ఆగస్టు 1 నుంచి కన్య రాశిలో శుక్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, ప్రమోషన్, అదృష్ట యోగం!

ప్రేమ, ఐశ్వర్యాలకు కారకుడైన శుక్రుడు ఆగస్టు 1న కన్యా రాశిలోకి ప్రవేశించనున్నారు. సెప్టెంబర్ 2 వరకు కొనసాగే ఈ గోచారం వృషభం, ధనుస్సు, వృశ్చికం, మకర రాశుల వారికి విశేష ప్రయోజనాలను అందించనుంది.  జీవితంలో అనుకూల మార్పులతో శుక్ర అనుగ్రహం కోసం పరిహారాలను తెలుసుకోండి. 

Published on: Jul 23, 2026, 11:00:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, ప్రేమ మరియు ఐశ్వర్యాలకుకారకుడిగా భావిస్తారు. ఏ గ్రహం సంచారం చేసినా దాని ప్రభావం అన్ని రాశులపై స్పష్టంగా కనిపిస్తుంది. సరిగ్గా తొమ్మిది రోజుల తర్వాత, అంటే ఆగస్టు 1న శుక్ర భగవానుడు మిథున రాశి నుంచి బుధుడి ఆధిపత్యం ఉన్న కన్యా రాశిలోకి అడుగుపెట్టనున్నారు.

ఆగస్టు 1 నుంచి కన్య రాశిలో శుక్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, ప్రమోషన్, అదృష్ట యోగం!
ఆగస్టు 1 నుంచి కన్య రాశిలో శుక్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, ప్రమోషన్, అదృష్ట యోగం!

సెప్టెంబర్ 2 వరకు శుక్రుడు ఇదే రాశిలో సంచరించనున్నాడు. జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం, ఈ గ్రహ మార్పు కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు లభించనున్నాయి. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ కాలం ఎంతో అనుకూలంగా మారనుంది.

వృషభ రాశి వారికి ఊరట, ఆర్థిక లాభాలు

ఆగస్టు 1 నుంచి జరిగే ఈ రాశి మార్పు వృషభ రాశి వారికి ఎంతో మేలు చేకూరుస్తుంది. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగంగా పూర్తవుతాయి. దీని వల్ల మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రేమ జీవితంలో అన్యోన్యత మరింత పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఊహించని ధన లాభం పొందే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్

శుక్ర గోచార ప్రభావంతో ధనుస్సు రాశి వారికి వృత్తి, వ్యాపార రంగాల్లో తిరుగులేని పురోగతి కనిపిస్తుంది. మీరు పడే కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆఫీస్‌లో మీ పనితీరును చూసి పైఅధికారులు ప్రత్యేకంగా అభినందిస్తారు. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన ఒప్పందాలు కూడా విజయవంతంగా పూర్తవుతాయి.

వృశ్చిక రాశి వారి ఆర్థిక ఇబ్బందులు దూరం

వృశ్చిక రాశి జాతకులకు ఆగస్టు నెల అదృష్టాన్ని తెచ్చిపెట్టనుంది. ఎప్పటి నుంచో రావాల్సిన పాత బాకీలు లేదా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. దీని వల్ల ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి శుభవార్త వినే అవకాశం ఉంది. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కుటుంబంతో కలిసి సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు.

మకర రాశి వారికి సానుకూల మార్పులు

మకర రాశి వారి జీవితంలో సరికొత్త సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇన్నాళ్లూ పడిన ఇబ్బట్ల నుంచి పూర్తి విముక్తి లభిస్తుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లే ప్రణాళికలు వేసుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు ధన లాభం కలగడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి చక్కటి మార్గాలు ఏర్పడతాయి.

శుక్ర దోష నివారణకు పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు

నిత్యం భక్తిశ్రద్ధలతో మహాలక్ష్మి దేవిని పూజించడం వల్ల శుక్రుని అనుగ్రహం లభిస్తుంది.

పేదలు, నిరుపేదలకు తెల్లని వస్త్రాలు లేదా వైట్ కలర్ పదార్థాలను దానం చేయండి.

మీ పరిసర ప్రాంతాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం మంచిది.

రోజూ నియమబద్ధంగా శుక్ర మంత్రాలను జపించడానికి ప్రయత్నించండి.

సమాజంలోని మహిళలను ఎప్పుడూ గౌరవించాలి.

నిరాకరణ- ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More