అయ్యప్ప స్వామి మాలధారణకు ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఏటా కార్తీక మాసం ప్రారంభం నుంచి లక్షలాది మంది భక్తులు అయ్యప్ప స్వామి దీక్షను చేపడతారు. నల్లటి బట్టలు వేసుకుని, మెడలో తులసి లేదా రుద్రాక్ష మాలను వేసుకుని 41 రోజుల పాటు నియమనిష్ఠలతో స్వామివారిని పూజిస్తారు.

అయ్యప్ప దీక్ష అంటే కేవలం మాల ధరించడం మాత్రమే కాదు. మనసు, మాట, శరీరం పవిత్రంగా ఉంటూ క్రమశిక్షణతో ఉండటమే ఈ దీక్షలోని ప్రధాన ఉద్దేశం. అయితే, అయ్యప్ప మాల వేసుకున్నవారు బ్రహ్మచర్యం, సాత్విక ఆహారం, నిత్య పూజలు, భజనలు వంటి వాటితో సమయాన్ని గడపాలి.
మొదటిసారి మాల వేసుకుంటున్నారా? 41 రోజుల దీక్షలో పొరపాటున కూడా చేయకూడని పనులు ఏవో తెలుసుకోండి.
అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన వారు పాటించాల్సిన నియమాలు
అయ్యప్ప దీక్షలో కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిసారి మాల వేసుకునేవారు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకుండా చూసుకోండి.
1. బ్రహ్మచర్యాన్ని పాటించాలి
అయ్యప్ప దీక్షలో బ్రహ్మచర్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దీక్షా సమయం అంతా కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి.
2. స్వామివారిని ఆరాధించాలి
మాలధారణ చేసిన భక్తులు స్వామివారిని ఉదయం, సాయంత్రం ఆరాధించాలి. దీపం వెలిగించి అయ్యప్ప స్తోత్రం చదువుకుని స్వామి నామాలను జపించాలి.
3. సాత్వికాహారం తీసుకోవాలి
అయ్యప్ప దీక్ష వేసుకునేవారు ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఈ నియమాలను కచ్చితంగా పాటించాలి. కేవలం సాత్విక ఆహారం తీసుకోవాలి. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉండాలి.
4. కోపం, అసూయలకు దూరంగా ఉండాలి
అయ్యప్ప దీక్ష తీసుకున్నట్లయితే కోపం, అసూయలకు దూరంగా ఉండాలి. మంచి మనసుతో ఉండాలి.
5. నల్లటి దుస్తులు ధరించాలి
{{/usCountry}}అయ్యప్ప దీక్ష తీసుకున్నట్లయితే కోపం, అసూయలకు దూరంగా ఉండాలి. మంచి మనసుతో ఉండాలి.
5. నల్లటి దుస్తులు ధరించాలి
{{/usCountry}}అయ్యప్ప స్వామి భక్తులు నల్లటి దుస్తులను ధరిస్తారు. ఇవి వైరాగ్యం, భక్తికి ప్రతీకలుగా భావిస్తారు.
6. పాదరక్షలను ఉపయోగించకూడదు
అయ్యప్ప దీక్షలో పాదరక్షలను ఉపయోగించకూడదు. వీలైనంత వరకు చెప్పులు లేకుండానే నడవాలి.
7. ప్రతిరోజూ భజనలు, శరణుఘోష చేయాలి
దీక్ష సమయంలో అయ్యప్ప నామస్మరణకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఆ సమయంలో స్వామివారి భజనలు, హరివరాసనం, శరణుఘోష వంటి భక్తి కార్యక్రమాల్లో పాల్గొనాలి.
8. ప్రతి ఒక్కరినీ స్వామిగా భావించాలి
అయ్యప్ప దీక్ష వేసుకునే వారు ప్రతి ఒక్కరినీ స్వామిగా భావించి 'స్వామి' అని పిలవాలి.
9. సాధ్యమైనంత వరకు నేలపై నిద్రపోవాలి
అయ్యప్ప దీక్ష సమయంలో నేలపై మాత్రమే నిద్రపోవాలి.
10. దానధర్మాలు, సేవా కార్యక్రమాలు చేయాలి
దీక్ష సమయంలో దానధర్మాలు, సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం లభిస్తుంది.
11. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి
అయ్యప్ప దీక్షలో మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
12. గురుస్వామి సూచనలు పాటించాలి
మాలధారణ నుంచి ఇరుముడి కట్టడం వరకు గురుస్వామి సూచనలను పాటించాలి.
అయ్యప్ప దీక్షలో 41 రోజుల ప్రాముఖ్యత
41 రోజుల కాలాన్ని మండల దీక్ష అంటారు. ఈ సమయంలో భక్తులు రోజువారీ అలవాట్లను మార్చుకుని ఆధ్యాత్మిక క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి. 41 రోజుల దీక్షలో పైన చెప్పిన పొరపాట్లు ఏవీ చేయకుండా చూసుకోవాలి. మాలధారణ చేసినప్పటి నుంచి మాల విరమణ వరకు గురుస్వామి మార్గదర్శకత్వంలో నియమాలను పాటించడం మంచిది.