...
...
Next Story

Birth Day Astrology: వారంలో ఏ రోజు పుట్టిన వారు తెలివైన వారు? మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన రోజు వారి స్వభావం, వ్యక్తిత్వం, జీవన విధానంపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. వారంలోని ప్రతి రోజుకు ఒక గ్రహాధిపతి ఉండటంతో, ఆ గ్రహ ప్రభావం వ్యక్తి గుణగణాల్లో ప్రతిబింబిస్తుందని చెబుతారు.

Published on: Jun 18, 2026, 11:01:03 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మనం రాశుల ఆధారంగా మాత్రమే కాకుండా, పుట్టిన రోజు ఆధారంగా కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి పుట్టిన రోజు వారి స్వభావం, వ్యక్తిత్వం, జీవిత ధోరణులపై ప్రభావం చూపిస్తుందని నమ్ముతారు. వారంలోని ప్రతి రోజుకీ ఒక గ్రహాధిపతి ఉంటాడు. ఆ గ్రహ ప్రభావం ఆధారంగా వ్యక్తి గుణగణాలు, ప్రవర్తన, జీవనశైలిని అంచనా వేస్తారు. వారంలో ఏ రోజు పుట్టిన వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఏ రోజున పుట్టారు? మరి దాని ఆధారంగా మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చూసేయండి.

ఆదివారం

Birth Day Astrology: వారంలో ఏ రోజు పుట్టిన వారు తెలివైన వారు? మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి! (pinterest)
Birth Day Astrology: వారంలో ఏ రోజు పుట్టిన వారు తెలివైన వారు? మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి! (pinterest)

ఆదివారం పుట్టిన వారు చాలా ధైర్యంగా ఉంటారు. తేజోవంతులు, ఉత్సాహవంతులుగా ఉంటారు. అలాగే, ఆదివారం పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కష్టమైన పరిస్థితుల్లో కూడా విజయాన్ని సాధించగలరు. మంచి పనుల ద్వారా ఫలితాలను పొందుతూ సమాజంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు.

సోమవారం

సోమవారం పుట్టారా? అయితే మీరు ఇలా ఉంటారు. సోమవారం పుట్టిన వారు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. ఇతరుల భావాలను బాగా అర్థం చేసుకోగలరు. సుఖదుఃఖాల్లో సమతుల్యంగా ఉంటారు. పైగా, ఈ రోజున పుట్టిన వారి మాటలు మృదువుగా ఉంటాయి. జ్ఞానం, సరళత వీరి ప్రధాన లక్షణాలు అని చెప్పొచ్చు.

మంగళవారం

మంగళవారం పుట్టిన వారు ధైర్యసాహసాలను కలిగి ఉంటారు. కష్టపడి పని చేయగలరు. కొంత కోప స్వభావం ఉంటుంది. నేరుగా మాట్లాడే స్వభావం వీరిది. అలాగే, మంగళవారం పుట్టిన వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. భూమి, వ్యవసాయం, పరిపాలన రంగాల్లో బాగా రాణించగలరు.

బుధవారం

బుధవారం పుట్టిన వారు వివేకం, తెలివితేటలు, వ్యాపార నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే, వీరు మధురంగా మాట్లాడుతారు. కళల పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఉంటారు. అనేక రంగాల్లో విజయాలను సాధించే సామర్థ్యం ఉంటుంది.

గురువారం

శుక్రవారం పుట్టినట్లయితే ఆనందంగా ఉంటారు. సంస్కారవంతులు, అందమైన వ్యక్తిత్వంతో ఉంటారు. అలాగే, అందరిలోనూ మంచి గుర్తింపును పొందుతారు. పరిశుభ్రతను ఎక్కువగా ఇష్టపడతారు. కళలు, అందం, సమతుల్య జీవనశైలికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.

శనివారం

శనివారం పుట్టినట్లయితే గంభీరమైన స్వభావంతో ఉంటారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. సహనం, కష్టపడి పని చేసే గుణాలు వీరిలో ఉంటాయి. క్రమశిక్షణ, పట్టుదల ఈ రోజున పుట్టిన వారి ప్రధాన బలాలు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe