బుధుడుతో సంపదను ఇచ్చే శుక్రుడి కలయిక.. నెలాఖరుకు లక్ష్మీనారాయణ యోగం.. 4 రాశుల వారికి ధనవర్షం, విజయాల జోరు!

బుధ, శుక్రుల అరుదైన కలయిక వల్ల కర్కాటక రాశిలో పవిత్రమైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. జూన్ 22 నుంచి ఈ రాజయోగం వల్ల నాలుగు రాశుల వారికి అపారమైన ధనలాభం, కెరీర్‌లో భారీ పురోగతి లభిస్తాయి.

Published on: Jun 9, 2026, 09:30:54 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల మార్పులకు, వాటి కలయికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నవగ్రహాలలో శుభ గ్రహాలుగా భావించే బుధుడు, శుక్రుడు త్వరలోనే ఒకే రాశిలో జతకట్టబోతున్నారు. జ్యోతిష్య లెక్కల ప్రకారం నిన్ననే, అంటే జూన్ 8వ తేదీన కళలకు, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. మరో రెండు వారాల్లో, అంటే జూన్ 22వ తేదీన బుద్ధి కారకుడైన బుధుడు కూడా ఇదే రాశిలోకి రాబోతున్నాడు.

బుధుడుతో సంపదను ఇచ్చే శుక్రుడి కలయిక.. నెలాఖరుకు లక్ష్మీనారాయణ యోగం.. 4 రాశుల వారికి ధనవర్షం, విజయాల జోరు!
బుధుడుతో సంపదను ఇచ్చే శుక్రుడి కలయిక.. నెలాఖరుకు లక్ష్మీనారాయణ యోగం.. 4 రాశుల వారికి ధనవర్షం, విజయాల జోరు!

ఒకే రాశిలో ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల జ్యోతిష్య ప్రపంచంలో అత్యంత పవిత్రంగా భావించే 'లక్ష్మీనారాయణ యోగం' రూపుదిద్దుకోనుంది. ఈ అరుదైన రాజయోగం వల్ల కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోనున్నాయి. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఊహించని అదృష్టం వరించనుంది. ఆ రాశుల వివరాలు, వారు పొందబోయే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

1.వృషభ రాశి

బుధ, శుక్రుల అద్భుత కలయిక వృషభ రాశి జాతకులకు విశేష లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా బలంగా మారుతుంది. ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలు సుగమమవుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కుటుంబ సభ్యులు, భాగస్వామితో బంధాలు మరింత బలపడతాయి. వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి.

2.మిథున రాశి

జూన్ 22 నుంచి మిథున రాశి వారికి అఖండ ధనలాభం కలిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుని లాభాల బాట పడతారు. సమాజంలో మీ గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. క్లిష్ట సమయాల్లో స్నేహితులు, ఆప్తులు అండగా నిలుస్తారు. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది. ఆరోగ్యం కూడా మునుపటి కంటే మెరుగవుతుంది.

3.కన్యా రాశి

కన్యా రాశి జాతకులకు ఈ సమయం వృత్తిపరమైన జీవితంలో సరికొత్త శిఖరాలను అధిరోహించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. కార్యాలయంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పైఅధికారులు మీ పనితీరును మెచ్చుకుని కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపార విస్తరణకు ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు త్వరలోనే మంచి ఉద్యోగ సమాచారం అందుతుంది. అవివాహితులకు నచ్చిన భాగస్వామితో కొత్త బంధం ముడిపడే అవకాశాలు ఉన్నాయి.

4.వృశ్చిక రాశి

రెండు వారాల తర్వాత ఏర్పడబోయే ఈ గ్రహాల యుతి వృశ్చిక రాశి వారికి కూడా అఖండ విజయాలను అందిస్తుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించి, ఏదో ఒక శుభవార్త వింటారు. ఆదాయ వనరులు పెరగడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. స్థిరాస్తి, భూమి కొనుగోలు వ్యవహారాల్లో లాభాలు గడిస్తారు. ఈ కాలంలో చేసే ఎలాంటి పెట్టుబడి అయినా భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఇస్తుంది.

లక్ష్మీనారాయణ యోగంలో చేయాల్సిన పరిహారాలు

బుధ, శుక్రుల కలయిక వల్ల కలిగే ప్రయోజనాలను మరింతగా పెంచుకోవడానికి జ్యోతిష్య నిపుణులు కొన్ని సులభమైన పరిహారాలను సూచిస్తున్నారు. బుధవారం నాడు పచ్చ పెసలను దానం చేయడం వల్ల బుధ గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే, శుక్రవారం రోజున పాలు, పెరుగు లేదా తెల్లటి వస్తువులను పేదలకు దానం చేయడం వల్ల శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది. వీటితో పాటు సమాజంలో మహిళలను గౌరవించడం, అందరితో ప్రేమగా మాట్లాడటం వల్ల ఈ రెండు గ్రహాల నుంచి సానుకూల శక్తి లభించి కెరీర్, ఆర్థిక స్థితి సరైన దిశలో ముందడుగు వేస్తాయని పండితులు చెబుతున్నారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More