Calendar Vastu: కొత్త క్యాలెండర్‌ని ఇంటికి ఏ రోజు తీసుకు వస్తే కలిసి వస్తుంది? వాస్తు నియమాలు తెలుసుకోండి!
Calendar Vastu: వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన వాస్తు దోషాల నుంచి కూడా బయటపడవచ్చు. మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త సంవత్సరంలో క్యాలెండర్‌ని ఇంటికి తెచ్చుకునేటప్పుడు కూడా కొన్ని నియమాలనే పాటించాలి.
చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. అలాగే ఇంటిని కూడా వాస్తు ప్రకారం నిర్మించుకుంటారు. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి కలిగి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన వాస్తు దోషాల నుంచి కూడా బయటపడవచ్చు.

మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త సంవత్సరంలో క్యాలెండర్‌ని ఇంటికి తెచ్చుకునేటప్పుడు కూడా కొన్ని నియమాలనే పాటించాలి. కొత్త సంవత్సరం క్యాలెండర్ ఇంటికి తీసుకు వచ్చేటప్పుడు ఏ రోజు తీసుకువస్తే మంచిదో తెలుసుకుందాం.
కొత్త సంవత్సరం క్యాలెండర్ విషయంలో పాటించాల్సిన వాస్తు నియమాలు
క్యాలెండర్ అంటే కేవలం తేదీలు, వారాలు కాదు; సరస్వతి చిహ్నంగా కూడా భావిస్తారు. క్యాలెండర్‌ని ఇంటికి తెచ్చుకునేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తే మంచిది. కొన్ని రోజుల్లో క్యాలెండర్‌ని ఇంటికి తీసుకు రావడం వలన అదృష్టం కలిసి రాదు. కొన్ని రోజుల్లో క్యాలెండర్ ఇస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి.
క్యాలెండర్‌ని ఏ రోజుల్లో ఇంటికి తీసుకు రావాలి?
- క్యాలెండర్‌ని ఇంటికి తెచ్చుకునేటప్పుడు సోమవారం, బుధవారం, గురువారం తీసుకువస్తే చాలా మంచిది. ఇది అద్భుతంగా కలిసి వస్తుంది.
- సోమవారంనాడు క్యాలెండర్‌ని తెచ్చుకోవడం వలన చంద్రుని ప్రభావం పడి ప్రశాంతత ఉంటుంది. మానసిక ప్రశాంతతని పొందడానికి వీలవుతుంది. శ్రేయస్సు కలుగుతుంది. అనందం ఉండచ్చు. చంద్ర అనుగ్రహంతో సమస్యలన్నీ కూడా తీరిపోతాయి.
- బుధవారం నాడు క్యాలెండర్‌ని ఇంటికి తెచ్చుకోవడం వలన కెరీర్‌లో విజయాలను అందుకోవచ్చు. శుభ ఫలితాలు కలిగి సంతోషంగా ఉండొచ్చు.
- అలాగే గురువారం నాడు క్యాలెండర్ తెచ్చుకోవడం చాలా మంచి రోజు. గురువారం నాడు ఇంటికి క్యాలెండర్‌ని తీసుకు రావడం వలన ఆర్థిక శ్రేయస్సు ఉంటుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది.
ఏ రోజుల్లో తీసుకు రాకూడదు?
క్యాలెండర్‌ని ఇంటికి తెచ్చుకునేటప్పుడు మంగళవారం, శుక్రవారం, శనివారం తీసుకు వస్తే అంతలా కలిసి రాదు. సోమవారం, బుధవారం, గురువారం తెచ్చుకుంటే మాత్రం శుభ ఫలితాలు కలిగి సంతోషంగా ఉండొచ్చు. పైన చెప్పిన విధంగా లాభాలను పొందడానికి వీలవుతుంది. ఆనందంగా ఉండవచ్చు. సమస్యలన్నీ తొలగిపోతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


