Best Husband Rasis: ఈ రాశుల అబ్బాయిలు వారి భార్యలను మహారాణిలా చూసుకుంటారు, ఎల్లప్పుడూ సంతోషమే!
రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, వ్యక్తిత్వం ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. ఒక్కో రాశి వారి స్వభావం, తీరు ఒక్కో విధంగా ఉంటుంది. ఈ రాశుల అబ్బాయిలు మాత్రం వారి భార్యలను మహారాణుల్లా చూసుకుంటారు. వారికి ఏ విధమైన లోటు లేకుండా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటారు.
మనకి మొత్తం 12 రాశులు ఆధారంగా అనేక విషయాలను చెప్పచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, వ్యక్తిత్వం ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. ఒక్కో రాశి వారి స్వభావం, తీరు ఒక్కో విధంగా ఉంటుంది.

కొన్ని రాశుల వారికి కొన్ని బలహీనతలు ఉంటే, అదే కొన్ని రాశుల వారికి బలాలు కావచ్చు. ఈ రాశుల అబ్బాయిలు మాత్రం వారి భార్యలను మహారాణుల్లా చూసుకుంటారు. వారికి ఏ విధమైన లోటు లేకుండా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటారు. వీరిని పెళ్లి చేసుకున్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. మరి మీరు కూడా అదృష్టవంతులేనా? తెలుసుకోండి.
మంచి భర్త
ప్రతి ఒక్క అమ్మాయి కూడా మంచి జీవిత భాగస్వామి రావాలని కలలు కంటుంది. ఒక మంచి స్నేహితుడిగా, ఒక మంచి సపోర్టర్‌గా ఉండాలని కోరుకుంటుంది. ప్రతి అమ్మాయి కూడా తన భర్త తనను రాణిలా చూసుకోవాలని అనుకుంటుంది. ఇవి కేవలం ఊహలే అని అనుకోవద్దు. చాలా మంది జీవితాల్లో కూడా ఇలాంటి భర్తలు ఉంటారు.
ఈ రాశుల వారిని వివాహం చేసుకుంటే ఆ అమ్మాయి సంతోషంగా ఉంటుంది. మహారాణిలా ఈ రాశుల అబ్బాయిలు వారి భార్యలను చూసుకుంటారు. ఎప్పుడూ కూడా సపోర్ట్ ఇస్తారు, ప్రేమగా చూసుకుంటారు. పెళ్లయిన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. అలాగే చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు భర్త సపోర్ట్ లేకుంటే చాలా బాధగా ఉంటుంది.
ఈ రాశుల అమ్మాయిలు చాలా లక్కీ... భార్యను భర్త మహారాణిలా చూసుకుంటారు
1.వృషభ రాశి:
వృషభ రాశి అబ్బాయిలు వారి భార్యలను బాగా చూసుకుంటారు. ఈ రాశి వారు శుక్రుని ప్రభావంతో రొమాంటిక్‌గా ఉంటారు. అలాగే భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి చూస్తారు. కుటుంబం, ప్రశాంతమైన జీవితం వీరికి చాలా ముఖ్యం. తక్కువ మాట్లాడతారు, ఎక్కువ కేర్ చూపిస్తారు. అలాగే ముఖ్యమైన రోజుల్లో సర్ప్రైజ్‌లను ప్లాన్ చేస్తారు.
2.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు వారి భార్యను మహారాణిలా చూసుకుంటారు. చంద్రుని ప్రభావంతో ఈ రాశి వారు వారి భాగస్వామిని బాగా అర్థం చేసుకోగలరు. అలాగే ప్రతి చిన్న చిన్న పనుల ద్వారా సంతోషాన్ని వ్యక్తపరుస్తారు, ప్రేమను పంచుతారు. గొడవలు కూడా ఎక్కువగా రావు. కుటుంబంలో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది.
3.తులా రాశి:
తులా రాశి పురుషులు కూడా వారి భాగస్వామిని బాగా చూసుకుంటారు. మహారాణిలా ఉండేలా చూసుకుంటారు. ఎలాంటి గొడవలు వచ్చినా వెంటనే పరిష్కరిస్తారు. ఏమైనా సమస్యలను కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. భాగస్వామి ఆనందం కోసం నిరంతరం శ్రమిస్తారు.
4.మీన రాశి:
మీన రాశి అబ్బాయిలు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. అలాగే దయ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి అబ్బాయిలు కూడా భాగస్వామి భావాలను బాగా అర్థం చేసుకుంటారు. కష్టమైన పరిస్థితులు వస్తే తోడుగా నిలుస్తారు. ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. నిజాయితీగా ఉంటారు. భార్య ఆనందం కోసం ఏమైనా చేస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


