Baba Vangas Predictions : 2026 నుండి 2030 వరకు బాబా వంగా అంచనాలు.. షాకింగ్ ఘటనలు
Baba Vangas Predictions : బాబా వంగా చెప్పే జోస్యం గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. బాబా వంగా జోస్యం చాలా సందర్భాలలో నిజమైనదని చెబుతుంటారు. అయితే 2026 నుంచి 2030 వరకు కొన్ని షాకింగ్ ఘటనలు బాబా వంగా చెప్పారు.
జనాలకు భవిష్యత్తు గురించి తెలుసుకోవడంపై ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే శతాబ్దాలుగా ప్రజలు జ్యోతిష్య శాస్త్రంపై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తు గురించి ప్రవక్తలు చేసే అంచనాలు ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. భవిష్యత్తు గురించి బాబా వంగా చేసిన అనేక జోస్యాలు నిజమై, ప్రజలను ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురిచేసినవి కూడా ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా బాబా వంగా భవిష్యవాణులను నమ్మే ప్రజలు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. అదే సమయంలో వాటిని కేవలం కల్పిత కథలుగా భావించేవారు కూడా ఉన్నారు. ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ బాబా వంగా భవిష్యత్ గురించి చెప్పినవి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2026 నుండి 2030 సంవత్సరాల వరకు బాబా వంగా భవిష్యత్ గురించి చెప్పినవి ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి. అవేంటో చూద్దాం..
2026: యుద్ధం
2026లో ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే ఒక పెద్ద యుద్ధం చెలరేగుతుందని బాబా వంగా జోస్యం చెప్పారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితికి చాలా సందర్భోచితంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న యుద్ధాలు ప్రపంచంపై ప్రభావం పడుతుంది.
2027: జీవసంబంధ మార్పులు, కొత్త వ్యాధుల
2027వ సంవత్సరం నాటికి ఒక కొత్త వ్యాధి లేదా జీవ ప్రయోగం వెలుగులోకి వస్తుందని, దాని ఫలితంగా కొంతమంది మానవులు మానవాతీత శక్తులను పొందవచ్చని బాబా వంగా చెప్పారు. ఈ ప్రవచనాన్ని పలు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. దీనిని 2026వ సంవత్సరానికి సంబంధించిన ప్రవచనాలతో ముడిపెట్టి కూడా చూడవచ్చు. రసాయన, జీవయుద్ధానికి కూడా సంబంధించినదని భావిస్తున్నారు.
2028: నూతన శక్తి
2028లో మానవులు ఒక కొత్త శక్తి వనరును కనుగొంటారని, ఆ శక్తి చాలా శక్తివంతమైనదిగా, స్వచ్ఛమైనదిగా ఉంటుందని బాబా వంగా జోస్యం చెప్పారు. అలాగే శుక్ర గ్రహానికి ప్రయాణించే ప్రణాళికలు లేదా అంతరిక్షంలో కాలనీలను స్థాపించే ప్రణాళికలు ఈ సంవత్సరమే ప్రారంభం కావచ్చు.
2029: ఆర్థిక, సామాజిక విప్లవం
ఈ సంవత్సరం ప్రపంచంలోని చాలా దేశాలలో ఆర్థిక, సామాజిక నిర్మాణాన్ని మార్చే ఒక విప్లవం సంభవిస్తుంది. పాత వ్యవస్థలు కూలిపోయి, వాటి స్థానంలో కొత్తవి వస్తాయి. బాబా వంగా చెప్పిన ఈ భవిష్యత్ గత కొన్నేళ్లుగా వెలువడిన ఇతర అంచనాలకు సంబంధం ఉన్నట్లుగా కనిపిస్తోంది.
2030: దీర్ఘాయువు పెరగవచ్చు
బాబా వంగా అంచనాల ప్రకారం, 2030 నాటికి ప్రపంచం "హరిత శక్తి" వైపు పయనిస్తుంది. అంతేకాకుండా, కాలుష్యాన్ని తగ్గించడానికి సాంకేతికత బాగా మెరుగుపడుతుంది. దీనివల్ల మానవ ఆరోగ్యం, దీర్ఘాయువు పెరగవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


