అయ్యప్ప దీక్షలో పొరపాటున కూడా చేయకూడని 12 పనులు ఇవే.. మొదటిసారి దీక్ష తీసుకునేవారు తెలుసుకోండి!

అయ్యప్ప స్వామి మాలధారణకు హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ప్రతి ఏటా కార్తీక మాసం నుంచి లక్షలాది మంది భక్తులు 41 రోజుల మండల దీక్షను స్వీకరిస్తారు. ఈ సమయంలో బ్రహ్మచర్యం, సాత్వికాహారం, నిత్య పూజలు, భజనలు, నామస్మరణ వంటి నియమాలను పాటిస్తారు. 

Published on: Nov 13, 2026, 09:03:07 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

అయ్యప్ప స్వామి మాలధారణకు ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఏటా కార్తీక మాసం ప్రారంభం నుంచి లక్షలాది మంది భక్తులు అయ్యప్ప స్వామి దీక్షను చేపడతారు. నల్లటి బట్టలు వేసుకుని, మెడలో తులసి లేదా రుద్రాక్ష మాలను వేసుకుని 41 రోజుల పాటు నియమనిష్ఠలతో స్వామివారిని పూజిస్తారు.

అయ్యప్ప దీక్షలో పొరపాటున కూడా చేయకూడని 12 పనులు ఇవే.. మొదటిసారి మాల వేసుకునేవారు తెలుసుకోండి! (AI)
అయ్యప్ప దీక్షలో పొరపాటున కూడా చేయకూడని 12 పనులు ఇవే.. మొదటిసారి మాల వేసుకునేవారు తెలుసుకోండి! (AI)

అయ్యప్ప దీక్ష అంటే కేవలం మాల ధరించడం మాత్రమే కాదు. మనసు, మాట, శరీరం పవిత్రంగా ఉంటూ క్రమశిక్షణతో ఉండటమే ఈ దీక్షలోని ప్రధాన ఉద్దేశం. అయితే, అయ్యప్ప మాల వేసుకున్నవారు బ్రహ్మచర్యం, సాత్విక ఆహారం, నిత్య పూజలు, భజనలు వంటి వాటితో సమయాన్ని గడపాలి.

మొదటిసారి మాల వేసుకుంటున్నారా? 41 రోజుల దీక్షలో పొరపాటున కూడా చేయకూడని పనులు ఏవో తెలుసుకోండి.

అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన వారు పాటించాల్సిన నియమాలు

అయ్యప్ప దీక్షలో కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిసారి మాల వేసుకునేవారు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకుండా చూసుకోండి.

1. బ్రహ్మచర్యాన్ని పాటించాలి

అయ్యప్ప దీక్షలో బ్రహ్మచర్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దీక్షా సమయం అంతా కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి.

2. స్వామివారిని ఆరాధించాలి

మాలధారణ చేసిన భక్తులు స్వామివారిని ఉదయం, సాయంత్రం ఆరాధించాలి. దీపం వెలిగించి అయ్యప్ప స్తోత్రం చదువుకుని స్వామి నామాలను జపించాలి.

3. సాత్వికాహారం తీసుకోవాలి

అయ్యప్ప దీక్ష వేసుకునేవారు ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఈ నియమాలను కచ్చితంగా పాటించాలి. కేవలం సాత్విక ఆహారం తీసుకోవాలి. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉండాలి.

4. కోపం, అసూయలకు దూరంగా ఉండాలి

అయ్యప్ప దీక్ష తీసుకున్నట్లయితే కోపం, అసూయలకు దూరంగా ఉండాలి. మంచి మనసుతో ఉండాలి.

5. నల్లటి దుస్తులు ధరించాలి

అయ్యప్ప స్వామి భక్తులు నల్లటి దుస్తులను ధరిస్తారు. ఇవి వైరాగ్యం, భక్తికి ప్రతీకలుగా భావిస్తారు.

6. పాదరక్షలను ఉపయోగించకూడదు

అయ్యప్ప దీక్షలో పాదరక్షలను ఉపయోగించకూడదు. వీలైనంత వరకు చెప్పులు లేకుండానే నడవాలి.

7. ప్రతిరోజూ భజనలు, శరణుఘోష చేయాలి

దీక్ష సమయంలో అయ్యప్ప నామస్మరణకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఆ సమయంలో స్వామివారి భజనలు, హరివరాసనం, శరణుఘోష వంటి భక్తి కార్యక్రమాల్లో పాల్గొనాలి.

8. ప్రతి ఒక్కరినీ స్వామిగా భావించాలి

అయ్యప్ప దీక్ష వేసుకునే వారు ప్రతి ఒక్కరినీ స్వామిగా భావించి 'స్వామి' అని పిలవాలి.

9. సాధ్యమైనంత వరకు నేలపై నిద్రపోవాలి

అయ్యప్ప దీక్ష సమయంలో నేలపై మాత్రమే నిద్రపోవాలి.

10. దానధర్మాలు, సేవా కార్యక్రమాలు చేయాలి

దీక్ష సమయంలో దానధర్మాలు, సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం లభిస్తుంది.

11. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి

అయ్యప్ప దీక్షలో మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.

12. గురుస్వామి సూచనలు పాటించాలి

మాలధారణ నుంచి ఇరుముడి కట్టడం వరకు గురుస్వామి సూచనలను పాటించాలి.

అయ్యప్ప దీక్షలో 41 రోజుల ప్రాముఖ్యత

41 రోజుల కాలాన్ని మండల దీక్ష అంటారు. ఈ సమయంలో భక్తులు రోజువారీ అలవాట్లను మార్చుకుని ఆధ్యాత్మిక క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి. 41 రోజుల దీక్షలో పైన చెప్పిన పొరపాట్లు ఏవీ చేయకుండా చూసుకోవాలి. మాలధారణ చేసినప్పటి నుంచి మాల విరమణ వరకు గురుస్వామి మార్గదర్శకత్వంలో నియమాలను పాటించడం మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More