హిందూ సంప్రదాయంలో పూజ అనేది కేవలం ఒక మొక్కుబడి వ్యవహారం కాదు. అది దైవంతో అనుసంధానమయ్యే ఒక పవిత్ర ప్రక్రియ. భక్తి, శ్రద్ధ, ఆత్మసమర్పణతో చేసే పూజ మాత్రమే పూర్తి ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతుంటారు. అయితే నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలామంది దేవుడి గదిలోకి వెళ్లి నిలబడే దండం పెట్టుకుని, హడావుడిగా బయటకు వచ్చేస్తుంటారు. శాస్త్రాల ప్రకారం ఇలా నిలబడి పూజ చేయడం సరైంది కాదు. పూజ ఎప్పుడూ ప్రశాంతంగా, ఒక ఆసనం మీద కూర్చుని మాత్రమే చేయాలి. అసలు నిలబడి పూజ చేయడం వల్ల కలిగే నష్టాలేంటి? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.
నిలబడి పూజ చేయడం వల్ల నష్టాలేంటి?

శాస్త్రాల ప్రకారం నిలబడి పూజ చేయడం వల్ల మనసు స్థిరంగా ఉండదు. మనం నిలబడినప్పుడు మన శరీరంలోని ఆలోచనలు, ఏకాగ్రత చెదిరిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల భక్తిలో సంపూర్ణత లోపిస్తుంది. "నిలబడి చేసే పూజ వల్ల పూర్తి ఫలితం దక్కదు," అని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు. ఇక వాస్తు పరంగా చూస్తే, కొంతమంది ఇంట్లో దేవుడి విగ్రహాలను ఎత్తులో పెడుతుంటారు. దీనివల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నిలబడి పూజ చేయాల్సి వస్తుంది. ఇది వాస్తు దోషాలకు దారితీస్తుంది. ఫలితంగా ఇంట్లో ప్రతికూల శక్తి పెరగడం, ఆర్థిక ఇబ్బందులు లేదా మనశ్శాంతి కరువవ్వడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
కూర్చుని పూజ చేయడం వెనుక పరమార్థం
దైవ ప్రార్థన చేసేటప్పుడు సంపూర్ణ శరణాగతి ముఖ్యం. మనం ఆసనం వేసుకుని కూర్చున్నప్పుడు మన శరీరం, మనస్సు ఒకే స్థితిలోకి వస్తాయి. కూర్చుని పూజ చేయడం వల్ల శరీరంలోని శక్తి భూమిలోకి వెళ్ళిపోకుండా ఆసనం అడ్డుకుంటుంది. దీనివల్ల మనలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. పూజ ముగిసిన తర్వాత హారతి ఇచ్చే సమయంలో మాత్రమే నిలబడాలి. మంత్ర పఠనం, ధ్యానం, పూజా కార్యక్రమాలన్నీ కూర్చుని చేయడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది.
ఆసనం, దిశల ప్రాముఖ్యత
పూజ చేసేటప్పుడు నేరుగా నేల మీద కూర్చోకూడదు. శుభ్రమైన వస్త్రం లేదా దర్భాసనం వంటి వాటిని ఉపయోగించాలి. ఆసనం మీద కూర్చోవడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించబడుతుంది. పూజ చేసేటప్పుడు ముఖం ఎప్పుడూ తూర్పు దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. అలాగే వస్తువుల అమరిక కూడా ప్రధానమే:
{{/usCountry}}పూజ చేసేటప్పుడు నేరుగా నేల మీద కూర్చోకూడదు. శుభ్రమైన వస్త్రం లేదా దర్భాసనం వంటి వాటిని ఉపయోగించాలి. ఆసనం మీద కూర్చోవడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించబడుతుంది. పూజ చేసేటప్పుడు ముఖం ఎప్పుడూ తూర్పు దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. అలాగే వస్తువుల అమరిక కూడా ప్రధానమే:
{{/usCountry}}మీ కుడి చేతి వైపు గంట, ధూపం, దీపం ఉండాలి.
ఎడమ చేతి వైపు పండ్లు, పూలు, శంఖం, జలపాత్ర ఉండాలి.
దేవుడి పీఠం ఎప్పుడూ మీరు కూర్చునే ఆసనం కంటే ఎత్తులో ఉండాలి.
పూజలో పాటించాల్సిన ముఖ్య నియమాలు
పూజకు కూర్చునే ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజ చేస్తున్నంత సేపు మనసు ఇతర విషయాల మీదకు మళ్లకుండా దైవంపైనే లగ్నం చేయాలి. పూజ ముగిసిన తర్వాత మనం చేసిన తప్పులను క్షమించమని భగవంతుడిని ప్రార్థించాలి. వంటగదిలో లేదా పడకగదిలో పూజ చేయడం అంత శ్రేయస్కరం కాదు. ప్రశాంతమైన, ప్రత్యేకమైన పూజా గదిలోనే ఆరాధన సాగాలి.
సరైన విధానంలో పూజ చేస్తే కలిగే లాభాలు
శాస్త్రోక్తంగా, ప్రశాంతమైన మనసుతో పూజ చేస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. వాస్తు దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. క్రమశిక్షణతో కూడిన పూజా విధానం మనకు మానసిక ప్రశాంతతను, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయి.
గుర్తుంచుకోండి, పూజ అనేది హడావుడిగా ముగించే పని కాదు. పూర్తి శ్రద్ధతో, నియమబద్ధంగా చేస్తేనే ఆ దైవ అనుగ్రహం మనకు లభిస్తుంది.
గమనిక: ఈ కథనంలోని అంశాలు మత గ్రంథాలు, జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాల ఆధారంగా అందించాం. దీనిని ధృవీకరించే శాస్త్రీయ ఆధారాలు లేవు. పూర్తి వివరాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.