తలస్నానానికి కూడా నియమాలు ఉన్నాయా? ఆడవాళ్ళు ఏ రోజు తలస్నానం చేస్తే అదృష్టం, ఏ రోజు చేస్తే దరిద్రం?
Best days for Hair wash: మనం నిత్యం చేసే పనుల్లో తలస్నానం ఒకటి. కానీ, శాస్త్ర ప్రకారం ఏ రోజు తలస్నానం చేయాలి? ఏ రోజు చేయకూడదు? అనేది మన ఆరోగ్యంపై, ఇంట్లోని ఐశ్వర్యంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మహిళలు ఈ నియమాలు పాటించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తలస్నానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్ని రోజుల్లో తలస్నానం చేస్తే చాలా మంచి జరుగుతుంది, అలాగే కొన్ని రోజుల్లో తలస్నానం చేయడం వలన ఇబ్బందులు వస్తాయి. తలస్నానానికి ఆ రోజుకి చాలా పెద్ద సంబంధం ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లు కొన్ని రోజుల్లో తలస్నానం చేస్తే అసలు మంచిది కాదు. మరి మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా? ఒకవేళ చేస్తున్నట్లయితే మార్చుకోండి.

ఆడవాళ్లు ఏ రోజు తలస్నానం చేయాలి, ఏ రోజు తలస్నానం చేయకూడదు:
సోమవారం తలస్నానం చేస్తే ప్రశాంతత కలుగుతుంది
సోమవారం చంద్రుడికి సంబంధించినది కనుక ఆ రోజు తలస్నానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రశాంతతని పెంపొందించుకోవచ్చు, శాంతి ఉంటుంది. మహిళలు సోమవారం తలస్నానం చేయడం శుభప్రదమైనది.
బుధవారం తలస్నానం చేస్తే మంచిది
బుధవారం నాడు మహిళలు తలస్నానం చేయడం మంచిదే. ఆ రోజు తలస్నానం చేయడం వలన ఏ ఇబ్బంది ఉండదు, శుభ ఫలితాలు సూచిస్తుంది. కాబట్టి బుధవారం నాడు తలస్నానం చేస్తే కూడా మంచిదే.
గురువారం ఐశ్వర్యం కలుగుతుంది
గురువారం తలస్నానం చేస్తే మంచిది. గురువు అంటే శ్రేయస్సు, ఆశీస్సులు. గురువారం నాడు మహిళలు తలస్నానం చేయడం వలన ఐశ్వర్యం పెరుగుతుంది, ఆశీస్సులు కలుగుతాయి. కాబట్టి గురువారంనాడు కుదిరితే మహిళలు తలస్నానం చేయడం మంచిది.
శుక్రవారం శక్తివంతమైన రోజు
శుక్రవారం చాలా శక్తివంతమైన రోజు. శుక్రుడు మనసు, ఆకర్షణకు తారకుడు. డబ్బు, సంపద, విలాసాలని అందిస్తాడు. శుక్రవారం నాడు తలస్నానం చేస్తే కూడా ఏ ఇబ్బంది ఉండదు. శుభ ఫలితాలే కలుగుతాయి.
ఈ రోజుల్లో తలస్నానం చేయడం మంచిది కాదు:
ఆదివారం: ఇబ్బందులు వస్తాయి. ఆదివారం నాడు తలస్నానం చేయడం వలన అలసట పెరుగుతుంది. శక్తి ప్రవాహంలో కూడా మార్పు ఉంటుంది. కాబట్టి ఆ రోజు తలస్నానం చేయకుండా ఉండడమే మంచిది.
శనివారం: శనివారం కూడా తలస్నానం చేయకపోవడం మంచిది. శనివారం తలస్నానం చేస్తే జుట్టు రాలడం వంటివి ఎదుర్కోవచ్చు. శని దేవుడు బరువు, ఆలస్యాన్ని సూచిస్తాడు.
మంగళవారం: మంగళవారం కూడా మహిళలు తలస్నానం చేయకపోతేనే బెస్ట్. కుజ గ్రహం స్వభావానికి ఆడవాళ్లు ఆరోజు తలస్నానం చేయడం ఏ మాత్రం మంచిది కాదు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. పండుగ రోజుల్లో ఏ వారమైనా తలస్నానం చేయవచ్చా?
పండుగలు, వ్రతాలు లేదా ఏదైనా పుణ్యకార్యాలు ఉన్నప్పుడు వారంతో సంబంధం లేకుండా తలస్నానం చేయవచ్చు. అటువంటి సమయాల్లో సంప్రదాయ నియమాల కంటే ఆచారానికే ప్రాముఖ్యత ఉంటుంది.
2. మహిళలు మంగళవారం తలస్నానం చేయకూడదా?
సాధారణంగా మంగళవారం తలస్నానం చేయడం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో లేదా అనారోగ్యం నుంచి కోలుకున్నప్పుడు మినహాయింపులు ఉంటాయి.
3. తలస్నానం చేయడానికి ఉత్తమ సమయం ఏది?
సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయ సమయంలో తలస్నానం చేయడం అత్యంత శ్రేష్ఠం. దీనివల్ల శరీరానికి తాజాదనం రావడమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మేలు జరుగుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


