ఇల్లు అనేది మనసుకు ప్రశాంతతను ఇచ్చే ప్రదేశం. అందులోనూ బెడ్‌రూమ్ మన అలసటను తీర్చే అత్యంత వ్యక్తిగతమైన ప్రాంతం. వాస్తు శాస్త్రం మరియు ఫెంగ్ షుయ్ నిపుణుల ప్రకారం, బెడ్‌రూమ్‌లో ఉంచే ప్రతి వస్తువుకూ ప్రత్యేక శక్తి ఉంటుంది. ఇక్కడ చిన్న పొరపాటు జరిగినా మొత్తం ఇంటి శక్తి సమతుల్యత దెబ్బతింటుంది.

మనం చేసే కొన్ని చిన్న పొరపాట్లు ఇంట్లో ప్రతికూల శక్తిని (Negative Energy) పెంచుతాయి. బంధాలను దెబ్బతీస్తాయి. బెడ్‌రూమ్‌లో ఎలాంటి వస్తువులు ఉండకూడదో, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు చూద్దాం.
బెడ్‌రూమ్‌లో అద్దం ఎదురుగా ఉండకూడదు
చాలా మంది గదిని అందంగా కనిపించేలా చేయడానికి మంచానికి ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ లేదా పెద్ద అద్దం ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఫెంగ్ షుయ్ ప్రకారం ఇది పూర్తిగా తప్పు. నిద్రపోతున్నప్పుడు అద్దంలో మన ప్రతిబింబం పడకూడదు. అలా పడితే నిద్రలేమి సమస్య రావడంతో పాటు మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఒకవేళ అద్దం మార్చడం వీలుకాకపోతే, రాత్రి సమయంలో దానిని ఒక చక్కని తెరతో కప్పి ఉంచడం మంచిది.
ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరం వద్దు
నేటి ఆధునిక కాలంలో బెడ్‌రూమ్‌ను కూడా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో నింపేస్తున్నాం. కానీ ఫెంగ్ షుయ్ ప్రకారం పడకగది అనేది కేవలం విశ్రాంతి తీసుకునేందుకే కేటాయించాలి. టీవీలు, లాప్‌టాప్‌లు, మొబైల్స్ వంటివి గదిలో ఉంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాలు నిద్రను భగ్నం చేస్తాయి. రాత్రి పడుకునే ముందు ఫోన్లను వీలైనంత దూరంగా ఉంచడం ఆరోగ్యానికి, మనసుకి చాలా మంచిది.
డ్రై ఫ్లవర్స్, ముళ్ళ మొక్కలు
బెడ్‌రూమ్‌ను అలంకరించడానికి వాడే కృత్రిమ లేదా ఎండిపోయిన పువ్వులను వెంటనే తొలగించాలి. అలాగే ముళ్ళు ఉండే క్యాక్టస్ వంటి మొక్కలను పడకగదిలో అస్సలు ఉంచకూడదు. ఇవి ఇంట్లో శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దీనివల్ల ఇంట్లో నిత్యం అశాంతి నెలకొనే ప్రమాదం ఉంది.
మంచం కింద చెత్తాచెదారం వద్దు
{{/usCountry}}బెడ్‌రూమ్‌ను అలంకరించడానికి వాడే కృత్రిమ లేదా ఎండిపోయిన పువ్వులను వెంటనే తొలగించాలి. అలాగే ముళ్ళు ఉండే క్యాక్టస్ వంటి మొక్కలను పడకగదిలో అస్సలు ఉంచకూడదు. ఇవి ఇంట్లో శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దీనివల్ల ఇంట్లో నిత్యం అశాంతి నెలకొనే ప్రమాదం ఉంది.
మంచం కింద చెత్తాచెదారం వద్దు
{{/usCountry}}బెడ్‌రూమ్‌లో స్పేస్ ఆదా చేయడానికి మంచం కింద అనవసరమైన సామాను, పాత బాక్సులు కుక్కేస్తుంటారు. కానీ బెడ్ కింద భాగం వీలైనంత ఖాళీగా, శుభ్రంగా ఉండాలి. మంచం కింద వస్తువులు పేరుకుపోతే మానసిక వత్తిడి పెరుగుతుంది. క్రమం తప్పకుండా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తూ ఉండాలి.
హింసాత్మక చిత్రాలు, నెగెటివ్ పెయింటింగ్స్
గది గోడలకు అందమైన ప్రకృతి దృశ్యాలు లేదా ప్రశాంతతను పంచే చిత్రాలను తగిలించాలి. పొరపాటున కూడా యుద్ధాలు, బాధాకరమైన సన్నివేశాలు లేదా క్రూరమైన జంతువులను తెలిపే పెయింటింగ్స్‌ను బెడ్‌రూమ్‌లో పెట్టకూడదు. ఇవి గదిలో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తాయి.
బెడ్‌రూమ్‌లో నెగెటివ్ ఎనర్జీని దూరం చేసే మార్గాలు
గదిలో సానుకూల శక్తిని నింపడానికి ఉదయం పూట కాసేపు కిటికీలు తెరిచి గాలి, వెలుతురును వచ్చేలా చూడాలి. ఒక చిన్న గిన్నెలో కల్లు ఉప్పును (Sea Salt) బెడ్‌రూమ్‌లో ఉంచితే అది గదిలోని ప్రతికూల శక్తిని పీల్చుకుంటుంది. అలాగే మంచి సువాసననిచ్చే ఎసెన్షియల్ ఆయిల్స్ వాడటం వల్ల మనసు తేలికవుతుంది, ప్రశాంతమైన నిద్ర సొంతమవుతుంది.