Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి వేళ ఏ రాశి వారు వేటిని దానం చేస్తే మంచిది?

వైకుంఠ ఏకాదశి పర్వదినాన విష్ణువుని ఆరాధించి ఉపవాస దీక్షను పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. విష్ణువు అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చని విశ్వాసం. అలాగే దానధర్మాలు చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది, అదృష్టం వస్తుంది. మీ రాశి ప్రకారం ఏవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడే తెలుసుకోండి.

Published on: Dec 30, 2025, 10:00:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) హిందువులకు ముఖ్యమైన పర్వదినం. దీనిని ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadashi) అని కూడా అంటారు. ఈ పర్వదినాన విష్ణువుని ఆరాధించి ఉపవాస దీక్షను పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. విష్ణువు అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చని విశ్వాసం. అలాగే దానధర్మాలు చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది, అదృష్టం వస్తుంది.

వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి వేళ ఏ రాశి వారు వేటిని దానం చేస్తే మంచిది? (pinterest)
వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి వేళ ఏ రాశి వారు వేటిని దానం చేస్తే మంచిది? (pinterest)

ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికపరంగా ప్రయోజనాలను పొందడానికి కూడా వీలవుతుంది. మరి వైకుంఠ ఏకాదశి నాడు ఏ రాశి వారు ఏవి దానం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. మీ రాశి ప్రకారం ఏవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడే తెలుసుకోండి.

వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి వేళ ఏ రాశి వారు వేటిని దానం చేస్తే మంచిది?

ఈరోజు చాలా పవిత్రమైన రోజు. చాలామంది ఉపవాసం ఉండి విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఉత్తర ద్వార దర్శనాన్ని కూడా చేసుకుంటారు. అలాగే దానాలు చేయడం వలన మంచి జరుగుతుంది. ఇలా భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.

మేష రాశి

మేష రాశి వారు ఈ పరమ పవిత్రమైన రోజున ఎర్రటి వస్త్రాలు, కుంకుమ, బెల్లం దానం చేయడం వలన మంచి జరుగుతుంది. చక్కటి ఫలితాన్ని చూస్తారు.

వృషభ రాశి

వృషభ రాశి వారు ఈ రోజున తెల్ల బట్టలు, పప్పు దానం చేస్తే మంచిది. అలాగే మహాలక్ష్మి ఆలయానికి వెళ్లి వెండి వస్తువులను దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారు శంఖాలు, నాణేలను దానం చేయడం మంచిది. అలాగే పాత్రలు, వస్త్రాలు, ఆకుపచ్చని పండ్లు దానం చేస్తే కూడా ఎంతో మంచి కలుగుతుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు బియ్యం, తెల్లని వస్త్రాలు, పసుపు రంగు స్వీట్లు, పప్పులు దానం చేయడం వలన చక్కటి ఫలితాన్ని చూస్తారు.

సింహ రాశి

సింహ రాశి వారు లక్ష్మీనారాయణ ఆలయంలో పూజలు చేసి, అక్కడకు వెళ్లినప్పుడు ఉపయోగపడే వస్తువులను దానం చేయడం మంచిది. అలాగే వెండి దానం చేస్తే కూడా చక్కటి ఫలితాన్ని చూస్తారు.

కన్యా రాశి

కన్యా రాశి వారు వస్త్రాలు, బియ్యం, మినుములు, ఆకుపచ్చని పండ్లను దానం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందడానికి వీలవుతుంది.

తులా రాశి

తులా రాశి వారు శివాలయంలో తెల్లని వస్త్రాలు, పాలు దానం చేయడం మంచిది. అలాగే పువ్వులు, స్వీట్లు, సుగంధ ద్రవ్యాలను దానం చేస్తే చక్కటి ఫలితాన్ని చూస్తారు.

వృశ్చిక రాశి

ఈ రాశి వారు బెల్లం, ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి పూలు వంటి వాటిని దానం చేయడం వలన మంచి ఫలితం కనబడుతుంది. ఆనందంగా ఉండొచ్చు. విష్ణువు అనుగ్రహంతో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారు బ్రాహ్మణులకు స్వయంపాకం ఇస్తే మంచిది. అలాగే పసుపు వస్త్రాలు, పండ్లు దానం చేస్తే కూడా చక్కటి ఫలితం చూస్తారు.

మకర రాశి

మకర రాశి వారు నీలి రంగు వస్త్రాలు, లడ్డూలు, పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు వంటి వాటిని దానం చేస్తే మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారు నల్లని వస్త్రాలు, నువ్వులు, బెల్లం, బియ్యం, బార్లీ వంటి వాటిని దానం చేస్తే చక్కటి ఫలితం కనబడుతుంది. ఆనందంగా ఉండొచ్చు.

మీన రాశి

మీన రాశి వారు పసుపు రంగు స్వీట్లు, పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు వంటి వాటిని దానం చేస్తే మంచిది. చక్కటి ఫలితం కనబడుతుంది. ఆనందంగా ఉండొచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More