బుధాదిత్య రాజయోగం ప్రభావం.. ఈ 5 రాశుల కెరీర్, ధనం, అదృష్టం పరుగులు!
జూన్ 15న మిథున రాశిలోకి సూర్యుడి రాకతో అత్యంత శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ గ్రహాల కలయిక వల్ల 5 రాశుల వారికి అదృష్టం వరించి, ఊహించని ధనలాభం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
గ్రహాల రాకుమారుడు బుధుడు ఇప్పటికే సంచరిస్తున్న మిథున రాశిలోకి జూన్ 15న గ్రహాల రాజు సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన 'బుధాదిత్య రాజయోగం' సాకారం కానుంది. సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో కలిసినప్పుడు ఈ అద్భుత యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ కలయిక వల్ల కొన్ని రాశుల వారికి పట్టరాని అదృష్టం వరించడమే కాకుండా కెరీర్, ఆర్థిక పరిస్థితి, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం విషయాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి.

సూర్య, బుధుల కలయిక వల్ల ఏర్పడే బుధాదిత్య యోగం కొన్ని రాశుల వారి జాతకాలను పూర్తిగా మార్చేస్తుంది అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు. ఈ అదృష్ట యోగం వల్ల విపరీతమైన ధన లాభాన్ని, విజయాన్ని అందుకోబోతున్న ఆ ఐదు రాశుల వివరాలు ఇప్పుడు చూద్దాం.
1.మిథున రాశి
ఈ బుధాదిత్య రాజయోగం మిథున రాశిలోనే ఏర్పడుతుండటంతో ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగ రంగంలో మీ నాయకత్వ నైపుణ్యాలను నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగం నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం పెరగడంతో పాటు గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి.
2.సింహ రాశి
సింహ రాశి వారికి ఈ గ్రహాల కలయిక ఎంతో మేలు చేస్తుంది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. సొంత ఇల్లు, భూమి లేదా కొత్త వాహనాలు కొనాలనే మీ కల నెరవేరుతుంది. తండ్రి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది, ఆయన ఇచ్చే ఆర్థిక సలహాలు మీకు బాగా కలిసివస్తాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి స్నేహితుల సహాయంతో వ్యాపార విస్తరణ సాధ్యమవుతుంది. మీ మాటతీరుతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు.
3.కన్యా రాశి
కన్యా రాశి వారికి బుధాదిత్య యోగం వల్ల కెరీర్, ఆర్థికం, కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. పెండింగ్ పనులన్నీ వేగవంతం అవుతాయి. వ్యాపారాల నిమిత్తం చేసే ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి. ఉద్యోగస్తులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల మెప్పు పొంది, పెద్ద విజయాలు సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ధన ప్రవాహం పెరగడం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.
4.తులా రాశి
తులా రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అండగా నిలుస్తుంది. దైవబలంతో పనులన్నీ సజావుగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబం నుంచి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలు, కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. ఆదాయ వనరులు పెరిగి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
5.ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ కాలం విశేష లాభాలను తెచ్చిపెడుతుంది. కార్యాలయంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉన్నతాధికారులు మీ పనితీరును అభినందిస్తారు. వ్యాపారులకు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. వివాహిత జంటల మధ్య పరస్పర అవగాహన పెరిగి దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. కొత్త మార్గాల ద్వారా ఆదాయం సమకూరడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


