆలోచనలను కలిగేలా చేస్తాయి. నిద్రపోయే ముందు యాలకులను ఉంచితే హాయిగా నిద్రపోవచ్చు.

8.బిర్యానీ ఆకు

ఇది ప్రతికూల శక్తిని తొలగించి పీడకలలు రాకుండా చూస్తుంది. బిర్యానీ ఆకును నిద్రపోయే ముందు దిండు కింద పెట్టుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. మంచి ఆలోచనలు వస్తాయి.

9.తులసి ఆకులు

తులసి ఆకులను ఎంతో పవిత్రంగా భావిస్తారు. తులసి ఆకుల్లో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఈ ఆకుల నుంచి వచ్చే వాసన ఒత్తిడిని తగ్గిస్తుంది. హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది. పీడకలలు కూడా రావు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More