...
...
Next Story

మహిళలు శివలింగాన్ని పూజించవచ్చా? శివ మహాపురాణం చెప్పిన అసలు నిజం ఇదే!

మహిళలు శివలింగాన్ని పూజించకూడదనే ప్రచారానికి శివ మహాపురాణంలో ఎలాంటి ఆధారం లేదని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. మహిళలు నిరభ్యంతరంగా శివలింగాన్ని పూజించవచ్చు. ప్రసవం జరిగిన తర్వాత సూతక కాలమైన పది రోజుల పాటు మానసికంగా శివుడిని ఆరాధించి, అనంతరం యథావిధిగా పూజ కొనసాగించాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి.

Published on: Aug 4, 2026, 16:00:28 IST
Advertisement

హిందూ ధర్మంలో భోలాశంకరుడి పూజకు ఎంతో విశిష్టత ఉంది. అయితే, మహిళలు శివలింగాన్ని పూజించవచ్చా లేదా అనే అంశంపై సమాజంలో ఎప్పటి నుంచో కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. చాలా మంది మహిళలు శివలింగాన్ని తాకకూడదని, పూజించకూడదని భావిస్తుంటారు. కానీ, వాస్తవానికి ఇది పూర్తిగా అవాస్తవం. మహిళలు నిరభ్యంతరంగా శివలింగాన్ని పూజించవచ్చని మన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.

శివ మహా పురాణంలో స్పష్టమైన నిబంధనలు

మహిళలు శివలింగాన్ని పూజించవచ్చా? శివ మహాపురాణం చెప్పిన అసలు నిజం ఇదే!
మహిళలు శివలింగాన్ని పూజించవచ్చా? శివ మహాపురాణం చెప్పిన అసలు నిజం ఇదే!

శివమహాపురాణంలో మహిళల శివ పూజ గురించి చాలా స్పష్టంగా ప్రస్తావించారు. కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే చిన్నపాటి నియమాలు పాటించాల్సి ఉంటుంది. సాధారణంగా శివ పూజ చేసే ఆచారం ఉన్న మహిళల ఇంట్లో ప్రసవం జరిగితే, ఆ తర్వాత పది రోజుల పాటు 'సూతక' కాలం వర్తిస్తుంది.

ఈ పది రోజుల పాటు వారు శివుడిని ప్రత్యక్షంగా పూజించకుండా, మనసారా పూజ చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ పది రోజులు ముగిసిన తర్వాత, కుటుంబ ఆచారాల ప్రకారం యథావిధిగా శివలింగ పూజను ఆచరించవచ్చు. కాబట్టి మహిళలకు శివపూజాధికారం లేదనే మాటలో ఎలాంటి నిజం లేదు.

పురాణాల్లో మహిళా భక్తుల ఉదాహరణలు

కాశీఖండం ప్రకారం దేవుడిని ఆరాధించే హక్కు ప్రతి ఒక్కరికీ సమానంగా ఉంటుంది. లక్ష్మీదేవి స్వయంగా ఎంతో శ్రద్ధతో పార్థివ శివలింగ పూజ చేసి, ఆ శంకరుడి అనుగ్రహం వల్లే సర్వ సౌభాగ్యాలను పొందింది. అలాగే పార్వతీదేవి కఠినమైన తపస్సు ఆచరించిన తర్వాతే ఆ పరమశివుడిని భర్తగా పొందగలిగింది.

ఇందుకు సంబంధించి శివపురాణంలో మరొక అద్భుతమైన గాథ ప్రచారంలో ఉంది. 'ఘుష్మ' అనే భక్తురాలు ప్రతిరోజూ అత్యంత భక్తిశ్రద్ధలతో శివారాధన చేసేది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ మహిళ భక్తుల కష్టాలు తీర్చడానికి తన పేరు మీదే ఇక్కడే వెలవాలని కోరుకుంది.

మహిళలు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించుకోవచ్చా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. నిరభ్యంతరంగా ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవచ్చు, అలాగే ఆలయానికి వెళ్లి కూడా పూజలు చేయవచ్చు. అయితే ఇంట్లో శివలింగం పెడితే మాత్రం ప్రతిరోజూ ఎంతో నిష్టతో, క్రమం తప్పకుండా విధివిధినాల ప్రకారం పూజించాలి.

శివ మహాపురాణంలో ఎక్కడా కూడా ఇంట్లో శివలింగం పెట్టకూడదని చెప్పలేదు. బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పినట్లుగా.. ఇళ్లలో బంగారం, వెండి, మట్టి లేదా ఇతర లోహాలతో తయారు చేసిన చిన్న శివలింగాలను ప్రతిష్టించుకుని రోజూ పూజలు చేసుకోవచ్చు. దీనివల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరిగి ఆ శివుడి కృప కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉంటుందని పండితులు వెల్లడిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe