...
...
Next Story

బ్రహ్మస్థానంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో ప్రతికూలత పెరుగుతుందట!

శాస్త్రం ప్రకారం ఇంటి మధ్య భాగాన్ని బ్రహ్మస్థానంగా పరిగణిస్తారు. ఇది ఇంటి శక్తికి కేంద్ర బిందువుగా భావిస్తారు కాబట్టి ఈ ప్రాంతాన్ని వీలైనంత వరకు ఖాళీగా, శుభ్రంగా ఉంచాలని వాస్తు నిపుణులు సూచిస్తారు. భారీ ఫర్నిచర్, లాకర్లు, వ్యర్థాలు, నీటి ట్యాంకులు లేదా బాత్రూములు ఏర్పాటు చేయకూడదని చెబుతారు.

Published on: Aug 20, 2026, 10:45:21 IST
Advertisement

మన ఇంటి నిర్మాణం ఎలా ఉండాలనే దానిపై వాస్తు శాస్త్రంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఇంటి మధ్య భాగాన్ని అత్యంత పవిత్రమైన స్థానంగా భావిస్తారు. దీన్నే 'బ్రహ్మస్థానం' అంటారు.

బ్రహ్మస్థానంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో ప్రతికూలత పెరుగుతుందట!
బ్రహ్మస్థానంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో ప్రతికూలత పెరుగుతుందట!

ఇంటి సమస్త శక్తి కేంద్రం (Energy Point) ఇక్కడే కేంద్రీకృతమై ఉంటుందని నమ్ముతారు. అన్ని గదుల నుంచి వెలువడే శక్తులు ఈ కేంద్ర బిందువు వద్దే కలుస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ ఖాళీగా, ఎలాంటి బరువులు లేకుండా ఉంచాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

పురాతన కాలంలో ఇళ్ల మధ్యలో తులసి మొక్కను ఉంచడం లేదా ఆ ప్రాంతాన్ని ఖాళీగా ఉంచడం ఆనవాయితీగా వచ్చేది. కానీ నేడు మారుతున్న జీవనశైలి, స్థలాల కొరత కారణంగా చాలా మంది ఈ నియమాలను పాటించడం లేదు. హాల్ లేదా మధ్య స్థలంలో భారీ ఫర్నిచర్ అమర్చుతున్నారు. ఇది వాస్తు ప్రకారం సరైన పద్ధతి కాదు. బ్రహ్మస్థానంలో ఎటువంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.

బ్రహ్మస్థానంలో పొరపాటున కూడా ఇవి ఉండకూడదు

ఇంటి మధ్య భాగంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ ఫర్నిచర్, సోఫాలు లేదా బరువైన వస్తువులు ఉంచకూడదు. ఒకవేళ ఇల్లు చిన్నగా ఉంటే, ఈ స్థలంలో డైనింగ్ టేబుల్ లేదా చిన్నపాటి మీటింగ్ ఏర్పాట్లు చేసుకోవచ్చు. అయితే సెంటర్ పాయింట్ మాత్రం ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఈ ప్రాంతంలో ఎలాంటి వ్యర్థాలు, పాత సామాన్లు లేదా అగ్నికి సంబంధించిన వస్తువులను పోగేయవద్దు.

చాలా మంది ఇళ్లలో సెంట్రల్ స్పేస్‌లోనే లాకర్లు ఏర్పాటు చేస్తుంటారు. ఇంటి కొలతలు సరిగ్గా చూసుకుని, ఆ స్థానం బ్రహ్మస్థానం కిందకు వస్తే అక్కడ అస్సలు ఇలాంటివి ఉండకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనం నిలవదు, కొత్తగా డబ్బు వచ్చే మార్గాలు కూడా మూసుకుపోతాయి. అలాగే ఈ స్థలంలో నీటి ట్యాంకులు, అండర్ గ్రౌండ్ గుంతలు లేదా బాత్రూములు ఉండటం అత్యంత ప్రమాదకరం.

ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe