...
...
Next Story

ఈ ఏడాది భోగి నాడే షట్తిల ఏకాదశి.. పద్నాలుగేళ్ళ వరకు ఈ అరుదైన యోగం రాదు.. పాటించాల్సినవి ఇవే!

భోగి (Bhogi 2026) అంటే వెలుగుల పండుగకు మొదటి అడుగు. భోగి మంటల్లో దుఃఖాలు అన్నీ కాలిపోయి, సంతోషాలు చిగురించాలని అందరూ కోరుకుంటారు. ఉత్తరాయణంలో కొత్త ఆశలు ఉదయిస్తాయి. 2026 భోగి అనేది కేవలం పండుగ కాదు. పంచాంగం పరంగా చూసినట్లయితే అరుదైన ఏకాదశి యోగం ఆ రోజు రావడం విశేషం.

Published on: Jan 13, 2026, 16:30:21 IST
Advertisement

సంక్రాంతి పనులు మొదలైపోయాయి. తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నాయి. ఈ జనవరి 14 అంటే రేపు భోగి పండుగను జరుపుకోబోతున్నాము. అలాగే 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలను జరుపుకోబోతున్నాము. అయితే ఈ సంవత్సరం వచ్చే భోగి పండుగ చాలా విశేషమైనది. భోగి నాడు అరుదైన ఆధ్యాత్మిక సమ్మేళనం చోటు చేసుకోనుంది.

వెలుగుల పండుగ భోగి

ఈ ఏడాది భోగి నాడే షట్తిల ఏకాదశి.. పద్నాలుగేళ్ళ వరకు ఈ అరుదైన యోగం రాదు (pinterest)
ఈ ఏడాది భోగి నాడే షట్తిల ఏకాదశి.. పద్నాలుగేళ్ళ వరకు ఈ అరుదైన యోగం రాదు (pinterest)

భోగి (Bhogi 2026) అంటే వెలుగుల పండుగకు మొదటి అడుగు. భోగి మంటల్లో దుఃఖాలు అన్నీ కాలిపోయి, సంతోషాలు చిగురించాలని అందరూ కోరుకుంటారు. ఉత్తరాయణంలో కొత్త ఆశలు ఉదయిస్తాయి. 2026 భోగి అనేది కేవలం పండుగ కాదు. పంచాంగం పరంగా చూసినట్లయితే అరుదైన ఏకాదశి యోగం ఆ రోజు రావడం విశేషం.

ఈ భోగికి ఏకాదశి తిథి రావడంతో దీని విశిష్టత మరింత పెరిగింది. భోగి తర్వాత సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అంటే దేవతల పగలు ప్రారంభమయ్యే శుభకాలం ఇది. చీకటి నుంచి వెలుగులోకి, బాధల నుంచి ఆశల వైపుకు సాగాలని భోగి పండుగ మనకు సూచిస్తుంది.

భోగి 2026+ షట్తిల ఏకాదశి

పుష్య శుక్ల ఏకాదశి భోగి నాడు రావడం విశేషం. దీనిని షట్తిల ఏకాదశి అని అంటారు. జనవరి 13 మధ్యాహ్నం 3:18కి ఏకాదశి ప్రారంభమవుతుంది. జనవరి 14 సాయంత్రం 5:53తో ముగుస్తుంది. భోగి పండుగ నాడు ఈ ఏకాదశి రావడం భోగి మాత్రమే కాదు, మహా విశేషమైన రోజు కూడా.

షట్తిల ఏకాదశి నాడు వీటిని పాటిస్తే మంచిది

  1. షట్తిల ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం లేదా సాత్విక ఆహారాన్ని తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.
  2. నువ్వుల నూనె ఒంటికి రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి.
  3. నల్ల నువ్వులను స్నానం చేసే నీళ్లలో వేసుకొని స్నానం చేయడం మంచిది.
  4. అలాగే నువ్వులను ఏదో ఒక రూపంలో సేవిస్తే కూడా మంచి జరుగుతుంది.
  5. నువ్వులను దానం చేస్తే కూడా మంచి జరుగుతుంది.
  6. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మానసిక ప్రశాంతతను పొందడానికి వీలవుతుంది.

భోగి మంటలు, శాస్త్రీయ కోణం

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe