ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు చిన్న వయసులోనే అపారమైన సంపదను పొందుతారు, అదృష్టం కూడా ఎక్కువే!

ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు కష్టపడే పని చేస్తారు. ధైర్యం, తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా, ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు 40 ఏళ్ళ లోపే అపారమైన సంపదను కలిగి ఉంటారు, కోటీశ్వరులు అవుతారు. మరి ఆ అదృష్ట నక్షత్రాలు ఎవరు? వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

Published on: Mar 5, 2026, 10:01:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మనం పుట్టిన తేదీ ద్వారా ఎన్నో విషయాలను చెప్పవచ్చు. అలాగే, మన చేతి వ్రాత, మన పేరులో మొదటి అక్షరం, నక్షత్రం బట్టి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. ప్రతి జన్మ నక్షత్రానికి ప్రత్యేకత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రం వ్యక్తి తీరు, ప్రవర్తన, భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలను చెప్తుంది.

ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు చిన్న వయసులోనే అపారమైన సంపదను పొందుతారు (pinterest)
ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు చిన్న వయసులోనే అపారమైన సంపదను పొందుతారు (pinterest)

ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు కష్టపడే పని చేస్తారు. ధైర్యం, తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా, ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు 40 ఏళ్ళ లోపే అపారమైన సంపదను కలిగి ఉంటారు, కోటీశ్వరులు అవుతారు. మరి ఆ అదృష్ట నక్షత్రాలు ఎవరు? వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు చిన్న వయసులోనే అపారమైన సంపదను పొందుతారు

ప్రతి నక్షత్రానికి కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కొంతమంది కష్టపడి పనిచేస్తారు; కొంతమంది అంత కష్టపడి పని చేయలేరు. ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు 40 లోపే భారీగా డబ్బు సంపాదిస్తారు, విజయాలను అందుకుంటారు. మరి వీరిలో మీరు కూడా ఒకరేమో చూసుకోండి.

మృగశిర నక్షత్రం

మృగశిర నక్షత్రం వారికి పట్టుదల ఎక్కువ. ఈ నక్షత్రంలో పుట్టిన వారు మేధావులు. అలాగే బలమైన లక్ష్యాలు కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు రిస్క్ చేసుకోవడానికి కూడా ఏ మాత్రం ఆలోచించరు. బిజినెస్‌లో, వ్యాపారాల్లో రిస్క్ తీసుకుంటారు. అసాధ్యం అనే పనులను కూడా మొదలుపెట్టి లాభాలను పొందుతారు. ఐటీ, వ్యాపార రంగాల్లో బాగా రాణించగలరు. అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటారు. పైగా, ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకునే స్వభావం ఉంటుంది.

పునర్వసు నక్షత్రం

ఈ నక్షత్రంలో పుట్టిన వారు కూడా 40 ఏళ్ళ లోపే అపారమైన సంపదను కలిగి ఉంటారు. గురు గ్రహం అనుగ్రహం వలన ఈ నక్షత్రం వారు క్రమశిక్షణతో ఉంటారు. విజయాలను చేరుకుంటారు. ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. అదృష్టం కూడా వారి వెంట ఉంటుంది. దీంతో విజయాలనే అందుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్సెస్‌ను అందుకుంటారు. పైగా, చిన్న వయసులోనే ధనవంతులు అయిపోతారు.

అశ్విని నక్షత్రం

ఈ నక్షత్రం వారు చాలా చురుకుగా ఉంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు మంచి నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ కలిగి ఉంటారు. పైగా, నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కెరీర్ మొదట్లోనే మంచి బాధ్యతలను చేపడతారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు వ్యాపారంలో కూడా బాగా రాణించగలరు.

స్వాతి నక్షత్రం

ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. పైగా, స్పష్టమైన లక్ష్యాలను కలిగి ఉంటారు. ఏం సాధించాలో అవగాహన కలిగి ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా సరే విజయాన్ని అందుకుంటారు. అనవసరమైన వాటిలో సమయం వృథా చేయకుండా సరిగ్గా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. పైగా, చిన్న వయసులోనే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More