అయ్యప్ప భక్తులు 18 మెట్లు ఎక్కే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.. అయ్యప్ప స్వామికి ఇష్టమైన 6 ఏవో తెలుసుకోండి!

బరిమలలోని 18 పవిత్ర మెట్లను పతినెట్టాంపడి అని పిలుస్తారు. ఈ మెట్లు అయ్యప్ప భక్తులకు ఎంతో పవిత్రమైనవి. వీటికి ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి.  అయ్యప్ప స్వామి 18 పవిత్ర మెట్ల వెనుక ఉన్న రహస్యం ఇదే. 

Published on: Nov 11, 2026, 16:00:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

శబరిమలలో ఉన్న 18 పవిత్ర మెట్లను పతినెట్టాంపడి అని అంటారు. ఈ మెట్లు అయ్యప్ప భక్తులకు అత్యంత పవిత్రమైనవి. 18 మెట్లు అధిరోహించడం అనేది ఆలయంలోకి ప్రవేశించడం మాత్రమే కాదు. ఆధ్యాత్మికంగా మనలో ఉండే అరిషడ్వర్గాలు, ఇంద్రియాలపై నియంత్రణ సాధించడానికి ప్రతీకగా భావిస్తారు.

అయ్యప్ప భక్తులు 18 మెట్లు ఎక్కే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.. అయ్యప్ప స్వామికి ఇష్టమైన 6 ఏవో తెలుసుకోండి! (AI)
అయ్యప్ప భక్తులు 18 మెట్లు ఎక్కే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.. అయ్యప్ప స్వామికి ఇష్టమైన 6 ఏవో తెలుసుకోండి! (AI)

ఈ 18 మెట్లకు పలు ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి. వాటిలో ఒక ప్రసిద్ధ వివరణ ప్రకారం చూసేద్దాం.

మొదటి ఐదు మెట్లు పంచేంద్రియాలు.

తర్వాత ఎనిమిది మెట్లు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య తదితర అష్టరాగాలు.

ఆ తర్వాత ఉండే మూడు మెట్లు సత్వ, రజో, తమో గుణాలు.

అలాగే చివరి రెండు మెట్లను విద్య, అవిద్యగా భావిస్తారు.

ఈ మెట్లను అధిరోహించడం వలన భక్తుడు ప్రాపంచిక బంధాలను అధిగమించి దైవచింతనలోకి ప్రవేశిస్తాడని విశ్వాసం. అయితే అయ్యప్ప భక్తులు 18 మెట్లు ఎక్కే ముందు కచ్చితంగా ఏడు విషయాలను తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

అయ్యప్ప భక్తులు 18 మెట్లు ఎక్కే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

1. 41 రోజుల పాటు మండల దీక్ష

సంప్రదాయం ప్రకారంగా చూసినట్లయితే, అయ్యప్ప భక్తులు 41 రోజుల పాటు నియమనిష్ఠలతో దీక్షను పాటిస్తారు.

2. ఇరుముడి

ఇరుముడిని తలపై ధరించిన తర్వాతే 18 పవిత్ర మెట్లు ఎక్కాలి.

3. గురుస్వామి మార్గదర్శకత్వం

ఇరుముడి కట్టడం, పూజా విధానాలు గురుస్వామి సూచనలతో నిర్వహించాలి.

4. కొబ్బరికాయ కొట్టకూడదు

18 మెట్లపైన కొబ్బరికాయలను కొట్టడం నిషేధం. కొబ్బరికాయలను నిర్దేశించిన ప్రదేశాల్లోనే కొట్టాలి.

5. మోకాళ్లపై ఎక్కకూడదు

మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్లపై నడవకూడదు.

6. క్యూలో వెళ్లాలి

పవిత్ర మెట్లను అధిరోహించే సమయంలో క్యూను పాటించడం తప్పనిసరి. తొందరపడడం మంచిది కాదు.

7. ఆరోగ్య జాగ్రత్తలు

కొండ ఎక్కేటప్పుడు అలసట వస్తే విశ్రాంతి తీసుకోండి. అవసరమైతే వైద్య కేంద్రాల సహాయాన్ని పొందండి.

ఏ రాశుల వారికి అయ్యప్ప అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది? ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందా?

జ్యోతిష్యం ప్రకారం చూసినట్లయితే, కొన్ని రాశుల వారికి అయ్యప్ప అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అయ్యప్ప స్వామికి ఈ రాశులంటే చాలా ఇష్టం.

1. మేష రాశి

మేష రాశి వారికి అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరగాలని అయ్యప్ప స్వామిని ఈ రాశి వారు ప్రార్థిస్తారు. జీవితంలో ఆటంకాలను అధిగమించడానికి ఆధ్యాత్మిక బలం మేష రాశి వారికి లభిస్తుంది.

కుజుడి ఆధిపత్యంలో ఉండే మేష రాశి వారు చాలా ధైర్యవంతులు, నిజాయితీపరులు. అయ్యప్ప స్వామి ధైర్యం, న్యాయానికి కట్టుబడే గుణాలను ఇష్టపడతారు. కష్టపడి పనిచేసే ఈ రాశి వారికి స్వామి అనుగ్రహం ఎప్పుడూ లభిస్తుంది.

2. మిథున రాశి

బుధుడి ఆధిపత్యంలో ఉండే మిథున రాశి వారు లోతుగా ఆలోచిస్తారు. తెలివితేటలు, వివేకం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఆటంకాలు తొలగిపోతాయి.

3. సింహ రాశి

సింహ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అయ్యప్ప స్వామి దివ్యమైన రూపం, ధర్మమార్గంలో నడిచే ఆయన తత్వం వీళ్ల స్వభావానికి దగ్గరగా ఉంటాయి. అయ్యప్ప అనుగ్రహంతో ఈ రాశి వారు ఉన్నత పదవులు, కీర్తిప్రతిష్టలను పొందుతారు.

4. వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కఠినమైన నియమనిష్ఠలతో ఉపవాస దీక్షను పాటించే సామర్థ్యం వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ఈ రాశి వారికి కూడా అయ్యప్ప అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.

5. మకర రాశి

మకర రాశి వారికి శని ప్రభావం వలన ఎదురయ్యే కష్టాలు, ప్రతికూలతల నుంచి అయ్యప్ప స్వామి రక్షణ కల్పిస్తారు. కష్టపడి పనిచేస్తే అయ్యప్ప స్వామి కచ్చితంగా ఈ రాశి వారికి మంచి చేస్తారు. కోరికలను తీరుస్తారు.

6. కుంభ రాశి

కుంభ రాశి వారికి కూడా అయ్యప్ప అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అయ్యప్ప కరుణాకటాక్షాలు వీరిపై ఎప్పుడూ ఉంటాయని భక్తుల నమ్మకం. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి జీవితంలో స్థిరత్వాన్ని సాధిస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More