12 రాశుల వారికి నేటి ఫలితాలు.. ఎవరికి లాభాలు, ఎవరికి సవాళ్లు?
నేటి గ్రహాల గమనం, నక్షత్రాల స్థితిగతుల ఆధారంగా మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి భిన్నమైన ఫలితాలు ఉండనున్నాయి. మేష రాశి వారు మాటల్లో సంయమనం పాటించాల్సి ఉండగా, వృషభ రాశి వారు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి.
ప్రతి రోజు మారే గ్రహాల గతులు, నక్షత్రాల స్థితిగతుల ఆధారంగా మన దైనందిన జీవితంలో మార్పులు చోటుచేసుకుంటాయి. హిందూ ధర్మంలో శనివారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ రోజున చేసే ప్రార్థనలు, రాశిఫలాల ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉంటుంది. ఏ రాశి వారికి ఏ రంగంలో ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎదురయ్యే సవాళ్లు ఏమిటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

ఈరోజు రాశి ఫలాలు
మేష రాశి: ఈ రాశి వారు మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. మాటలో సంయమనం చాలా అవసరం. ఉద్యోగంలో ఊహించని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కొత్త ప్రమోషన్లు లేదా ఉన్నత అవకాశాలు తలుపు తడతాయి. విద్యారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. తోబుట్టువులు లేదా స్నేహితుల సహకారంతో వ్యాపారంలో మంచి లాభాలను ఆర్జిస్తారు.
వృషభ రాశి: అనవసరమైన గొడవలకు, వాదనలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఇంటికి ప్రియమైన స్నేహితుల ఆగమనం సంభవిస్తుంది. బుద్ధిబలంతో చేసే పనులలో ప్రశంసలు అందుకుంటారు. గృహోపకరణాలు లేదా కొత్త ఆస్తులను కొనుగోలు చేసే సూచనలున్నాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం.
మిథున రాశి: ఎప్పడో కన్న కలలు ఈ రోజు నిజమయ్యే సమయం ఆసన్నమైంది. స్థలం, ఇల్లు లేదా నూతన వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా మారుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో ఆదాయ మార్గాలు మెరుగవుతాయి.
కర్కాటక రాశి: ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సంయమనం కోల్పోకుండా ఉండాలి. కుటుంబంలో ప్రశాంతత కోసం ప్రయత్నించాలి. మిత్రుల అండతో ఆర్థిక వనరులు పెరుగుతాయి. దైవ కార్యాల నిమిత్తం ఖర్చులు అధికమవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరం.
సింహ రాశి: ఆత్మవిశ్వాసంలో స్వల్పంగా తగ్గుదల కనిపించినా కుటుంబ సభ్యుల అండదండలు మీకు కొండంత బలాన్ని ఇస్తాయి. విద్యాభ్యాసంలో విద్యార్థులు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టేందుకు ఇది అనుకూలమైన సమయం. రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవులు లేదా విశేషమైన లబ్ధి చేకూరుతుంది.
కన్యా రాశి: ఆర్థికంగా బలపడేందుకు అద్భుతమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రుల ఆశీస్సులు మెండుగా లభిస్తాయి. దైవబలం తోడవుతుంది. వ్యాపారరీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
తులా రాశి: మనసులో ప్రశాంతత ఉన్నప్పటికీ, ఏదో తెలియని తొందరపాటు ఇబ్బంది పెడుతుంది. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. మాతృవర్గం ద్వారా ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఖర్చులను అదుపులో ఉంచుకుంటూ బడ్జెట్ ప్రకారం నడుచుకోవడం చాలా ముఖ్యం.
వృశ్చిక రాశి: ఏ పని తలపెట్టినా ప్రశాంతంగా, ధైర్యంగా ముందుకు వెళ్లాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ఎదురవుతున్న అడ్డంకులు అన్నీ తొలగిపోయి విజయపథంలో ముందుకు సాగుతారు.
ధనుస్సు రాశి: ఈ రోజు కాస్త ఒడుదొడుకులు ఎదురవుతాయి. కుటుంబంలో తలెత్తే కొన్ని చిన్నపాటి సమస్యల వల్ల మనసు అశాంతిగా మారుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించకుండా జాగ్రత్త వహించాలి. తండ్రి వైపు నుంచి ఆర్థిక సహాయం అందుతుంది.
మకర రాశి: ఆర్థిక పరమైన పురోగతి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తుంది. మనసులో రకరకాల ఆలోచనలు రావడం సహజం. విద్యార్థులకు, మేధోపరమైన పనులలో ఉండేవారికి మంచి గుర్తింపు దక్కుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. చిన్నారుల ఆరోగ్యం పట్ల కంటికి రెప్పలా కాపలా ఉండాలి.
కుంభ రాశి: అనుకోని మార్గాల ద్వారా ధనలాభం కలుగుతుంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న శుభవార్త చెవిని పడుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యాపరమైన అంశాలలో విశేషమైన గౌరవం దక్కుతుంది.
మీన రాశి: ఆర్థికంగా ఈ రోజు మీకు ఎంతో అద్భుతంగా ఉంది. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపార రంగంలో కొన్ని చిన్నపాటి సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొని లాభాలను సాధిస్తారు. వాహనయోగం మెరుగ్గా ఉంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


