...
...
Next Story

Birth Month: ఈ నెలల్లో పుట్టిన వారికి ఆత్మాభిమానం ఎక్కువ.. ఎవరు చెప్పినా వినరు, ఎవరికీ తల వంచరు!

ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఒక విధంగా ఉంటుంది. కొంత మంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, అలాగే కొంత మంది ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. పుట్టిన నెల కూడా మనిషి స్వభావం గురించి తెలుపుతుంది. కొన్ని నెలల్లో పుట్టిన వారికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది. ఎవరి కోసం వారి ఆలోచనలను, నిర్ణయాలను మార్చుకోరు.

Published on: Nov 24, 2025, 15:00:07 IST
Advertisement

రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వ తీరు, ప్రవర్తన ఏ విధంగా ఉంటాయి అన్నది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చెప్పచ్చు. అలాగే పుట్టిన నెల ఆధారంగా కూడా చాలా విషయాలు చెప్పచ్చు. పుట్టిన నెల ఆధారంగా ఆ వ్యక్తి తీరు, స్వభావం ఏ విధంగా ఉంటుందనేది చెప్పవచ్చు. అలాగే పుట్టిన నెల ఆధారంగా బలాలు, బలహీనతల గురించి కూడా చెప్పొచ్చు.

ఈ నెలల్లో పుట్టిన వారికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది (pinterest)
ఈ నెలల్లో పుట్టిన వారికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది (pinterest)

ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఒక విధంగా ఉంటుంది. కొంత మంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, అలాగే కొంత మంది ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే పుట్టిన నెల కూడా మనిషి స్వభావం గురించి తెలుపుతుంది. కొన్ని నెలల్లో పుట్టిన వారికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది. ఎవరి కోసం వారి ఆలోచనలను, నిర్ణయాలను మార్చుకోరు. అలాగే తమ విలువలకు విరుద్ధంగా ఉంటే ఎప్పుడూ కూడా ఒప్పుకోరు. ఏ మాత్రం ఇతరుల ముందు తలవంచరు. మరి ఆత్మాభిమానం ఎక్కువ ఉన్న వారు ఎవరు? వీరిలో మీరు ఒకరా? చూసుకోండి.

ఈ నెలల్లో పుట్టిన వారికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది, ఇతరుల ముందు తలవంచరు:

1.జనవరి

జనవరిలో పుట్టిన వారికి ఆత్మాభిమానం ఎక్కువ. క్రమశిక్షణ, బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారు ఏ పరిస్థితి వచ్చినా కూడా గౌరవాన్ని మాత్రం కోల్పోరు. ఎదుటి వ్యక్తి ఎంత దృఢంగా ఉన్నా కూడా తలవంచరు. ఏదైనా నిర్ణయం తీసుకున్నా, దానిని మార్చుకోవడానికి ఇష్టపడరు.

2.ఆగస్టు

ఆగస్టు పై సూర్యుని ప్రభావం ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఎదుటి వాళ్లు చెప్పినదానికి ఏమాత్రం ఒప్పుకోరు. పైగా ఆగస్టు నెలలో పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

3.ఏప్రిల్

అక్టోబర్ నెలలో పుట్టిన వారికి కూడా ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారు మృదువుగా మాట్లాడతారు. గౌరవం తగ్గే పరిస్థితి వస్తే మాత్రం దూరం అవడానికి అయినా వెనుకాడరు. ఏ మాత్రం ఆత్మాభిమానాన్ని కోల్పోవడానికి ఎలాంటి పరిస్థితులు వచ్చినా తలవంచరు.

5.డిసెంబర్

డిసెంబర్ నెలలో పుట్టిన వారికి ధైర్యం, నిజాయితీ ఎక్కువగా ఉంటాయి. ఆత్మాభిమానం కూడా ఎక్కువ. వారు తప్పు చేస్తే కచ్చితంగా ఒప్పుకుంటారు. అన్యాయం జరిగితే మాత్రం ఏ మాత్రం ఊరుకోరు. వారు ఎంచుకున్న దారిలోనే వెళ్తారు. ఇతరుల కోసం వారి నిర్ణయాలను అంత సులువుగా మార్చుకోరు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks